అమరావతి: రాష్ట్ర పోలీసు శాఖలో ఏఆర్ కాని స్టేబుల్‌గా పని చేస్తూ.. కొద్దిరోజుల క్రితం సర్వీస్ నుంచి తొలగించబడిన అనంతపురం జిల్లాకు చెందిన ప్రకాష్ టిడిపి అధినేత చంద్రబాబును కలిశారు. పోలీసు శాఖలో సమస్యలు, పెండింగ్ నిధుల విడుదలపై ప్ల కార్డు పట్టుకున్నందుకు తనను ప్రభుత్వం ఎలా వేధిస్తోందో వివరించారు. తనను అక్రమ కేసులో ఇరికించి ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా.. ఇప్పుడు కూడా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ప్రకాష్ ఆవేదన వ్యక్తంచేశారు. తనకు ప్రాణభయం ఉందని..అండగా నిలవాలని ప్రతిపక్ష నేత చంద్రబాబును కోరారు. ప్రకాష్‌తో పాటు గార్ల దిన్నెకు చెందిన లక్ష్మి కూడా చంద్రబాబును కలిశారు. తన భర్త విషయంలో తాను పోలీసులను ఆశ్రయించగా..ఆ కేసును పూర్తిగా తప్పుదోవపట్టించి ప్రకాష్ ను డిస్మిస్ చేశారని ఆమె తెలిపింది. తాను ప్రకాష్ కు ఎటువంటి డబ్బు బంగారం ఇవ్వలేదని,తనను ప్రకాష్ ఎక్కడా వేధించలేదని లక్ష్మి తెలిపింది. ఇదే విషయం తాను మీడియాలో చెప్పిన తరవాత తనపైనా వేధింపులు తీవ్రం అయ్యాయని ఆమె విలపిస్తూ చెప్పింది. తాను న్యాయపోరాటం చెయ్యడానికి సిద్దంగా ఉన్నానని.. తమకు అండగా నిలవాలని ప్రకాష్ టిడిపి అధి నేత చంద్రబాబును కోరారు. ధైర్యంగా ఉండాలని, ప్రతిపక్ష పార్టీగా తాము అండగా ఉంటామని చంద్రబాబు చెప్పారు.