- నేతలకు టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు పిలుపు
- అవనిగడ్డ, పెనమలూరు, మార్కాపురం, సంతనూతలపాడు నియోజకవర్గాలపై సమీక్ష
అమరావతి: రాష్ట్రంలో ఎన్నికలకు ఎక్కువ సమ యం లేదని, పార్టీ నేతలు, నియోజకవర్గాల ఇన్ చార్జ్‌లు మరింత దూకుడుగా పని చేయాలని తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. పార్టీ అవనిగడ్డ, పెనమలూరు, మార్కాపురం, సంతనూతలపాడు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లతో బుధవారం ఆయన తన నివాసంలో సమావేశమయ్యా రు. నియోజకవర్గాల సమీక్షను ప్రారంభించారు. రానున్న ఏడాది కాలం పార్టీకి అత్యంత కీలకమన్నారు. అలసత్వం వీడి పార్టీ నేతలు ప్రణాళికాబద్ధంగా పని చెయ్యాలని చెప్పారు. నియోజకవర్గ ఇన్‌చార్జీలు ఒక్కొక్కరితో వేరు వేరుగా ప్రత్యేకంగా మాట్లాడి ఆయా నియోజకవర్గాలలో పరిస్థితులను తెలుసుకున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటు, బాదుడే బాదుడు కార్యక్రమం, ఓటర్ల జాబితా పరిశీలన, పార్టీ కార్యక్ర మాల నిర్వహణ, నేతల పనితీరుపై చర్చించారు. నియో జకవర్గ స్థాయిలో పార్టీ బలోపేతంపై తీసుకోవాల్సిన చర్యల గురించి దిశా నిర్థే శం చేశారు. ఆయా నియోజక వర్గాలపై తన వద్ద ఉన్న నివేదికల ఆధారంగా వారికి కొన్ని సూచనలు చేశారు. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాల్లో నేతలు, కార్యకర్తలు పాల్గొనడంతో పాటు స్థానిక సమ స్యలపైనా పోరాటం చేయాలని సూచించారు. మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక్క నియోజకవర్గంలో కూడా ఒక్క పని చేయ లేదన్నారు. జగన్‌రెడ్డి ప్రభుత్వం గాలికి వదిలివేసిన ప్రజా సమస్యలపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలతో పాటు ఆయా జిల్లాల్లో మంత్రుల అవినీతిపైన స్థానికంగా కార్యక్రమాలు రూపొం దించుకుని ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబునాయుడు వారికి సూచించారు.