- నేతన్నలకు 365 రోజులూ పనికల్పించడమే లక్ష్యం
- సీఎం చంద్రబాబు కృషితో చేనేతకు మంచిరోజులు
- చేనేత జౌళి, బీసీ సంక్షేమ మంత్రి సవిత
అమరావతి(చైతన్యరథం): ఈ కామర్స్‌లో చేనేత వస్త్రాల విక్రయాలకు చర్యలు తీసుకుం టున్నామని, ఇందుకోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని చేనేత జౌళి, బీసీ సంక్షేమ మంత్రి సవిత వెల్లడిరచారు. నేతన్నలకు 365 రోజులూ పనికల్పించడమే సీఎం చంద్రబా బు నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాల యంలో సవితను ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ సభ్యులు గురువారం కలిశారు. సమ స్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో చేనేత రంగం పూర్తిగా నిర్వీర్యమైందన్నారు. 2014-19లో తమ ప్రభుత్వం నేతన్నల అభ్యు న్నతికి అమలు చేసిన అన్ని పథకాలను గత జగన్ ప్రభుత్వం నిలిపేసిందన్నారు. దీనివల్ల చేనేతకు ప్రోత్సాహం కరవై నేతన్నలపై మోయలేని భారం పడిరదన్నారు. అదే సమయంలో ఉత్పత్తయిన వస్త్రాలకు మార్కెట్ సదుపాయం లేకపోవడంతో పెట్టిన పెట్టుబడి తిరిగి రాక నేతన్నలు అప్పుల పాలయ్యే పరిస్థితి ఏర్పడిరదని తెలిపారు. మరోసారి చంద్రబాబు అధికా రంలోకి రావడంతో చేనేతకు మంచిరోజులు వచ్చాయన్నారు. 2014-19లో అమలు చేసిన అన్ని పథకాలను మళ్లీ అమలు చేస్తామని చెప్పారు.
చేనేత వస్త్రాలపై జీఎస్టీని మినహా యించే అంశపై త్వరలో ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు తెలిపారు. చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామన్నారు. ఈ కామర్స్‌లో చేనేత వస్త్రాల విక్రయాలకు ఇప్పటికే ఆయా సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చించినట్టు వివరించారు. విజయవాడలో నిర్వహించిన చేనేత వస్త్ర ప్రదర్శన పెద్దఎత్తున విజయవంతమైందని తెలిపి న మంత్రి భవిష్యత్తులోనూ ఇటువంటి ప్రదర్శనలు రాష్ట్రమంతటా నిర్వహించి చేనేత ఉత్ప త్తుల విక్రయాలకు అవకాశం కల్పించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడిరచారు. మంత్రిని కలిసిన వారిలో వీవర్స్ ఫెడరేషన్ సభ్యులు పి.ఎం.త్రినాథ్, టి.మోహన్‌కృష్ణ, బి.ఆనం దప్రసాద్, కె.కోటేశ్వరరావు, వి.పల్లపురాజు, ఫణికుమార్, పరమేశ్వరరావు, శేషయ్య నేత, దుర్గాప్రసాద్, వీరయ్య తదితరులు ఉన్నారు.