- అన్ని వర్గాల ఉన్నతి కోసం కష్టపడ్డ చంద్రబాబు
- రాజ్యాంగ లక్ష్యమైన సామాజిక న్యాయం కోసం కృషిచేసిన బాబు
- ప్రజల కోసం కలలు కని సాకారం చేయగలిగిన ’మహా స్వాప్నికుడు’ చంద్రబాబు
- బాబు ఆలోచనలు రాష్ట్రానికి, దేశానికి ఎంతో మేలు చేశాయి
- తేదేపా అధినేతపై పుస్తకాన్ని విడుదల చేసిన న్యాయమూర్తి
- ప్రజలే సారథులుగా అర్జునుడు చంద్రబాబును గెలిపించాలి
- రాష్ట్ర, దేశ ప్రగతికి బాబు నాయకత్వం అవసరం: జస్టిస్ గోపాల గౌడ
విజయవాడ: అన్ని వర్గాల ప్రజల ఉన్నతి కోసం కలలు కని వాటిని సార్థకం చేయగలిగిన సమర్థుడు నారా చంద్ర బాబునాయుడు అని ఆయన సుదీర్ఘ ప్రజా జీవితంలో ఇది నిర్ధారణ అయ్యిందని, ఆయన ఆలోచనలు రాష్ట్రా నికి, దేశానికి ఎంతో ప్రయోజనకర మని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ కొనియాడా రు.ఆదివారం నాడు విజయవాడలో చంద్రబాబు ప్రజా జీవితంలోని ప్రధాన ఘట్టాలు, విషయాలకు సంబం ధించిన ’మహా స్వాప్నికుడు’ అన్న పుస్తకాన్ని ఆయన విడుదలచేశారు. సీనియర్ పాత్రికేయుడు విక్రమ్ పూల ఈ పుస్తకాన్ని రచించారు.
అనంతరం కిక్కిరిసిన ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లా డుతూ.. జస్టిస్ గౌడ చంద్రబాబు సేవలను గురించి విపులంగా మాట్లాడారు. చంద్రబాబు ఒక గొప్ప మానా వతవాది అని, రాజ్యాంగం నిర్దేశించిన సామాజిక న్యాయం కోసం పాటుపడి దళితులు, పేదలకు ఎంతో మేలు చేశారని, పలు సమస్యలు ఎదుర్కొంటున్న రైతు లు, యువత, మహిళల కోసం ఆయన నిరంతరం తపన చెందారని జస్టిస్ గౌడ వ్యాఖ్యానించారు.
చంద్రబాబు కేవలం తన సొంత రాష్ట్రానికి పరిమిత మైన నాయకుడు కాదని, ఆయన ఆలోచనలు, దార్శని కత దేశానికి కూడా ఎంతో ఉపయోగపడ్డాయని చెబు తూ..గతంలో చంద్రబాబు కేంద్రంలో పోషించిన కీలక పాత్ర, తద్వారా జరిగిన ప్రయోజనాలను గురించి కూడా వివరించారు. కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు, దేవెగౌడ, ఐ.కె.గుజరాల్‌లను ప్రధాన మంత్రులుగా చేయటంలో చంద్రబాబు పాత్ర, ఎన్డీఏ ప్రభుత్వాలతో సహకరించి జాతీయ స్థాయిలో వివిధ రంగాల అభివృద్ధికి చంద్రబాబు చూపిన చొరవ ను జస్టిస్ గౌడ గుర్తుచేశారు.
చంద్రబాబు మానవతావాధి
వివిధ వర్గాల ప్రజల కోసం చంద్రబాబు చేపట్టిన చర్యల గురించి వివరిస్తూ దళితుల ఉన్నతి కోసం ఆయన ఎంతో తపన చెందారని జస్టిస్ గౌడ అన్నారు. గంటి మోహనచంద్ర బాలయోగిని లోక్‌సభ మొదటి దళిత స్పీకర్ గా నియమించటం దళితుల రాజకీయ సాధికారత, సామాజిక న్యాయం పట్ల చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. రైతాంగం కోసం ఎంతో కృషి చేసిన చంద్రబాబు రాయ లసీమ దాహార్తిని తీర్చటానికి ప్రత్యేక చొరవ చూపా రని, అదే రీతిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్న యువత ఉజ్వల భవితకోసం ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఐటీ విప్లవాన్ని పుణికి పుచ్చుకొని, బిల్ గేట్స్, బిల్ క్లింటన్ వంటి దిగ్గజాలను రాష్ట్రానికి రప్పించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఐటీ రం గంలో పరుగుబాటలో నిలపటం వలన రాష్ట్ర యువత ఎంతో ప్రయోజనం పొందారని జస్టిస్ గౌడ వివరించా రు. పక్క రాష్ట్రం అయిన ఒడిశాలో వరదలు వచ్చి బీభత్సాన్ని సృష్టించినప్పుడు ఏపీ ముఖ్య మంత్రిగా ఉన్న చంద్రబాబు ఆ రాష్ట్రానికి ఎంతో సహాయం చేసి గొప్ప మానవతావాధిగా పేరుగాంచా రని ఆయన అన్నారు.
యువత డార్లింగ్ చంద్రబాబు
ఇటీవల చంద్రబాబును అరెస్ట్ చేసి దీర్ఘకాలం జైల్లో నిర్బంధించినప్పుడు రాష్ట్ర, దేశ, విదేశాల్లోని యువత స్పందించిన తీరు అపూర్వమని ఆయన పట్ల యువత కు ఉన్న అభిమానానికి అది సాక్ష్యాత్కారమని జస్టిస్ గౌడ అభిప్రాయపడ్డారు. పలు సంవత్సరాల పాటు యువత భవిష్యత్తుకు పటిష్టమైన బాటలువేసి, నైరాశ్యం లో ఉన్న వారిలో ఉత్సాహాన్ని చంద్రబాబు నింపినం దుకు యువత ఎల్లప్పుడూ ఆయనకు రుణపడి ఉంటా రని న్యాయమూర్తి అన్నారు. ఈ నేపథ్యంలోనే.. చంద్ర బాబు జైల్లో ఉన్నప్పుడు లక్షలాది యువత హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో సమావేశమై చంద్ర బాబుకు మద్దతుగా నిలిచారని ఆయన గుర్తుచేశారు.
రాష్ట్రంలో మార్పుకు ప్రజలే సారథులు
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు తనకు తెలుసునని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, మార్పు అవసరమని, త్వరలో జరగనున్న ఎన్నికల మహాభారత యుద్ధంలో ప్రజలే సారథులై అర్జునుడు చంద్రబాబును గెలిపించాలని, ఇది అందరి సమష్టి బాధ్యత అని జస్టిస్ గోపాల గౌడ నొక్కి ఒక్కాణించారు.
140 కోట్ల జనాభాతో కూడిన మన దేశంలో నిరు ద్యోగం, పేదరికం వంటి సమస్యలున్నాయని, దేశ పున ర్నిర్మాణం కోసం అందరూ సమష్టిగా పని చేయాలని ఇటువంటి సమస్యల పరిష్కారంలో చంద్రబాబు ఆలో చనలు, అనుభవం ఎంతగానో ఉపయోగపడుతాయని, అంధుకనే రానున్న ఎన్నికల్లో చంద్రబాబు గెలుపు అవ సరమని తాను భావిస్తున్నానని జస్టిస్ గౌడ అన్నారు.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా తాను చంద్ర బాబుపై పుస్తకం విడుదలకు అంగీకరించే ముందు లోతుగా ఆలోచించి నిర్వాహకుల ఆహ్వానాన్ని అంగీక రించానని జస్టిస్ గౌడ తెలిపారు. చంద్రబాబు ఆలోచ నలు, విధానాలు,వాటి వలన జరిగిన మేలు, రాజ్యాంగ లక్ష్యాల పట్ల ఆయనకున్న నిబద్ధత, వివిధవర్గాల ఉన్నతి కోసం ఆయన చేసిన కృషి వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని అంగీకరించానని..చంద్రబాబు వ్యక్తిత్వాన్ని వెల్లడిరచే ’మహా స్వాప్నికుడు’ అన్న పుస్త కాన్ని విడుదల చేయటం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఈ పుస్తకంలోని అంశాలని విస్తృతంగా ప్రజ ల్లోకి తీసుకెళ్లాలని జస్టిస్ గోపాల గౌడ సూచించారు.
మాజీ న్యాయమూర్తులకు సహజంగానే కొన్ని పరి మితులు ఉంటాయని.. అయితే ప్రజాజీవితం క్లిష్ట పరి స్థితుల్లో ఉన్నప్పుడు తన లాంటి వ్యక్తులు వాస్తవాలు మాట్లాడటం అవసరమని,సమస్యలకు పరిష్కార మార్గా న్ని చూపే విధంగా వ్యవహరించాలని జస్టిస్ గౌడ అభిప్రాయపడ్డారు.
సుమారు నలభై నిమిషాల పాటు పూర్తిగా తెలుగు లో సాగిన జస్టిస్ గౌడ ప్రసంగాన్ని భారీగా హాజరైన సభికులు చప్పట్లు,ఈలలతో పలుసార్లు స్వాగతించారు.
స్వతంత్య్ర పోరాట స్ఫూర్తితో మార్పు కోసం పోరాడాలి
రాష్ట్రంలో నాడు చంద్రబాబు సుపరిపాలనలో నెల కొన్న పరిస్థితిని, నేటి జగన్ దుష్పరిపాలనలో పరిస్థితిని బెరీజు వేసుకొని మార్పు కోసం స్వతంత్య్ర పోరాట స్ఫూర్తితో ప్రజలంతా పోరాటం చేయాలని ఈ సభలో ప్రసంగించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్ధన్ అన్నారు. చంద్రబాబు ప్రజానీకం కోసం కల లుగనే ధైర్యంగల నాయకుడే కాక వాటిని సాధించగల సమర్థుడు కూడా అని ఆయన అన్నారు. ప్రపంచ చరిత్రలో పారిశ్రామిక విప్లవం లాంటి పలు విప్లవాత్మక మార్పులొచ్చినప్పుడు వాటిని అందుపుచ్చుకొని ముందు కుసాగిన దేశాలు అభివృద్ధిబాటలో నడిచాయని, ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చిన మొదట్లో చంద్రబాబు ఎంతో చొరవ తీసుకొని ఐటీ రంగానికి బలమైన పునాదులు వేసి తెలుగుయువతకు ఎంతో మేలు చేశారని ఆయన అన్నారు.
మహిళా సాధికారత, సాగునీటి రంగం, విద్యుత్ రంగం, విద్యారంగం వంటి పలు కీలకరంగాల్లో ఎంతో ముందుచూపుతో చంద్రబాబు ప్రవేశపెట్టిన విధానాలు, మార్పులు, వాటి ప్రయోజనాలను జనార్ధన్ వివరించా రు. జగన్ పాలనలో గత ఐదేళ్లుగా జరుగుతున్న దోపిడీ బ్రిటీష్ వారు చేసిన లూటీ కంటే ఘోరంగా ఉందని, ప్రజలు చైతన్య వంతులై తిరిగి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
అబద్ధాలు, అభూతకల్పనలను అడ్డుకోవటానికే ఈ పుస్తకం
దీర్ఘకాలంగా ప్రజా సేవలో నిమఘ్నమై ఉన్న తేదేపా అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా రాజకీయ వ్యతిరేకులు పలు అబద్ధాలు, అభూతకల్పనలను ప్రచారంలోకి తెచ్చారని, వీటికి సంబంధించిన వాస్తవాలను వెల్లడిరచటానికి ’మహా స్వాప్నికుడు’ పుస్తకాన్ని రాశానని రచయిత, సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పూల వెల్లడిరచారు. చంద్రబాబు విశ్వనరుడని, ఆయనకు వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని చూసి, వాస్తవాలు తెలిసిన వ్యక్తిగా ఈ ప్రయత్నం చేశానని ఆయన అన్నారు.
ఈ పుస్తక విడుదల సమావేశంలో మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ వివిధ వర్గాల ప్రజలు చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రిగా రావాలని ఎందుకు కోరుకుంటున్నారో వివరించారు. మరో మాజీ మంత్రి నెట్టెం రఘురాం మాట్లాడుతూ తేదేపా ప్రధాన కార్యదర్శి అయినప్పటి నుంచి పార్టీ వ్యవస్థాగత నిర్మాణం కోసం చంద్రబాబు చేసిన కృషి, ఆయన దర్శనికతలను వివరుంచారు. అమరావతి దళిత జేఏసీ నాయకుడు పోతిన బాలకోటయ్య ప్రసంగిస్తూ చంద్రబాబు ఒక మహాసముద్రం, మేరు పర్వతంలాటి వాడని.. రాబోయే ఎన్నికల కోసం కాకుండా రానున్న తరాల కోసం పనిచేసే నాయకుడని, ఆయన తిరిగి తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని అన్నారు.
శాశససభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు ప్రదర్శించిన చంద్రబాబు, స్వర్గీయ ఎన్టీఆర్ రూపొందించిన తెలుగు దేశం జెండా నిత్య నూతన శక్తితో రెపరెపలాడటానికి ప్రధాన కారణమని, ఎవరైన జైలుకెళితే ఆ వ్యక్తి చేసిన తప్పులు చర్చకు వస్తాయని, చంద్రబాబు జైలుకు వెళ్లిన ప్పుడు ఆయన గొప్ప ఆలోచనలు, చేసిన మంచి పనుల గురించి ప్రజలు సుధీర్ఘంగా చర్చించుకున్నారని వివరిం చారు. టీడీపీ నేత సయ్యద్ రఫీ.. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా విజన్ రూపొందిం చి ప్రజాశ్రేయస్సు కోసం విధానాలు రూపొందించే దార్శనికుడు చంద్రబాబు అని, ఆయనను జైల్లో నిర్బంధించినప్పుడు ఎనభై దేశాల్లో ప్రజలు స్పందించారని, త్వరలో చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు.