అమరావతి: తుది ఓటరు జాబితాలోనూ అనేక తప్పులు దొర్లాయని, వాటిని సరిచేయాలని ఎన్నికల సంఘానికి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి సోమవారం షరీఫ్ మూడు లేఖలు రాశారు. ముసాయిదా జాబితాలో తప్పులను గుర్తించి టీడీపీ ప్రతినిధులు ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి తీసుకువచ్చినప్పటికీ, ఎలాంటి చర్యలు తీసుకోకుండా తుది జాబితా విడుదల చేశారన్నారు. తక్షణమే ఓటర్ జాబితాలోని తప్పుల్ని సరిదిద్దాలని కోరారు. ఓటర్ కార్డుల్లో పేర్లు, ఇంటి నెంబర్లు తప్పులున్నాయి. మరణించిన వారి పేర్లను జాబితా నుండి తొలగించలేదు. మరణించిన వారి పేరుతో ఒకటికి మించిన ఓట్లున్నాయి. ఒకే డోర్ నెంబర్లతో వందలాది ఓట్లు ఇంకా కొనసాగుతున్నాయి. ఒకే వ్యక్తికి వేర్వేరు నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నాయి. క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా స్థానికంగా లేరంటూ వేలాది ఓట్లు తొలగించారు. జిల్లాల వారీగా ఓట్ల అవకతవకలపై ఆధారాలు సమర్పించారు. ఓటర్ జాబితాలోని తప్పిదాలపై సాక్ష్యాధారాలు, పలు పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను అందించారు. తక్షణమే ఓటర్ జాబితాలను ప్రక్షాళన చేయాలి. ప్రజాస్వామ్యంలో పౌరుల హక్కుల్ని కాపాడాలని ఎన్నికల సంఘం అధికారులకు షరీఫ్ విజ్ఞప్తి చేశారు. జిల్లాల వారీగా ఓట్ల అవకతవకలపై ఆధారాలు సమర్పించారు. ఓటరు జాబితాలో తప్పులపై మచ్చుకు కొన్ని నిదర్శనాలను తన లేఖలో పేర్కొన్నారు.
1. గుంటూరు జిల్లా – నర్సరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం
శ్రీనియోజకవర్గంలోని తుది ఓటరు జాబితాలో డబుల్ ఎంట్రీలు/మరణించిన ఓటర్లు ఇప్పటికీ ఉన్నారు. శ్రీలాలమ్మ పేరుతో రెండు ఓట్లు ఉన్నాయి. కొండలరాయునిపాలెంలో – పీఎస్.నెం:217, అల్లీబాయిపాలెం గ్రామం పీఎస్. నం:284.
శ్రీఉప్పలపాడులో నివాసముంటున్న నక్కా నిహారికకు రెండు ఓట్లు ఉన్నాయి. పీఎస్.నెం: 260లో ఓటు నెం.1203, 1207
2. పల్నాడు జిల్లా, వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గం
శ్రీవినుకొండ పట్టణంలోని 8వ వార్డు కౌన్సిలర్ పాపసాని బ్రహ్మయ్యకు వినుకొండ పట్టణంలోనూ, మతుకుమల్లి గ్రామంలో 2119279 నెంబరుతో రెండు ఓట్లు ఉన్నాయి.
శ్రీమతుకుమల్లి గ్రామంలో కుంచేటి నాగరాజుకు కూడా రెండు ఓట్లు వచ్చాయి. నం. 890, 891
శ్రీమతుకుమల్లిలో యరగుంట్ల లావణ్య, ఆర్.శ్రీనివాసరావు, ఆర్.మౌనిక, ఎం.అనూష, ఎస్.లక్ష్మి, పి.హేమంత్, గుంటూరు గోపి, ఉదయగిరి యలమంద వంటి మరికొందరికి కూడా రెండు ఓట్లు ఉన్నాయి.
3. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం
శ్రీసత్తెనపల్లి పట్టణంలో, ‘‘మునిసిపల్ ఆఫీస్ దగ్గర’’, అనే డోర్ నెంబర్‌తో 32 నుండి 63 నెంబర్ పోలింగ్ కేంద్రాల్లో అనేక ఓట్లు నమోదయ్యాయి.
శ్రీమున్సిపల్ ఆఫీస్ సమీపంలో అనే డోర్ నెంబరతో వందలాది ఓట్లు నమోదయ్యాయి. కొన్ని సందర్భాల్లో పిన్‌కోడ్ ను డోర్ నెంబర్‌గా పేర్కొన్నారు.
శ్రీ84, 75 నెంబర్ గల పోలింగ్ స్టేషన్లలో కొన్ని ఓట్లు, ఓటరు పేర్లు హిందీ భాషలో ఉన్నాయి.
4. గుంటూరు జిల్లా – తాడికొండ
శ్రీసంబంధిత ఓటర్ల నుండి ఎలాంటి వివరణ తీసుకోకుండానే ‘‘నివాసం ఉండటం లేదు’’ అనే కారణంతో పలువురి ఓట్లు తొలగించేశారు.
శ్రీసురేష్ బాబు బిల్లూరి, కోమలి బిల్లూరి, ప్రభాకర్ రావు బిల్లూరి, నాగ లక్ష్మి బిల్లూరి, నాగేశ్వరమ్మ బిల్లూరి లింగాపురం గ్రామంలో నివాసం ఉంటున్నారు, అయితే వారికి మల్లాది గ్రామంలో కూడా ఓట్లు ఉన్నాయి.
శ్రీముసాయిదా ప్రచురణ సమయంలో పైన పేర్కొన్న లోపాలు బయటపడినప్పటికీ తుది ఓటర్ల జాబితాలో ఎలాంటి సవరణలు/మార్పులు చేయలేదు.
5. చిత్తూరు జిల్లా- నగరి
శ్రీకార్వేటినగరం గ్రామంలో స్థానికంగా నివాసం ఉండని, మరణించిన వారి పేర్లను పెద్దసంఖ్యలో తుది ఓటర్ల జాబితాలో ఉంచేశారు. 91వ నెంబర్ పోలింగ్ స్టేషన్ లో లక్ష్మీ దేవమ్మ అనే మహిళ చాలా కాలం క్రితం మరణించినా వరుస సంఖ్య 610తో ఆమె ఓటు అలాగే ఉంచేశారు.
6.చిత్తూరు జిల్లా-పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గం
శ్రీబైరెడ్డిపల్లె గ్రామంలో పి.ఎస్. 104 లో సీరియల్ నెంబర్లు 7, 8 లో ‘‘శిరీష’’ అనే పేరు మీద రెండు ఓట్లు ఉన్నాయి. 6, 17 సీరియల్ నెంబర్లతో ‘భార్గవ శంకర్’’ పేరు మీద రెండు ఓట్లు ఉన్నాయి.
శ్రీ103వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో సీరియల్ నెంబర్లు 4, 21.. 7, 201.. 217, 555.. 584, 983 డబుల్ ఎంట్రీలు ఉన్నాయి
శ్రీపెదపంజాణి మండలంలో, ఒకే కుటుంబానికి చెందిన ఓట్లు వివిధ పోలింగ్ స్టేషన్లలో ఉన్నాయి, సింగిల్ విండో చైర్మన్ ఓబులు రెడ్డి భార్య కు 27వ నెంబర్ పోలింగ్ కేద్రంలో, వారి కుమారుడు మౌని అకిల్ 26వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో ఓటు ఉంది. విచిత్రమేమిటంటే వారిద్దరూ ఆ గ్రామ నివాసితులు కాదు.
శ్రీరెడ్డి అప్పారెడ్డి నాలుగేళ్ల క్రితమే చనిపోయినా సీరియల్ నెంబర్ 266తో ఆయన ఓటు అలాగే ఉంచేశారు.
7. తిరుపతి జిల్లా-తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం
శ్రీతిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రం పంచాయతీలోని 216, 217, 218, నెంబర్ పోలింగ్ స్టేషన్లలో గ్రామం నుంచి వలస వెళ్లిన ఓట్లను తొలగించలేదు.
శ్రీ216, 217 నెంబర్ పోలింగ్ స్టేషన్లలో ఎప్పుడో చనిపోయిన ఏడుగురి ఓట్లు అలాగే ఉంచేశారు.
8. తిరుపతి జిల్లా – చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం
శ్రీచంద్రగిరి మండలం అగరాల గ్రామంలో, 123 నెంబర్ పోలింగ్ స్టేషన్ పరిధిలోని ఓటర్ల జాబితాలో గ్రామంలో ఎవరికీ తెలియని వ్యక్తుల పేర్లు అనేకం ఉన్నాయి. ఉదాహరణ: సీరియల్ నెంబర్లు 865, 866, 870.
శ్రీఅగరాల గ్రామంలో ఇళ్లకు డోర్ నంబర్లు కేటాయించలేదు. కానీ 2-01, 3-96 డోర్ నెంబర్లతో ఓటర్లను నమోదు చేశారు.
శ్రీఅగరాల గ్రామంలో వరుససంఖ్య సంఖ్య 877 నుండి 16 మంది ఓటర్లందరికీ ‘‘తండ్రి/భర్త’’ కాలమ్‌లో ఒకే పేరు ఉంది.
9. గుంటూరు జిల్లా – గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం
శ్రీనియోజకవర్గంలోని తుది ఓటరు జాబితాలో డబుల్ ఎంట్రీలు/మరణించిన ఓటర్లు ఇప్పటికీ కనిపిస్తారు.
శ్రీపాత, కొత్త డోర్ నంబర్లతో ఓటరు జాబితాలు గందరగోళంగా ఉన్నాయి, ఒకదానితో ఒకటి కలిసిపోయాయి
శ్రీషేక్ గౌసియా బేగం మరియు సయ్యద్ నబీ పేర్లపై డబుల్ ఎంట్రీలు ఉన్నాయి. కోబాల్ట్ పేట నివాసి దాసరి జయమ్మ చాలా కాలం క్రితం మరణించారు, అయితే ఆమె ఓటు ఇప్పటికీ ఓటర్ల జాబితాలో ఉంది. ముసా యిదా ఓటర్ల జాబితా ప్రచురణ సందర్భంగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు.
శ్రీఅదేవిధంగా ప్రతి పోలింగ్ స్టేషన్‌లో దాదాపు 30-35, చనిపోయిన లేదా డబుల్ ఎంట్రీలు ఉన్నాయి, వీటిని సవరించాలి.
శ్రీగుంటూరు జిల్లాలో చాలా మంది ఓటర్లు ‘‘ఆశ్రయం లేనివారు’’గా నమోదయ్యారని మరింత సమాచారం. అయితే ఈ ఓటర్లు అసలు ఆ స్థలంలో నివసిస్తున్నారా లేదా అనే విషయంపై వెరిఫికేషన్ సరిగ్గా జరగలేదు.
10. నంద్యాల జిల్లా-పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం
శ్రీకల్లూరు మండలం పాతపేట గ్రామంలో 240 నెంబర్ పోలింగ్ స్టేషన్ పరిధిలో వరుస సంఖ్య: 56 గా నమోదైన ఓటరు స్వర్ణ లత 7 సంవత్సరాల నుండి చెన్నైలో నివాసం ఉంటు న్నారు. వరుస సంఖ్య: 62గా నమోదైన ఓటరు హారతి కర్నూలు జిల్లాలో నివాసం ఉంటున్నారు. వరుస సంఖ్య: 86గా నమోదైన ఓటరు శిరీష 4 సంవత్సరాల నుండి కాణి పాకం పట్టణంలో నివాసం ఉంటోంది. వరుస సంఖ్య: 124 గా నమోదైన ఓటరు దివ్యభార్గవి చౌడేపల్లిలో ఉంటున్నారు. వరుస సంఖ్య: 154గా నమోదైన ఓటరు గుడ్లూరు గ్రామంలో నివాసం ఉంటున్నారు. వరుస సంఖ్య: 282 గా నమోదైన ఓటరు సులోచన తిరుపతిలో నివాసం ఉంటోంది
శ్రీపోలింగ్ స్టేషన్ 233 పరిధిలోని కోసం వరుస సంఖ్య 759 నెంబర్ గల ఓటరు సంతోష్ కుమార్ చిరునామాలో డోర్ నెంబర్ బదులు గా అతడి మొబైల్ నంబర్ నమోదు చేశారు.
11. చిత్తూరు జిల్లా
శ్రీకుప్పం పట్టణంలో డబుల్ ఎంట్రీలు, చని పోయిన ఓటర్లు, ఫోటోలు లేని ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. కొందరు ఓటర్ల పేర్లు కూడా తమిళ, కన్నడ భాషల్లో ముద్రించారు. కొన్ని ఫోటోలు గుర్తించేందుకే వీలు లేకుండా ఉన్నాయి. ఉదాహరణ: 183 నెంబర్ పోలింగ్ స్టేషన్ పరిధిలోని వరుససంఖ్యలు 1123, 1141, 1227. ఓట్లు. చాలా ఓట్లు సున్నా డోర్ నంబర్‌లతో ఉన్నాయి.
శ్రీపూతలపట్టు మండలంలో చాలా మంది ఓటర్ల ఫొటోలు అసలు కనిపించని విధంగా ఉన్నా యి. ఉదా: పోలింగ్ స్టేషన్ 49 పరిధిలోని వరుస సంఖ్యలు 136, 165 ఓటర్లు
శ్రీఅనేక నియోజకవర్గాల జాబితాల్లో ఓటర్ల ఫోటోలు గుర్తించలేని విధంగా, అస్పష్టంగా ఉన్నాయి. చిత్తూరు పట్టణంలో 311, నగరిలో 237, పుంగనూరులో 223, పూతలపట్టులో 217, పలమనేరులో 198, కుప్పంలో 87 ఓట్లు ఈ విధంగా ఉన్నాయి.
శ్రీకొందరి ఓటర్ల ఫొటో స్థానంలో పాసుపుస్తకాల ఫొటోలు, ఆధార్ కార్డులు ముద్రించారు.
12. ఎన్టీఆర్ జిల్లా – విజయవాడ నగరం
శ్రీఓటర్ల జాబితాలో మృతుల సంఖ్య పెద్దసంఖ్య లో ఉంది. 18-3-18/3ఏ డోర్ నెంబర్ అసలు లేదు. కానీ అదే చిరునామాతో వరుస సంఖ్య 174ఉన్న ఓటరు జాబితాలో ఉన్నారు.
శ్రీగాయత్రి, యేసు రాజు, శివ నాగరాజు, యేసు బాబు పేరు మీద ఓట్లు వారు నివాసం ఉంటు న్న విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజక వర్గంలోని మల్లికార్జునపేటలో కాకుండా వేరే ప్రాంతంలో ఉన్నాయి. ఫోటోలు స్పష్టంగా కనిపించని ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
13.తిరుపతి జిల్లా-శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గం
శ్రీశ్రీకాళహస్తి మండలం ముచ్చివోలు గ్రామంలో చనిపోయిన వ్యక్తి పేరుతో ఫారం-7 క్లెయిమ్ లు దాఖలయ్యాయి. ఈ ఆరోపణల ఆధారంగా స్థానికఅధికారులు చర్యలుచేపట్టారు.గ్రామంలో ఇలాంటికేసులు 38కేసులు ఉన్నాయి. వాటిని ఓటరుజాబితాలో ధృవీకరించి సరిచేయాలి. కావున ఈ విషయంలో సంబంధిత జిల్లా ఎన్ని కల అధికారి/కలెక్టర్‌కు ఆదేశాలుజారీచేయాలి.
శ్రీఓటరు జాబితాలో అక్రమాలు, అవకతవకలపై తాను ఉదహరించిన తప్పులు చాలా స్వల్పమ ని, వాస్తవానికి ఈ సంఖ్య ఇంకా చాలా ఎక్కు వేనని షరీఫ్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం అధికారులు తక్షణం జోక్యం చేసుకుని తప్పులు సరిదిద్ది, ఓటరు జాబితాను ప్రక్షాళన చేయాలని కోరారు.