- పెదవడ్లపూడిలో హైలెవల్ కెనాల్ ఎత్తిపోతల
- రూ.14.88 కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్ పూర్తి
- ప్రారంభించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్
మంగళగిరి(చైతన్యరథం): మంగళగిరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. మంగళగిరి మండలం పెద్దవడ్లపూడి గ్రామంలో హైలెవల్ కెనాల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ముందుగా పెదవడ్లపూడి గ్రామానికి చేరుకున్న మంత్రి లోకేష్‌కు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున స్వాగతం పలికారు. అనంతరం రూ.14.88 కోట్ల వ్యయంతో నిర్మించిన హైలెవల్ కెనాల్ ఎత్తిపోత ల పథకాన్ని రిబ్బన్ కట్ చేసి మంత్రి ప్రారంభించారు. స్విచ్ ఆన్ చేసి పంపుల ద్వారా నీటి పంపిణీని ప్రారంభించారు. ఈ సందs Á్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దాదాపు 250 క్యూసెక్కుల నీటి విడుదల పరిమాణం కలిగిన ఈ పథకం ద్వారా మంగళగిరి, తెనాలి, పొన్నూరు నియోజకవర్గాల్లోని 25,344 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. నీటిని ఎత్తిపోసేందుకు నాలుగు పంపులను అమర్చారు. ఎన్నికల సమ యంలో మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు నిధులు విడుదల చేసి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను పూర్తిచేయించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీ దేవి, గుంటూరు పార్లమెంట్ తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి రూరల్ టీడీపీ అధ్యక్షుడు పల్లబోతుల శ్రీనివాసరావు, టౌన్ అధ్యక్షు డు పడవల మహేష్, కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, ఎంటీఎంసీ కమిషనర్ షేక్ అలీమ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.














