.సత్వర, కఠిన చర్యలతో మాత్రమే మహిళలకు భరోసా
.వైసిపి ప్రభుత్వం, పోలీసులు మాధవ్‌కు అండగా నిలుస్తున్నారు
.సమాజంలో తలెత్తుకు తిరగలేకపోతున్నాం.. చర్యలు తీసుకోండి
.రాష్ట్రపతి ఎదుట డిగ్నీ ఫర్ ఉమెన్ జెఎసి నేతల ఆవేదన
.నేనున్నా.. ధైర్యంగా ముందుకు సాగండని ముర్ము భరోసా
.రాష్ట్రపతి ముర్ము, మహిళా కమిషన్ చైర్‌పర్సన్, కేంద్ర ఆరోగ్య మంత్రి భారతీ పవార్‌లకు డిగ్నిటీ ఫర్ ఉమెన్ జేఏసీ నేతల వినతి పత్రాలు
న్యూడిల్లీ : ఎంపి మాధవ్ వీడియో బయటకు వచ్చి పక్షంరోజులుగా గడిచినా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని మహిళలు పిర్యాదు చేశారు. రాష్ట్రంలో మహిళలు ఆత్మగౌరవంతో బతికే పరిస్థితులు లేవని మహిళానేతలు రాష్ట్రపతి ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు. డిగ్నిటీ ఫర్ ఉమెన్ నేతృత్వంలో అఖిలపక్ష మహి ళానేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మంగళవారం కలిశారు. జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతీ పవార్‌లను కూడా మహిళా జేఏసీ నేతలు కలిసి మాధవ్ వ్యవహారం పై వినతి పత్రాలు అందించారు. ఎంపి గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో వ్యవహారాన్ని మహిళానేతలు రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినపుడు ఆ ఎంపి ఎక్కడ నుండి ఎన్నికయ్యారని ఆరాతీశారు. వైసీపీ ఎంపీని శిక్షించి అత్యున్నత చట్టసభ గౌరవం కాపాడాలని వారు కోరారు. జేఏసీ నేతలు చెప్పిన విషయాలన్నింటినీ రాష్ట్రపతి ముర్ము ఓపిగ్గా విన్నారు. గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోకు సంబం ధించిన ఆధారాలను మహిళలు రాష్ట్రపతికి అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మహిళానేతలతో మాట్లాడు తూ మీరు ధైర్యంగా ముందుకు సాగండి. వినతి పత్రంలో పేర్కొన్న అంశాలను తాను పరిశీలిస్తానని చెప్పారు. గోరంట్ల మాధవ్ దోషిగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్రపతి హామీ ఇచ్చారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో డిగ్నిటీ ఫర్ ఉమెన్ జెఎసి కన్వీనర్ డాక్టర్ చెన్నుపాటి కీర్తి, తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఎపి కాంగ్రెస్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ, ఐద్వా ప్రతినిధి ఎస్ పుణ్యవతి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగర జ్యోత్స్న, తెలుగుమహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి నాగ కళ్యాణి, టిడిపి గుంటూరు పార్లమెంటు తెలుగుమహిళ అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, ఎపి కురుబ కార్పొరేషన్ మాజీ చైర్ పర్సన్ ఎస్. సవిత ఉన్నారు.
రాష్ట్రపతికి సమర్పించిన వినతిపత్రంలోని కీలకాంశాలు:
.ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 2019 నుండి మహిళలపై యథేచ్చగా జరుగుతున్న అఘాయిత్యాలు, దాడుల గురించి మీ దృష్టికి తీసుకురావడానికి బాధాతప్త హృదయంతో మీకు ఈ లేఖ రాస్తున్నాము. 2019లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మహిళలు బిక్కుబిక్కుమంటూ అభద్రతాభావంతో జీవనం సాగిస్తున్నారు.
.ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 2019 నుండి జూలై 2022 వరకు సుమారుగా 777 మహిళలపై అఘాయిత్యాలు మరియు దాడుల సంఘటనలు నమోదయ్యాయి.
.ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న దాడుల తీవ్రత, సంఖ్యను చూసి ఏ నాగరిక సమాజమైనా సిగ్గుతో తలదించుకుంటుంది.
.ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వం దిశాచట్టం పేరుతో రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా మహిళలను మోసగిస్తోంది. దిశా చట్టం అనేది అనేది ఒక అపోహ మాత్రమే. వాస్తవానికి ఆ పేరుతో ఎటువంటి చట్టంలేదు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ ఆర్‌సిపి నేతృత్వంలోని ప్రభుత్వం మహిళలను రక్షించ డంలో, వారికి భద్రత కల్పించడంలో ఘోరంగా విఫలమైంది.
.అధికార వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల మద్దతు, ప్రోత్సాహంతో మహిళలపై నేరాలకు పాల్పడేవారు ఆంధ్ర ప్రదేశ్‌లో మహిళల భద్రతకు తీవ్ర విఘాతం కలిగిస్తు న్నారు. ఎపిలో మహిళలపై నేరాలు 2020లో 14,603 ఉండగా, 2021లో 17,736కి పెరిగాయి. ఈ పెరు గుదల 21.45% గా ఉంది.
.ఆంధ్ర ప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న నేరాలలో అధికార వైసిపి నాయకులు, వారి మద్దతుదారులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొంటున్నారు. అధికార వైఎస్సార్‌సీపీకి ఎన్నికైన నాయకులు ముఖ్యంగా మహిళా ప్రభుత్వ ఉద్యోగులను, ఇతర మహిళలను బెదిరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
.అధికార పార్టీ నాయకులు మాజీమంత్రి అవంతి శ్రీనివాస్, ప్రస్తుత నీటిపారుదల మంత్రి అంబటి రాం బాబు, గతంలో మహిళలను లైంగికంగా వేధించిన ఆడియో టేపులు బయటపడ్డాయి. ఇటీవలి కాలంలో ఎంపీ గోరంట్ల మాధవ్ నైతికతతో కూడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఎంపిలు, ఎమ్మెల్యేలను మరియు ఎమ్మెల్యేలను ఎన్నుకున్నది రాష్ట్రానికి సేవచేయడానికే గానీ ఇటువంటి అనైతిక కార్యకలాపాలకు పాల్పడేందుకు కాదు.
.అనంతపురం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) ఫకీరప్ప ప్రెస్ మీట్ పెట్టి ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఫేక్, మార్ఫింగ్ అని చెప్పడం విడ్డూరంగా ఉంది. మహిళ లపై జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించి అధి కార వైఎస్సార్‌సీపీ నేతలను కాపాడేందుకు ఓ వర్గం పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. వైసిపి ప్రభుత్వ హయాంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సమగ్ర విచారణ జరపడానికి మీవంటి పెద్దల జోక్యం అవసరం.
.ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న అనేక అఘాయిత్యాలు ఫిర్యాదు చేయకపోవడం వల్ల మరుగున పడిపోతున్నాయి. ఫలితంగా ఎన్నో అఘాయిత్యాలు బయ టకు రావడం లేదు. అధికార వైఎస్సార్‌సీపీ నేతలు ప్రోత్స హిస్తున్న నేరస్తుల వల్ల ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమ విధులను వక్రమార్గంలో నిర్వర్తిస్తున్నారు. ఈ చర్యలు నేరస్తులను మరింతగా ప్రోత్సహించేలా ఉన్నాయి. ఇవి మహిళా సమాజానికి వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలు కాబట్టి సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం సముచితం.
.ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయి త్యాలపై సమగ్ర విచారణ జరిపేందుకు తగిన ఏజెన్సీలను ఆదేశించేలా జోక్యం చేసుకోవాల్సిందిగా విన్నవిస్తున్నాం. పరోక్షంగా ప్రోత్సహించడం ద్వారా నేరస్తులను తప్పించు కునేలా చేయడంలో అధికార వైఎస్‌ఆర్‌సిపి నాయకుల పాత్ర, పోలీసు విభాగం, అధికారుల పాత్రపై ఆరా తీయ డం అనివార్యం. సత్వర, కఠినమైన చర్యలు మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయడానికి హామీ ఇస్తుంది.