- ప్రతిదశలోనూ అప్రమత్తంగా అడుగులు వేయాలి
- జనసేన నాయకులకు పవన్ దిశానిర్దేశం
అమరావతి: ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. ఎన్నికల్లో అను సరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. బుధవారం నాడు జనసేన కేంద్ర కార్యాలయంలో ఇప్పటి వరకూ అధికారికంగా ప్రకటించిన అభ్యర్థులు, కొందరు ముఖ్యనాయకు లతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా ప్రసంగించిన పవన్.. నేతలకు కీలక సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశ లోనూ అప్రమత్తంగా అడుగులు వేయా లన్నారు. కక్ష సాధింపు.. అరాచకాలను నమ్ముకున్న పార్టీతో పోరాడుతున్నామని, ఏవిధమైన ఒత్తిళ్ళు వచ్చినా మరుక్షణమే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసు కురావాలని నేతలకు సూచించారు. 2024 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ గతిని మారుస్తాయన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ -జనసేన-బీజేపీ కూటమి పోరాడుతు న్నది అరాచకాన్ని,హింసను, కక్ష సాధిం పుని నమ్ముకున్న పార్టీతో అని అన్నారు.
రానున్న ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరాలని, ఆ దిశగా పార్టీ శ్రేణులు శ్రమించాలని పవన్ కల్యాణ్ దిశా నిర్దేశం చేశారు. టీడీపీ, బీజేపీ నాయ కులు, శ్రేణులతో ఎప్పటికప్పుడు సమ న్వయం చేసుకోవాలన్నారు. ప్రతి దశ లోనూ అభ్యర్థులు,నాయకులు, శ్రేణులు అప్రమత్తంగా అడుగులు వేయాలన్నా రు. ఏ విధమైన ఒత్తిళ్ళు వచ్చినా తక్షణమే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఈ సందర్భంగా వారికి ఎన్నికల నియమా వళి, నామినేషన్ దాఖలు నుంచి పోలింగ్ వరకూ ఉండే వివిధ దశలు, నియమ నిబంధనలు, పొందాల్సిన అనుమతులను తెలియచేసే పత్రాలను పార్టీ నేతలకు అందజేశారు.