చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home చైతన్యరధం

ఈ పోరాటం నాదే కాదు..ప్రజలందరిదీ!

ఎన్ని కష్టాలు వచ్చినా అడుగు ముందుకేనన్న భువనేశ్వరి

by చైతన్యరధం
Oct 26, 2023 at 10:22am
in చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఈ పోరాటం నాదే కాదు..ప్రజలందరిదీ!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా?
  • హింసా రాజకీయాలు, అత్యాచారాలు, గంజాయి తప్ప అభివృద్ధి లేదు
  •  ‘నిజం గెలవాలి.. నిజమే గెలవాలి అని చెప్పేందుకే నేను వచ్చా
  • బ్రిటిష్‌ వాళ్లతో పోరాడినట్లు ఈ ప్రభుత్వంతో పోరాడాల్సి వస్తోంది
  • చంద్రబాబుపై కేసులు పెట్టడం తప్ప.. అభివృద్ధిపై ఈ ప్రభుత్వం ధ్యాస పెట్టడం లేదు
  • జైల్లో పెట్టింది చంద్రబాబును కాదు..రాష్ట్ర అభివృద్ధిని, న్యాయాన్ని
  • ఎన్టీఆర్‌ నేర్పించిన తెలుగు పౌరుషంతో ప్రభుత్వంపై పోరాడుదాం
  • చంద్రబాబు కష్టాన్ని గుర్తుంచుకున్న ప్రజలందరికీ పాదాభివందనం
  • నిజం గెలవాలి సభలో ఉద్వేగభరిత ప్రసంగం

 

చంద్రగిరి: నిజం గెలవాలనేది ఒక పోరాటం… ఈ పోరాటం నా ఒక్కదానిదే కాదు.. ప్రజలందరిదీ అని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై పోరాటంలో భాగంగా తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని అగరాలలో బుధవారం రాత్రి జరిగిన నిజం గెలవాలి సభలో మాట్లాడుతూ ప్రభుత్వంపై భువనేశ్వరి నిప్పులు చెరిగారు. తనలోని ఆవేదన, బాధను ప్రసంగంలో వెలిబుచ్చుతూ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రం లో హింసా రాజకీయాలు, అత్యాచారాలు, గంజాయి తప్ప అభివృద్ధి లేదని మండిపడ్డారు. చంద్రబాబు అక్రమ అరెస్టును జీర్ణించుకోలేక చంద్రగిరి నియోజకవర్గంలో గుండెపోటుతో మరణించిన వారి కుటుంబ సభ్యులను బుధవారం ఉదయం భువనేశ్వరి పరామర్శించారు. అనంతరం సాయంత్రం అగరాలలో ఏర్పాటు చేసిన ‘నిజం గెలవాలి’ సభలో మాట్లాడారు. నేను రెండు రోజుల క్రితం నారావారిపల్లెకు వెళ్లినప్పుడు గతంలో నా కుటుంబంతో గడిపిన సంఘటనలు గుర్తొచ్చి గుండె పిండేసినట్లయింది. నా మనసులోని బాధను సాటి మహిళలుగా మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. నేను ఇక్కడికి వచ్చింది రాజకీయాలు మాట్లా డటానికి, రాజకీయాలు చేయడానికి కాదు. మొదటి సారిగా ఒక సభలో మాట్లాడుతున్నా.. తప్పులుంటే నన్ను క్షమించండని భువనేశ్వరి అన్నారు.

సంబంధితవార్తలు

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

పరిశ్రమలకు కేరాఫ్‌గా రాష్ట్రం అదే మన సంకల్పం కావాలి: సీఎం చంద్రబాబు

తొలి అడుగు పడింది

నిజం గెలవాలనేది ఒక పోరాటం… ఈ పోరాటం నా ఒక్కదానిదే కాదు.. మీ అందరిదీ. ఈ పోరాటం మన రాష్ట్రం కోసం, మన కోసం, మన బిడ్డల భవిష్యత్‌ కోసం. చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని, పార్టీని ఒక క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్లారు. ఎన్టీఆర్‌ నమ్మిన ప్రజలే దేవుళ్లు… సమాజమే దేవాలయం అనే నినా దంతో ఎన్టీఆర్‌ ట్రస్టును చంద్రబాబు నెలకొల్పారు. దాన్ని నేను నడిపిస్తున్నా.. సేవా కార్యక్రమాలు, బ్లడ్‌ క్యాంప్‌లు, మెడికల్‌ క్యాంప్‌లు నిర్వహిస్తున్నాం. 3 వేల మంది అనాథ పిల్లలను చదివిస్తున్నాం. తిరుపతిలో వరదలు వస్తే ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా 49 కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థికసాయం అందించాను. చంద్రబాబు గురించి నాకుంటే మీకే ఎక్కువ తెలుసు.. ఆయన జీవితమంతా ప్రజలు.. ప్రజలు అంటూ కష్ట పడుతూనే ఉన్నారు. ఆయన మనసులో టీడీపీ బిడ్డలది మొదటి స్థానం అయితే, మా కుటుంబానిది రెండో స్థానం. 14 ఏళ్లు చంద్రబాబు సీఎంగా పని చేశారు..ఆ 14 ఏళ్లు ఏపీని ముందుకు తీసుకెళ్లాలనే తపించారు. ఆయన 25ఏళ్ల క్రితం ఒక విజన్‌తో ఆలోచించి హైటెక్‌ సిటీని కట్టారు. రాళ్లు, రప్పలు, లైట్లు కూడా లేని ప్రాంతంలో హైటెక్‌ సిటీ ఏంటని అందరూ నవ్వారు. చంద్రబాబు అంతగొప్ప.. ఇంతగొప్ప అని నేను ఎప్పు డూ చెప్పలేదు. ఏమీలేని చోట హైటెక్‌ సిటీ ఎందుకు అని నేను చంద్రబాబుతో అన్నప్పుడు.. హైటెక్‌ సిటీ ఎలా అభివృద్ధి చెందుతుందో చూడు అని నాతో అన్నా రు.ఇప్పుడు ఆసిటీ ఎలా ఉందో మీ అందరికీ తెలుసు.. అది చంద్రబాబు పడ్డకష్టం. లక్షలాది మంది కుటుం బాల్లో ఆయన వెలుగులు నింపారు. ఐటీ, ఐఎస్‌బీ, ఇంకా పెద్ద పెద్ద సంస్థలను తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డారు. ఎలాంటి గర్వం లేకుండా ఒక మెట్టు కిం దకు దిగే వ్యక్తి చంద్రబాబు అని భువనేశ్వరి అన్నారు.

 

ఏ కేసులోనూ సాక్ష్యాలు, ఆధారాలు లేవు

యువతకు ఉద్యోగాలివ్వాలి.. వారు సంతోషంగా ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పే వ్యక్తి. అలాంటి వ్యక్తిని 47 రోజులుగా రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో నిర్బంధించారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఫైబర్‌ నెట్‌, స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ కేసుల్లో దేనిలోనూ సాక్ష్యాలు, ఆధారాలు లేవు… అయినా కేసులు పెట్టారు. స్కిల్‌ డెవలెప్మెంట్‌ ప్రాజెక్టులో మొదట రూ.3వేల కోట్ల అవినీతి అన్నారు. తర్వాత రూ.370కోట్లు అన్నారు. ఇప్పుడు రూ.27 కోట్ల అవినీతి అంటున్నారు. వారు పెట్టే కేసుల్లో ఏమన్నా అర్థం ఉందా.? స్కాం జరిగిం దని చెబుతున్నారు. మరి ఆ డబ్బులు ఎవరికన్నా వెళ్లి నట్లు లెక్కలు ఉన్నాయా.. ఆధారాలు ఉన్నాయా.. లేవు. చంద్రబాబుపై కేసుల మీద కేసులు పెడుతున్నారు. అది తప్ప వారికి మరో ధ్యాస లేదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనిగానీ, ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన గానీ లేదు. 2014లో రాష్ట్ర విభజన జరిగాక చంద్రబాబు ఎంతో కష్టపడ్డారు. రోజుకు మూడున్నర గంటలు మాత్రమే నిద్రపోయేవారు. ప్రజలకు మంచి చేసి, దేశంలోనే రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌ చేయాలని పరుగులు పెట్టేవారు. మీకేమన్నా పిచ్చిపట్టిందా.. నిద్రపోకుండా కష్టపడుతున్నారు, ప్రజలకు సేవ అంటూ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవడం లేదని నేను అనేదాన్ని. అలా అడిగిన తర్వాత రెండు రోజులు సాధారణంగా ఉంటూ తరువాత మళ్లీ నిద్రలేకుండానే కష్టపడేవారు. అలాంటి వ్యక్తిని ఈ రోజు జైల్లో పెట్టారు. మొన్నటి అంగళ్లు ఘటనలో ఆయనపై హత్యాయత్నం కేసులు పెట్టారు. రైతులకు నీరందించాల్సిన నీటి ప్రాజెక్టులు నిర్వీర్యం అవుతున్నాయని అడిగినందుకు కేసులు పెట్టారని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.

పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలి

చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ బిడ్డలు శ్రీకాకుళం నుండి కుప్పం వరకు సైకిల్‌ యాత్ర చేస్తే పుంగనూరులో వారి చొక్కాలు చింపి, జెండాలు తొలగించి అవమానించారు. ఎంత మందిని అరెస్టు చేసినా టీడీపీ జెండా పట్టుకునే కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్తారని మర్చిపోతున్నారు. వారి చేష్టలతో ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. ఈ పోరాటాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలి. యువగళం పాదయాత్రలో లోకేష్‌ మైక్‌, సౌండ్‌ వాహనం, స్టూల్‌ కూడా ఎత్తుకెళ్లారు. ఎంత దిగజారి ప్రవర్తిస్తున్నారో అర్థం చేసుకోవాలి. టీడీపీ శ్రేణులు కనబడితే కేసులు పెడుతున్నారు. నేను ఎవర్ని కలిసినా నాపై 10 కేసులు, 20 కేసులు ఉన్నాయని చెబుతున్నారు. కేసులు పెట్టడం 50 రోజులు జైల్లో పెట్టడం చేస్తున్నారు. యువగళం వాలంటీర్లను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నిరంతరం పడుతున్న కష్టం ప్రజలకు తెలుస్తుందా.. లేదా అనుకునేదాన్ని. కానీ నేడు ప్రతి ఒక్కరికీ పాదాభివందనం చేస్తున్నా..ప్రజలంతా చంద్రబాబు కష్టం గుర్తుంచుకున్నారు. మహిళలు, ప్రజలు చంద్రబాబు కోసం బయటకు వచ్చి పోరాడుతున్నారు. పోరాడుతున్న వారిని ఆడ, మగ అని చూడకుండా పోలీసులు ఇష్టానుసారంగా కొడుతూ లాక్కెళ్లి వ్యానుల్లో పడేస్తున్నారు. స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. ఇదేనా పరిపాలన అంటే.? ప్రజలు ఎందుకు బయటకు వచ్చి పోరాడుతున్నారో అర్థం చేసుకోవాలి. చంద్రబాబు మహానాయకుడు అని, మహిళలకు భద్రత కల్పిస్తారని నమ్ముతున్నారు. మహిళల కోసం చంద్రబాబు 22 పథకాలు తీసుకొచ్చారు. మహానాడు వేదికగా మహిళలకు మహాశక్తి పథకాలు ప్రకటించారు. ఆయన బయట ఉండుంటే దసరాకు మరిన్ని పథకాలు మహిళలకు ప్రకటించేవారు. ఇవాళ కాకపోయినా, రేపైనా నిజం గెలిచి చంద్రబాబు బయటకు వస్తారు. చంద్రబాబును నిర్బంధిస్తే భౌతికంగా, మానసికంగా బలహీనపడతారని, పార్టీ చెల్లాచెదరవుతుందని ఈ ప్రభుత్వం అనుకుంది. ఆ కుట్రతోనే ఎన్నికలకు మందు ఇవన్నీ చేస్తున్నారు. చంద్రబాబు చాలా స్ట్రాంగ్‌ పర్సనాలిటీ కలిగిన వ్యక్తి. 45 ఏళ్లలో ఇలాంటివి ఎన్నో ఎదుర్కొన్నారు..ఆయనకు ఇదొక సమస్య కాదని భువనేశ్వరి ధీమా వ్యక్తం చేశారు.

Tags: అక్రమ కేసులుఅత్యాచారాలుఅభివృద్దిఎన్టీఆర్గంజాయిచంద్రబాబునాయుడునిజం గెలవాలినిజం గెలవాలి సభపాదాభివందనంప్రజలుబ్రిటిష్‌భువనేశ్వరిహింసా రాజకీయాలు
Previous Post

చంద్రగిరి నియోజకవర్గం, అగరాలలో నారా భువనేశ్వరి గారి ‘నిజం గెలవాలి’ కార్యక్రమం.

Next Post

ఇదేనా సామాజిక న్యాయం జగన్ రెడ్డి ..!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 22-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-02-2026

కార్యకర్త
@ February 22, 2026
చైతన్యరధం ఈ పేపర్ 21-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-02-2026

కార్యకర్త
@ February 21, 2026
బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట
ఆంధ్రప్రదేశ్

బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట

చైతన్యరధం
@ February 21, 2026
సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం
ఆంధ్రప్రదేశ్

సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం

చైతన్యరధం
@ February 21, 2026
ఏపీలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గింది
ఆంధ్రప్రదేశ్

ఏపీలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గింది

చైతన్యరధం
@ February 21, 2026
అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం
ఆంధ్రప్రదేశ్

అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం

చైతన్యరధం
@ February 21, 2026
టెన్త్‌లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి
ఆంధ్రప్రదేశ్

టెన్త్‌లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి

చైతన్యరధం
@ February 21, 2026
ఢిల్లీలో ఏఐ సమ్మిట్..ఏపీ సీఎం బిజీబిజీ…
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీలో ఏఐ సమ్మిట్..ఏపీ సీఎం బిజీబిజీ…

చైతన్యరధం
@ February 21, 2026
Load More

ముఖ్య వార్తలు

వైసీపీ ఘోర అపచారం

వైసీపీ ఘోర అపచారం

చైతన్యరధం
@ February 21, 2026
నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రం ఏపీ

నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రం ఏపీ

చైతన్యరధం
@ February 21, 2026
‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

చైతన్యరధం
@ February 19, 2026
అదరహో.. ఐఎఫ్ఆర్

అదరహో.. ఐఎఫ్ఆర్

చైతన్యరధం
@ February 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట

బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట

చైతన్యరధం
@ February 21, 2026
సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం

సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం

చైతన్యరధం
@ February 21, 2026
ఏపీలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గింది

ఏపీలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గింది

చైతన్యరధం
@ February 21, 2026
అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం

అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం

చైతన్యరధం
@ February 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist