• కొండపి నియోజకవర్గం తిమ్మపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామ సమీపంలోని అటవీ భూమిని తాతల కాలం నుండి సాగుచేసుకుంటున్నాం.
• మేమంతా సన్న, చిన్నకారు రైతులం.
• వైసీపీ ప్రభుత్వం అడవి పోరంబోకు భూముల్లోకి మమ్మల్ని వెళ్లకుండా అడ్డుకుంటోంది.
• దీంతో మేమంతా ఉపాధిని కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.
• మీరు అధికారంలోకి వచ్చాక మేం సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు ఇప్పించాలి.
• మేము సాగుచేసుకునే భూమిపై శాశ్వత హక్కులు కల్పించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• రైతులను ఏదోవిధంగా ఇబ్బంది పెట్టడం జగన్ ప్రభుత్వానికి పరిపాటిగా మారింది.
• దీర్ఘకాలంగా రైతులు సాగుచేసుకుంటున్న భూముల్లోకి రైతులను వెళ్లనీయకపోవడం అన్యాయం.
• టిడిపి అధికారంలోకి వచ్చాక పోరంబోకు భూముల్లో రైతులు సాగుచేసుకునే అవకాశం కల్పిస్తాం.
• అటవీభూములకు పట్టాలిచ్చే అంశంపై కేంద్రంతో చర్చించి, నిర్ణయం తీసుకుంటాం.