- ప్రజావినతుల కార్యక్రమంలో బాధితుల ఫిర్యాదులు
- అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే యార్లగడ్డ, కుడుపూడి సత్తిబాబు
- సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశం
మంగళగిరి(చైతన్యరథం): ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఏపీ శెట్టి బలిజ కార్పొరేష న్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబులు అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. అధికారు లతో ఫోన్లలో మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఈ సందర్భంగా పలువురికి ఎమ్మెల్యే యార్లగడ్డ ఆర్థిక సాయం అందించారు.
` బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన ఒంటెల పేర య్య సమస్యను వివరిస్తూ తన భూమిని ఆక్రమించి సాగుచేసుకోనివ్వకుండా తనపై దాడులకు దిగుతున్నారని. భూమిని విడిపించి తనకు న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశాడు.
` రాష్ట్రవ్యాప్తంగా మునిసిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న క్లాప్ ఆటోడ్రైవర్లు, సూపర్ వైజర్ల సమస్యలను పరిష్కరించి తమను ఏజెన్సీ వ్యవస్థ నుంచి తప్పించి మునిసిపాలిటీ పరిధిలోకి తెచ్చి తమకు వేతనాలు చెల్లించాలని పలువురు క్లాప్ ఆటో డ్రైవర్లు గ్రీవెన్స్ లో విజ్ఞప్తి చేశారు.
` నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం సిద్దాపురం గ్రామంలోని తమ భూమికి రిటైర్డ్ తహసీల్దారు ద్వారా దొంగ సంతకాలతో పాస్ పుస్తకాలు పుట్టించుకుని రాంబాబు అనే వ్యక్తి ఆక్రమించుకున్నాడని అదే గ్రామానికి చెందిన ఇరగదిండ్ల దేవమ్మ ఫిర్యాదు చేశారు. దొంగ పాస్ పుస్తకాలను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు.
` కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరం రెవెన్యూ పరిధిలో తన పుట్టింటి వారు తనకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన భూమిని అధికారులు నిషేధిత జాబితాలో చేర్చారని ఆవుల వేణుకుమారి ఆవేదన వ్యక్తం చేసింది. తన భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని విన్నవించుకుంది.
` రెవెన్యూ రికార్డులను పరిగణలోకి తీసుకోకుండా వ్యవసాయ భూమిని వ్యవసా యేతర భూమిగా మార్చి తన భూమిని మరొకరికి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన అధికా రులపై చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామానికి చెందిన మూల్పూరు వెంకట లక్ష్మీప్రసాద్ ఫిర్యాదు చేశారు. అక్రమ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి తనకు న్యాయం చేయాలని కోరాడు.
` తమ దాయాదులు తమ భూమికి తప్పుడు కాగితాలు సృష్టించుకుని తన భూమి లో తనను ఇళ్లు నిర్మించుకోకుండా ఇబ్బంది పెడుతున్నారని పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం కనుమల చెరువు గ్రామానికి చెందిన గుమ్మా వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకుని తనకు ఇబ్బంది లేకుండా చూడాలని విన్నవించారు.