- రాయచోటి సీఐపై దాడిని ఖండిస్తున్నాం.. దుండగుల వెనుకఉన్న వారిపై చర్యలు తీసుకోవాలి
- గతంలో రౌడీలను పోలీసులు కొట్టేవారు, ఇప్పుడు అంతా రివర్స్
- చేతులు ముడుచుకు కూర్చున్న రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం స్పందించాలి
అమరావతి: జగన్‌రెడ్డి పాలనలో రౌడీలే పోలీసుల పై దాడులకు పాల్పడుతున్న విశృంఖలత్వాన్ని చూస్తు న్నామని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. రాయచోటి సీఐపై దాడిని ఖండిస్తున్నామని, వారికి అండగా నిలిచినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసుల పరిస్థితి చాలా దయనీయంగా మారిందన్నారు. పాలు పోసి పెంచిన పాము, వారినే కాటేసినట్లు పోలీసుల దుస్థితి ఉంది. గతంలో రౌడీల ను పోలీసులు కొట్టేవారు. ఇప్పుడు రౌడీలే పోలీసులను కొడుతున్నారు. రాయచోటి ఇన్స్పెక్టర్ అనిల్‌ని వైసీపీ నాయకులు చితకబాదితే రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఏం చేస్తోంది? గతంలో ప్రతిపక్షాల మీద మీసం మెలేసి తొడగొట్టిన అసోసియేషన్, ప్రస్తుతం పోలీసులనే కొడుతుంటే ఏం చేస్తోంది? అధికార పార్టీ వారితో గొడవలెందుకని సీఐ అనిల్‌కు పోలీసు ఉన్నతా ధికారులు సర్ది చెప్పడం అమానుషం, బాధాకరం. ఆ పై అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. సీఐ ని కొడుతున్నారని, రక్షించండని సీఐ అనిల్ భార్య శ్వేత 100 నెంబర్‌కు ఫోన్ చేసి సహాయం అడగడం ఈ ప్రభుత్వానికి చాలా సిగ్గుచేటు. ఈ విషయంపై సీఎం, హోంమంత్రి సమాధానం చెప్పాలి. పోలీసులకే రక్షణ లేకపోతే ఇక రాష్ట్రంలో సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉంటుందని వర్ల ప్రశ్నించారు.
వైసీపీ దాడుల్లో పోలీసులు కూడా బాధితులే
వైసీపీ దాడుల్లో సామాన్య ప్రజలే కాదు పోలీసులు కూడా బాధితులే. రాయచోటి సీఐ అనిల్‌కుమార్‌పై దాడిని ఖండిస్తున్నాం.. దాడిచేసిన దుండగులు, వారికి అండగా నిలిచిన అధికారులపై వెంటనే తప్పక చర్యలు తీసుకోవాలి. పోలీసుల పరిస్థితే ఇలా ఉంటే ఇక వైసీపీ గూండాల దాడి నుంచి తమను కాపాడేదెవరని కడప ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కడప జిల్లా రాయ చోటి సీఐ అనిల్‌కుమార్‌ను వైసీపీ నాయకులు తన్ని, తరిమి కొట్టడం అతి దారుణం. గతంలో ఇలాంటి సం ఘటనలు ఎన్నో జరిగినా అటు పోలీసు ఉన్నతాధికారు లు,ఇటు పోలీసు అధికారుల సంఘం పట్టించుకోలేదు. విజయవాడ కృష్ణలంక పీఎస్‌లో హెడ్ కానిస్టేబుల్‌ను, కానిస్టేబుల్‌ను వైసీపీ నాయకుడు కొడితే దిక్కులేకుండా పోయింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు ఎస్ఐని సినిమా స్టయిల్లో చుట్టుముట్టి కొడితే రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఏం చేసింది? హిందూపురం టు టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌ను కొట్టినా కాపాడేవారు లేకపోయారు.పెన్నా నది నుంచి ఇసుకను తరలిస్తుంటే అదుపు చేయడానికి వెళ్లిన సిఐపై దాడి జరిగితే పోలీసు అధికారుల సంఘం చేతులు ముడుచు కు కూర్చుంది. పల్నాడులో ఓ కానిస్టేబుల్‌కు రక్తం కారేలా ముక్కు పగులగొట్టినా చర్యలు లేవు. విశాఖ జిల్లా, మూకవరపాడులో అర్థరాత్రి వీరంగం సృష్టించిన బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ బంధువులను పోలీసులు ఆపి ప్రశ్నించినందుకు ఎంపీ, అతని అను చరులు కలిసి ఎస్ఐ, కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డారు. తిరుపతి, సూళ్లూరుపేట ఎస్ఐ రవి బాబు రికార్డుల్లో రౌడీ షీటర్లుగా ఉన్నవారిని స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వటంలో భాగంగా రౌడీషీటర్ అయిన మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు కళత్తూరు సునీల్‌రెడ్డిని కూడా పిలిపించినందుకు అధికార పార్టీ నాయకుడు అయిన తనను ఇతర రౌడీషీటర్ల తరహాలో పరిగణించడంతో సునీల్‌రెడ్డి రెచ్చిపోయి ఎస్ఐతో వాగ్వాదానికి దిగి దాడి చేశాడు. సత్యసాయి జిల్లా, ముళ్లమోతుకపల్లిలో అకారణంగా వేణుగోపాల్‌రెడ్డి అనే కానిస్టేబుల్‌పై వైస్ ఎంపీపీ వేదవతి భర్త నరసింహరెడ్డి అలియాస్ చంటి చేయిచేసుకున్నాడు. నందిగామలో టీడీపీ అధినేత రోడ్ షో నిర్వహిస్తుండగా వైసీపీ మూ కల రాళ్ల దాడిలో ఛీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుకి గాయాలయ్యాయి. సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఐ-ప్యాక్ కుట్రలో భాగంగానే యర్రగొండపాలెంలో చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడి చేయించారు. దాడిలో ఎన్ఎస్జీ కమాండోకు గాయాలయ్యాయి. పెనుకొండ సర్కిల్లోని కేసులో భాగంగా ఓ పోలీసుస్టేషన్‌కు అధికార పార్టీకి చెందిన నాయకులను తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకుని కొందరు వైసీపీ నాయకులు స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్ పై దాడిచేశారు. విషయం బయటకు పొక్కకుండా గోప్యంగా ఉంచారు. సోషల్ మీడియాలో జడ్పీటీసీ చల్లా శ్రీలక్ష్మీపై అసభ్యకర పోస్టులు పెట్టారని పోలీసు లకు ఫిర్యాదు చేయడంతో అధికార పార్టీకి చెందిన యూట్యూబర్ సుధాకర్‌రెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్తున్న సమయంలో పోలీసు వాహనాన్ని వెంబడిరచి ఎస్సైని కొట్టుకుంటూ అవుకు నుంచి ధర్మవరం వరకు తీసు కొచ్చారు. పోలీసు బాస్ రాజేంద్రనాథ్‌రెడ్డి తన డీజీపీ స్థాయిని కేవలం నేమ్ ప్లేట్‌కు మాత్రమే పరిమితం చేసి ఆత్మవంచన చేసుకుని డ్యూటీ చేస్తున్నారనే విషయం ప్రతిపక్షంగా మేము కాదు… యావత్ పోలీసుశాఖ బహిరంగంగానే మాట్లాడుకుంటోంది. ఇలా సమాన్య ప్రజలకే కాదు పోలీసులకు సైతం వైసీపీ నాయకుల దాడులు, విధింపులు తప్పడంలేదని వర్ల అన్నారు.
అధికార పార్టీ తొత్తులుగా పోలీసు ఉన్నతాధికారులు
ఎంతపెద్ద తప్పు చేసినా వైసీపీ నాయకులు మాత్రం పోలీసులకు భయపడటం లేదు. వైసీపీ నాయకుల దయా దాక్షిణ్యాల మీద పోలీసు వ్యవస్థ నడుస్తోందని పిస్తోంది. ఎంత పెద్ద తప్పు చేసినా పల్లెత్తి మాట అన లేని స్థితిలో రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఉంది. ఇందుకు పోలీసు వ్యవస్థలో ఉన్న కొందరు ఉన్నతాధికారులే కార ణం. వీరు అధికారపార్టీకి తాబేదారులుగా వ్యవహరిస్తు న్నారు. టీడీపీ హయాంలో కానిస్టేబుల్ కొడుకుపై దాడి జరిగితే ఊరు ఊరంతా తిరగబడిన సంఘటనలున్నా యి. సీఐపై జరిగిన దాడి లాంటి తప్పులు మళ్లీ జర గకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.తప్పు లు చేసినవారు ఎంతటివారైనా శిక్షించేందుకు పోలీసు లు ముందుకు రావాలని వర్ల రామయ్య అన్నారు.