అమరావతి(చైతన్యరథం): జగన్ గొడ్డలి పార్టీకి పోయేకాలం దగ్గర పడుతున్న కొద్దీ రక్త దాహం మరింత పెరిగిపోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే వైకాపా సైకోలు మునయ్యని మట్టుబెట్టారన్నారు. గిద్దలూరు మండలం గడికోట పంచాయతీకి చెందిన పాముల మునయ్య టీడీపీలో చేరిన రోజే చంపేస్తామని వైకాపా మూకలు హెచ్చరించారు. పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా చర్యలు శూన్యం. చివరికి ప్రజాగళం సభకు వెళ్లాడనే కక్షతో దారుణంగా గొడ్డలితో నరికి మునయ్యను చంపేశారు. బాబాయ్‌పై గొడ్డలి వేటేసి అబ్బాయి అధికారం దక్కించుకున్నాడు. ఆ అధికారం పోతుందనే భయంతో తెలుగుదేశం జెండా పట్టిన కార్యకర్తలపై గొడ్డలి ఎత్తుతున్నారు. జగన్‌కి, ఆయన సైకో సైన్యానికి, గొడ్డలి దాడులకు ఇవే ఆఖరి రోజులు. మునయ్య కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుంది. దోషులను చట్టం ముందు నిలబెడతామని లోకేష్ హెచ్చరించారు.