అమరావతి : సెకీతో లాభమేగానీ నష్టం లేదని సాక్షి రాసింది పచ్చి అబద్ధం. రాజస్థాన్‌లో ఉత్పత్తి చేసిన సోలార్ విద్యుత్ 7వేల మెగావాట్లు కొనేందుకు జగన్ ప్రభుత్వం సెకీతో ఒప్పందం చేసుకుంది. 25ఏళ్లు కొనసాగే ఈ ఒప్పందం వల్ల ఏపీ ప్రజలపై 62వేల కోట్లకు పైగా భారం పడుతుంది. ఒక యూనిట్ రూ.1.99కి ఇతర రాష్ట్రాలు ఒప్పందాలు చేసుకుంటే.. అదేకాలంలో జగన్ ప్రభుత్వం రూ.2.49లకు ఒప్పందం చేసుకుని ప్రజలకు నష్టం చేకూర్చింది. అంతేకాక రాజస్థాన్ నుంచి ఏపీకి విద్యుత్ జనరల్ నెట్‌వర్క్ యాక్సెస్ (జిఎన్‌ఏ) ద్వారా తెచ్చుకోవడానికి 25ఏళ్లలో రూ.62 వేల కోట్లు ట్రాన్స్‌మిషన్ ఖర్చవుతుంది. ఈ ట్రాన్స్‌మిషన్ ఛార్జీలు లేవని సాక్షి పచ్చి అబద్ధాలు రాసింది. ట్రాన్స్‌మిషన్ ఛార్జీలు ఏపీ భరించాల్సిన అవసరం లేదని ఒప్పందంలోని ఏ పేరాలో, ఏ పేజీలోవుందో సాక్షి రుజువులు చూపలేదు. యూనిట్ విద్యుత్ రూ.2.49తోపాటు అదనంగా ట్రాన్స్‌మిషన్ ఛార్జీల భారం 62వేల కోట్లు పైనే ఏపీ ప్రజలపై పడుతుందని విద్యుత్ శ్వేతపత్రం వాస్తవాన్నే ప్రకటించింది.
సెకీ ఒప్పందం వల్ల యువతకు ఉద్యోగాలు రావు. ప్రభుత్వానికి పన్నులు రావు. స్థానికులకు వ్యాపారాలు పెరగవు. రాజస్తాన్‌లో 7వేల మెగావాట్లు సోలార్ ప్లాంట్లు నెలకొల్పుతారు. దానివల్ల ఆ రాష్ట్ర యువతకు ఉద్యోగాలు వస్తాయిగానీ మనకు రావు. ఏపీ విద్యుత్ వినియోగదారులు భారాలు మోసి, రాజస్థాన్ యువతకు ఉద్యోగాలు కల్పించే విధంగా జగన్ ఎందుకు సెకీతో ఒప్పందం చేసుకున్నారు? గుజరాత్‌కు చెందిన ఈ ప్లాంట్ పారిశ్రామికవేత్తను ప్రసన్నం చేసుకుని జగన్ కేసులలో లబ్దిపొందడానికే ఏపీ ప్రజలపై మోయలేని భారాలు మోపారు.
2014`19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం రాయలసీమలో 7వేల మెగావాట్ల సోలార్, విండ్ ప్లాంట్లు స్థాపించింది. వీటిద్వారా రాయలసీమ యువత 13వేల మందికి ఉద్యోగాలు లభించాయి. రైతుల భూముల విలువ పెరిగింది. ప్రభుత్వానికి పన్నులు పెరిగాయి. జగన్ ఇలా రాయలసీమలో ప్లాంట్లు స్థాపించకుండా రాజస్థాన్ ప్లాంట్లనుంచి విద్యుత్ కొనే విధంగా సెకీతో ఒప్పందం చేసుకోవడం రాయలసీమ ద్రోహంకాదా? చంద్రబాబు పాలనలో మిగులు విద్యుత్ ఉండగా జగన్ పాలనలో లోటు ఎందుకు ఏర్పడిరది. అధిక ధరలకు 43వేల మిలియన్ యూనిట్లు ఇతర రాష్ట్రాల నుంచి కొని రూ.26వేల కోట్ల భారం ప్రజలపై వేసింది వాస్తవం కాదా? చంద్రబాబు పాలనలో యూనిట్ విద్యుత్ సరాసరి రూ.4కు కొంటే, జగన్ రూ.7.60లకు అంటే రెట్టింపు ధరకు ఎందుకు కొన్నారు. కమీషన్ల కోసం కాదా?
ట్రాన్స్‌ఫార్మర్లు, స్మార్ట్ మీటర్లు, బొగ్గు తదితర విద్యుత్ పరికరాలు చంద్రబాబు ప్రభుత్వం కన్నా రెండు రెట్లు, మూడు రెట్లు అధికంగా రేట్లుపెట్టి ఎందుకు కొన్నారు? కమీషన్ల కోసం కాదా? 2014`19 మధ్య చంద్రబాబు 10వేల మెగావాట్ల సామర్థ్యంగల విద్యుత్ ప్లాంట్లు అదనంగా స్థాపించారు. మరి 2019`24 మధ్య జగన్ ఒక్కటైనా కొత్త విద్యుత్ ప్లాంట్ ఎందుకు స్థాపించలేదు. రూ.32వేల కోట్ల విద్యుత్ చార్జీల బాదుడు, రూ.49వేల కోట్ల అప్పులు తెచ్చారు. అయినా విద్యుత్ కోతలతో ప్రజలను, పరిశ్రమలను అల్లాడిరచింది చాలక, సాక్షి అబద్ధాల రాతలు రాసింది. అబద్ధాలు నమ్మి మోసపోవడానికి ఏపీ ప్రజలు మరోసారి సిద్ధంగా లేరు. విద్యుత్ వ్యవస్థను విధ్వంసం చేసినందుకు జగన్, పెద్దిరెడ్డి ప్రజలకు క్షమాపణలు చెప్పాలి.