అమరావతి(చైతన్యరథం): కర్నూలు జిల్లాలో టీడీపీ నేత శ్రీనివాసులు హత్యను పార్టీ ఏపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తీవ్రంగా ఖండిరచారు. పత్తికొండ నియోజకవర్గం హోసూరులో టీడీపీ పెద్ద మెజారిటీ రావడంలో శ్రీనివాసులుది కీలకపాత్ర అని పేర్కొన్నారు. దీంతో ఆయనపై కక్ష పెంచుకున్న వైసీపీ నేతలు బుధవారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన సమయంలో కళ్లలో కారం చల్లి అత్యంత కిరాతకంగా హత్య చేశారని మండిపడ్డారు. హత్య వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని పల్లా శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు.