- మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అనుచరుల నిర్వాకం
- డబ్బులు అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారు
- ప్రజావినతుల కార్యక్రమంలో మహిళల ఫిర్యాదు
మంగళగిరి(చైతన్యరథం): గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి అనుచరులు నాగేశ్వరరావు, కృష్ణలు కేసులు మాఫీ చేయిస్తామని చెప్పి గతంలో రెండు విడతలుగా రూ.6 లక్షలు ఒకసారి, రూ.32 లక్షలు మరోసారి తీసుకుని తమను మోసం చేశారని తిరుపతి పట్టణానికి చెందిన ఇద్దరు మహిళలు టీడీపీ కేంద్ర కార్యాల యంలో ప్రజా వినతుల కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఆ డబ్బులు వెల్లంపల్లికి చేరాయని.. తమను తిరుపతిలో ఉంటే చంపుతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రక్షణ కల్పించి తమకు న్యాయం చేయాలని.. తమపై అక్రమంగా పెడుతున్న కేసులను పరిశీలించి తొలగించాలని మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, ఏపీ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావులకు వినతిపత్రం అందజేశారు. లేదంటే తమకు చావే శరణ్యమని వాపోయారు.
` అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీ 13వ వార్డు భవనం వీధి రోడ్డులో ఏళ్ల క్రితం ఇళ్లు నిర్మించుకుని ఉంటున్న తమపై అప్పటి వైసీపీ ఎమ్మెల్యే రమణమూర్తి రాజు కక్ష గట్టి దేవాదాయ శాఖ భూమి దారికి అడ్డంగా గోడ నిర్మించారని మొగలపల్లి వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశాడు. దాంతో తమ వ్యాపారాలు నిలిచిపోయి నష్టపోతు న్నామని.. దారికి అడ్డంగా కట్టిన గోడను తొలగించి మార్గం సుగమం చేసి తమ వ్యాపా రా టలకు ఇబ్బంది లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశాడు.
` గత వైసీపీ ప్రభుత్వంలో తమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అక్రమంగా తమపై కేసులు పెట్టించడంతో ఇబ్బందులు పడుతున్నామని అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అప్పన్నపాలెం గ్రామానికి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకునే వారు, ఉద్యోగాలు చేసుకునే వారికి ఎంతో ఇబ్బందిగా ఉందని, అక్రమ కేసులను తొలగించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
` గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎస్సీ మాదిగ కులస్తులకు ఇవ్వాల్సిన ఇళ్ల స్థలాలను వైసీపీ నాయకులు వారి బినామీల పేరు పెట్టుకుని కొట్టేశారని పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం మండాది గ్రామానికి చెందిన వంకాయలపాటి యోహాను ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో మంజూరైన పట్టాలను రద్దు చేసి నిజమైన పేదలకు మేలు చేయాలని కోరారు.
` తనకు పడాల్సిన పంట నష్టపరిహారం మరొకరికి ఖాతాలో వేశారని.. అధికారు లను అడిగితే సమాధానం చెప్పకుండా దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం పటెంపాడు గ్రామానికి చెందిన కిలారు సూర్య పవన్‌కుమార్ ఫిర్యాదు చేశారు. తనకు రావాల్సిన పంట నష్టపరిహారం ఇప్పించాలని విజ్ఞప్తి చేశాడు.
` తన భర్త టీడీపీలో తిరగడంతో ఆయన పేరుపై ఉన్న పొలాన్ని వైసీపీ నేతలు, అధికారులు కుమ్మక్కై మరో మహిళ పేరు మీద ఆన్‌లైన్ చేశారని ఏలూరు జిల్లా టి.నర్సా పురం మండలం ఏపిగుంట గ్రామానికి చెందిన కోరుకొండ రాజారమణి ఫిర్యాదు చేసిం ది. దానిని రద్దు చేసి తమ భూమిని తమకు ఆన్‌లైన్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
` ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం ఎపిగుంట గ్రామంలో ప్రభుత్వ భూమికి అక్రమంగా పట్టా పొంది పలువురు బీసీ, ఓసీలపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి వేధిస్తున్న చవ్వా సూర్యకృష్ణవేణి, గుంటూరు జిల్లాకు చెందిన యరిచర్ల వీరయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకుని ఆ పట్టాను రద్దు చేసి ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని గ్రామానికి చెందిన పలువురు వినతిపత్రం అందజేశారు.
` అనకాపల్లి జిల్లా అచ్యుతాపురానికి చెందిన గ్రామస్తులు రామాలయానికి సంబంధించిన ఆలయ ప్రాంగణం ఆక్రమణకు గురైందని ఫిర్యాదు చేశారు. అక్రమణదారుల నుంచి భూమిని విడిపించాలని నేతలకు వినతిపత్రం ఇచ్చారు.
` గత టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి పనుల్లో భాగంగా చేపట్టిన శ్మశాన వాటిన పనులకు సంబంధించి నేటికీ బిల్లులు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్నదోర్నాల గ్రామానికి చెందిన ఏదుల శ్రీనివాసరెడ్డి తెలి పారు. తమ సమస్యను పరిష్కరించి బిల్లులు అందేలా చూడాలని కోరారు.
` సర్వే నెంబర్ 208లో గత వైసీపీ ప్రభుత్వం తమ గ్రామంలో వేరే ఊరికి చెందిన వారికి ఇళ్ల స్థలాలను కేటాయించిందని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం శ్రీరా మపురానికి చెందిన పలువురు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఇచ్చిన స్థలంలో ఎవరూ ఇళ్లు కట్టుకోలేదని..వాటిని రద్దు చేసి తమ ఊరి వాసులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని వినతిపత్రం ఇచ్చి అభ్యర్థించారు.