అమరావతి: అసెంబ్లీకి వచ్చేముందు వెంకట పాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైసీపీలా ఒక స్థానానికి ఉదయం ఒకరిని, రాత్రికి మరొకరిని మార్చే పార్టీలు తెలు గుదేశం, జనసేన కావన్నారు. చివరి అసెంబ్లీ సమావేశాల్లోనైనా జగన్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ఒక అబద్ధాల కోరని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిల దీస్తామన్నారు.
‘జగన్ ఇంటికి వెళ్లడానికి సిద్ధం గా ఉన్నారు.అందుకే సిద్ధంపేరుతో సభలు నిర్వ హిస్తున్నారు’ అని ఎద్దేవాచేశారు. పులివెందుల లో గెలుపుపై జగన్ నమ్మకం కోల్పోయారని.. వ్యక్తిగతంగా కూడా ఆయనకు ఇవే చివరి సమా వేశాలన్నారు. డీఎస్సీ విషయంలో 5ఏళ్లుగా సీఎం తమని మోసంచేశారంటూ బాలకృష్ణకు నిరుద్యోగులు వినతిపత్రాలు అందజేశారు. తెదే పా ప్రభుత్వం అధికారంలోకి రాగానేతప్పక న్యా యం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.