- వైసీపీ స్మగ్లర్లను చిత్తుగా ఒడిరచాలి
- సైకిల్‌పై కమలం, గ్లాస్‌తో దూసుకెళ్దాం
- పింఛన్ ఇవ్వలేక.. మాపై నెపమేస్తారా?
- వెలిగొండ నుంచి నీళ్ళిస్తా
- ప్రజాగళం విజయం కూటమిపై ప్రజల నమ్మకానికి సంకేతమన్న చంద్రబాబు
మార్కాపురం (చైతన్యరథం): ప్రజాగళం పేరిట పదిహేను సభలు పెట్టాను. రెట్టించిన ఉత్సాహంతో జనం పోటెత్తుతున్నారు. ప్రజల్లో`కూటమిపై నమ్మకం ఒకపక్క.. దుర్మార్గ వైసీపీపై కసి మరోపక్క కనిపిస్తుం ది. ఇది చాలు ఎన్డీయే గెలుపు ఖాయమని చెప్పడానికి. దుర్మార్గుడు రాజకీయాల్లో ఉండకుండా వదిలించు కోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజాగళం వేదిక నుంచి పిలుపిస్తున్నా. సైకిల్ మీద కమలం పెట్టుకొని, జనసేన గ్లాస్ పట్టుకొని`ఎదురొచ్చిన వైసీపీని తొక్కే ద్దాం. తొక్కుకుంటూ ముందుకుపోదామని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు అనుభవించిన నరకంపై ఇంటింటా చర్చ జరగాలని చంద్రబాబు కోరారు. ప్రజాగళం ఎన్నికల ప్రచార సభ ల్లో భాగంగా ఆదివారం సాయంత్రం మార్గాపురం సభ లో తెదేపా అధినేత చంద్రబాబు.. విధ్వంస పాలకుడు జగన్‌ను ఏకిపారేశారు. వైసీపీ దుర్మార్గ విధానాలను దునుమాడుతూనే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టబోయే సంక్షేమాన్ని సుదీర్ఘంగా వివరించారు. కూటమిని గెలిపించాల్సిన అవసరాన్ని వివరిస్తూ తప్పుడు ప్రచారాలతో విద్వేషాలు సృష్టించేం దుకు ప్రయత్నిస్తున్న వైసీపీ నాటకాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ‘ఐదేళ్ల విధ్వంసం జగన్‌ది. ఐదేళ్ల కృషి మనది. ప్రజాపక్షాన నిలబడిన మన కష్టానికి మే 13న ఫలితం అందుకోబోతున్నాం. రాష్ట్రాన్ని విధ్వంసానికి గురి చేసిన పాలకుడికీ చెక్ పెట్టబోతున్నాం. కూటమి విజయం లాంఛనప్రాయమే. రాష్ట్రంలో ప్రతిచోటా ఇదే చర్చ జరగాలి’అని చంద్రబాబు వివరించారు. ఒంగోలు లో కొండేపి తప్పా అన్నింటిలోను జగన్‌ను గెలిపించినా ఒక్క అభివృద్ధికార్యక్రమం చేపట్టారా? అని నిలదీశారు.
వెలిగొండకు నీళ్లిచ్చే పూచీ నాదీ
ఈ ప్రాంతంలో నీళ్లుంటే బంగారం పండిరచే రైతు లున్నారు? నాడు సమైక్యాంధ్రలో నీళ్లు కావాలని మీరు అడిగితే వెలుగొండకు శంకుస్థాపన చేశాను. దాన్నీ జగన్ సర్కారు నిర్వీర్యం చేసింది. కోర్టు లిటిగేషన్‌లో పెట్టింది. నేను అధికారంలోకి వచ్చిన తరువాత సమ స్యలన్నింటినీ పరిష్కరించి పనులను పూర్తిచేస్తానని హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలో ఉండుంటే 2020 నాటికే నీళ్లు వచ్చి ఉండేవని, గోదావరి నీళ్లు నాగార్జున సాగర్‌కు తెచ్చి నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకు నీళ్లు అందించాలన్నది తన ప్రణాళిక అని చంద్రబాబు వివరించారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తైవుంటే 15 లక్షలమందికి తాగు నీరు, 4 లక్షల ఎకరాలకు సాగు నీరు అందేదని,ఆ ప్రాజెక్టును నిర్వీర్యం చేశారని చంద్ర బాబు విచారం వ్యక్తంచేశారు. వెలుగొండ పూర్తికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తే, కమీషన్ల కక్కుర్తితో కాంట్రా క్టర్‌ను మార్చి నాశనం చేశారు. 80శాతం టీడీపీ పూర్తి చేస్తే 20శాతం పథకాన్ని పూర్తి పూర్తి చేయలేని దద్దమ్మ మూడు రాజధానులు కడతాననడం హస్యాస్పదంగా ఉందన్నారు. వెలిగొండను పూర్తిచేశాకే ఓట్లు అడు గుతానన్న జగన్,రైతులకు నష్టపరిహారం ఇవ్వకుం డా ముఖం చాటేస్తున్నాడు.మొన్న పరదాల మాటు నుంచి వచ్చి రిబ్బన్ కట్‌చేసి పారిపోయాడని ఎద్దే వా చేశారు. పూర్తికాని ప్రాజెక్టుకు ఏ దద్దమ్మైనా ప్రారంభిస్తాడా? అని ప్రశ్నిస్తూ.. అది జగన్‌కే చెల్లిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రజాగళం వేదికనుంచి హామీఇస్తున్నా.. వెలిగొండను ప్రారం భించింది నేను. పూర్తిచేసేది నేను. నీళ్లివ్వ బోయేదీ నేనే అని చంద్రబాబు సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టును ప్రస్తావిస్తూ.. 72 శాతం పనులుతాను పూర్తిచేస్తే జగన్‌రెడ్డి ప్రాజెక్టును గాలికొదిలేయడమే కాదు, గుత్తేదారుడిని మార్చి ప్రాజె క్టునే నాశనం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మార్కాపురం కేంద్రంగా జిల్లా
మార్కాపురాన్ని కొత్త జిల్లాగా తీసుకువస్తానని, రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అన్ని పనులూ పూర్తిచేసి రంగం సిద్ధం చేస్తే.. జగన్ వచ్చాక టెండర్లు రద్దుచేసి డబ్బుల కోసం లాలూచీ పడి రివర్స్ టెండర్ కు పాల్పడ్డాడని దుయ్యబట్టారు. ఇండోనేషియా నుంచి ఆసియా పల్స్ ఫ్యాక్టిరీని రూ.25వేల కోట్ల పెట్టుబడితో సాధిస్తే.. వాళ్లు పారిపోయేలా చేసింది జగన్‌రెడ్డేనని విమర్శించారు. సంక్షేమం పేరట జగన్ బటన్ నొక్కడ మే తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఈ ప్రాం తానికి సమృద్ధిగా జలాలు అందించి, మార్కాపురం కేం ద్రంగా జిల్లానుచేసి, యువతకు ఉద్యోగాలిప్పిస్తానని చంద్రబాబు హామీఇచ్చారు.2014-19లో సంక్షేమానికి పెద్ద పీటవేసింది టీడీపీయేనని, సంక్షేమం అంటే గుర్తు కొచ్చేది ఎన్టీఆర్ అన్నారు. జగన్ అసమర్థ బటన్ నొక్కు డువల్ల పెట్రోల్, డీజీల్, సేల్స్ టాక్స్, ఆస్థిపన్ను, ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయని, నిత్యావసరాల ధరలు ఆకాశానికి అంటాయని విమర్శించారు. సంక్షేమానికి బటన్ నొక్కు తున్నానని అబద్ధాలు చెప్తున్న జగన్, జాబ్ క్యాలెండర్ బటన్ ఎందుకు నొక్కలేదని ప్రశ్నించారు.
జాబు రావాలంటే బాబు రావాలి. మీ పిల్లల భవిష్యత్ బాగుండాలంటే బాబు రావాలి. గంజాయి రావాలంటే మాత్రం జగనే రావాలి అని చంద్రబాబు చమత్కరించారు. జగన్ తాగు నీళ్ల బదులు జే బ్రాండ్ తెచ్చి తాగించా డని, నిత్యావసర ధరలు తగ్గించేందుకు, సీపీఎస్ రద్దు, మద్యపాన నిషేదం, గుంటలుపడే రోడ్లు బాగు, కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చేందుకు, రైతులకు డ్రిప్ ఇవ్వడానికి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సబ్‌ప్లాన్ కోసం మాత్రం బటన్ నొక్కలేకపోయాడని ఎద్దేవా చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అప్పుల సంక్షేమానికి బదులు సంపద సృష్టితో సంక్షేమాన్ని అమలు చేస్తామన్నారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా తెస్తానని చెప్పి తానే మెడలు దించేశాడని దుయ్యబడుతూ, ఐదేళ్లలో కేంద్రంనుంచి ఒక్క రూపాయి తీసుకురాలేకపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత కేసులు తప్ప జగన్‌రెడ్డికి ఏమీ పట్టదని విమర్శించారు.
వైసీపీ స్మగ్లర్లను చిత్తుగా ఓడిరచండి
బీజేపీతో పొత్తుముస్లిం వర్గాలకు అన్యాయం చేస్తుం దని రెచ్చగొట్టే దిగజారుడు ప్రకటనలు చేస్తున్న వైసీపీ పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. తాను అధికారంలో ఉండగా ముస్లింలకు ఎలాంటి అన్యాయం జరగదన్నది చరిత్ర చెప్తోందని, ముస్లింల అభ్యున్నతికి తెలుగుదేశం కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజలు గెల వాలంటే కూటమి గెల వాలంటూనే, రాష్ట్రా న్ని గెలిపించడం కోసమే కూటమి అని చంద్రబాబు వివరించారు. సంక్షేమం సాధించాలి, అభివృద్ధి సాధిం చాలి, ప్రాజెక్టులు కట్టాలి, ప్రగతి రథాన్ని పరిగెత్తిం చాలి. ఇంతటి బృహత్తర బాధ్యత చేపట్టేం దుకు సిద్ధంగా ఉన్నామని, అన్నివర్గాల అభివృద్ధికి తాను డ్క్రెవర్నవుతానంటూ చంద్రబాబు ప్రకటించారు. అంద రి ఆమోదంతోనే సీట్ల కేటాయింపులు జరిగాయని, ఈ ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులురెడ్డి, కందుల నారా యణరెడ్డిలకు బటన్ గుద్ది అఖండ మెజారిటీతో గెలిపించే బాధ్యత మీదేనని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. వైసీపీ అభ్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ.. తిరుపతి నుంచి ఎర్రచందనం స్మగ్లర్‌ను ఇక్కడ పోటీకి తీసు కొచ్చారు.
ఒంగోలు పుష్ప గురించి తెలిసీ ఓటేస్తారా? చిత్తూరులోను మరో ఎర్ర చందనం స్మగ్లర్‌ను బరిలోకి దింపారు. దుర్మార్గులను చిత్తుగా ఒడిరచి వెనక్కి పంపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వైసీపీ పింఛన్ల డ్రామాపై చంద్రబాబు స్పందిస్తూ.. స్వప్రయోజనాలకు వాడుకుని ఖజానాకు ఖాళీ చేశారు. పింఛన్లు చెల్లించలేని పరిస్థితి తీసుకొచ్చి.. తెదేపా అడ్డుకోవడం వల్లే పింఛన్లు ఇవ్వలేకపోతున్నామని పాపపు ప్రచారానికి దిగుతున్నారు. పింఛన్లు ఇవ్వమని మనమే చెప్తున్నాం. ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో ఇంటి దగ్గర ఉన్న వాళ్లకే పించన్ ఇవ్వాలని సూచిస్తున్నాం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు