• సూళ్లూరుపేట నియోజకవర్గం తిమ్మాజీ కండ్రిగ గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామంలోని స్వర్ణముఖి నదిపై చెక్ డ్యామ్ నిర్మించాలి.
• మా పొలాలు సాగుచేసుకునేందుకు మోటార్లు, పైపులైన్లు ఏర్పాటు చేయాలి.
• మా గ్రామంలో కమ్యూనిటీ హాలు నిర్మించాలి.
• మా గ్రామం నుండి నాయుడుపేట వెళ్లే దారిని బాగుచేయించాలి.
• గత పాలనలో వేసిన వీధి దీపాలు కొన్ని చెడిపోయాయి, వాటిని రిపేరు చేయించాలి.
• గ్రామంలోని ఎస్సీ, ఎస్టీలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసింది.
• టిడిపి హయాంలో చెరువుల్లో పూడికతీత, గొలుసుకట్టు చెరువుల అభివృద్ది, చెక్ డ్యామ్ ల నిర్మాణానికి రూ.18,265 కోట్ల రూపాయల ఖర్చుచేశాం.
• తిమ్మాజీ కండ్రిగ గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు చెక్ డ్యామ్ నిర్మించి, సాగునీరు అందజేస్తాం.
• గ్రామంలో కమ్యూనిటీ హాలు, వీధిలైట్లు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తాం.
• ఎస్సీ, ఎస్టీలకు ఇళ్లస్థలాలతో పాటు, పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం.