- లోకేష్ యువగళం.. ప్రజాగళంగా కదం తొక్కింది
- యువగళం పాదయాత్రకు ఎన్టీఆర్ కాలం నాటి విశేష స్పందన
- కనకపు సింహాసనంపై శునకం మాదిరి జగన్ తీరు
- జగన్ పాలనలో సామాజిక న్యాయం శూన్యం
పోలిపల్లి: ఇది లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభ కాదు… వైసీపీ అంతిమ యాత్రకు ఆరంభ సభ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఉద్ఘాటించారు. విజయ నగరం జిల్లా పోలిపల్లిలో బుధవారం జరిగిన నవశకం బహిరంగసభలో బాలకృష్ణ మాట్లాడుతూ మేటి ప్రజా శక్తి.. మహానాయకుల కలయికకు వేదికగా మారిన ఈ సభ నభూతో.. నభవిష్యత్‌గా నిలుస్తుందన్నారు. ఇక నుంచే ఎన్నికల సమరం మొదలైంది. ఇది అంతం కాదు…ఆరంభం. లోకేష్ పాదయాత్ర అన్నివర్గాల ప్రజ ల ఆదరణతో విజయవంతంగా కొనసాగింది. వైసీపీ పాలనలో తమకు జరిగిన అన్యాయాన్ని, ఇబ్బందులను రాష్ట్ర యువత గుర్తుపెట్టుకోవాలి. 1982లో ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపునకు కులాలు, మతాలు, వర్గాలకు అతీ తంగా విశేష స్పందన వచ్చింది. అదే విధంగా నేడు యువగళం పాదయాత్రకు అంతటి విశేష స్పందన వచ్చింది. లోకేశ్ యువగళం.. ప్రజాగళంగా కదం తొక్కింది. యువనేతపై ఈగ వాలకుండా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కాపాడుకుంటూ వచ్చారు. యువ నేతకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదా లు. అధికారంలో ఉన్న వైసీపీ చేస్తున్న అక్రమాలు.. దౌర్జన్యాలు.. దుశ్చర్యలకు తగిన గుణపాఠంగా లోకేష్ పాదయాత్ర నిలిచింది. చరిత్రలో చూస్తే మనకు ఎదు రైన అనేక అవాంతరాలు..అడ్డంకులు.. ఘటనల్ని ఎలా ఎదిరించి నిలిచామో తెలుస్తుంది. యువగళం పాద యాత్రను అడ్డుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. మాట్లాడనివ్వకుండా మైక్ లాక్కున్నారు.. ప్రజల్లో నిల బడకుండా చేశారు. ప్రభుత్వ అడ్డంకులు.. అవ మానాలు అధిగమించి ముందుకుసాగిన లోకేశ్‌ను అభి నందిస్తున్నాను. అతనికి సహకరిస్తూ.. పాదయాత్ర విజ యవంతం కావడంలో తమవంతు పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికీ బాలకృష్ణ అభినందనలు తెలియజేశారు.
పవన్ కల్యాణ్ తొలినుండీ ప్రజలకోసం పోరాడుతూనే ఉన్నారు
ఎన్టీఆర్ గారు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు .. ఎవరి రుణం ఉంచుకోకూడదని. పవన్ కల్యాణ్..నేను కేవలం నటులం మాత్రమే కాదు. ఈ సమాజ పౌరులు గా మాకున్న బాధ్యతలు నెరవేర్చాలి. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ స్థాపించినప్పటినుంచీ ప్రజలకోసం పోరా డుతూనే ఉన్నారు. సినిమాల్లో కంటే ఎక్కువగా రోడ్ల పైనే కనిపిస్తున్నారని బాలకృష్ణ అన్నారు.
చంద్రబాబు విజనరీ నాయకుడిగా ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారు
చంద్రబాబు దూరదృష్టితో అనేక కార్యక్రమాలు చేప ట్టారు. మహిళల్ని ఆర్థికంగా.. సామాజికంగా బలో పేతం చేయడానికి డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చారు. యువతకోసం ఐటీ సాంకేతిక పరిజ్ఞానం అందించారు. తన తెలివితేటలతో ప్రపంచానికే ఆదర్శంగా విజనరీ నాయకుడిగా నిలిచారు.అలానే స్వర్గీయ ఎన్టీఆర్ ప్రజల కోసం అమలుచేసిన పథకాలు ఎంతో సుసాధ్యమైనవి. ఆయన తర్వాత వచ్చేవారు తన పథకాలు అనుకరిం చేలా చేశారు. అందుకే అన్నగా తెలుగువారి గుండెల్లో నిలిచిపోయారని బాలకృష్ణ అన్నారు.
రాష్ట్రంలో సమర్థతలేని చెత్తప్రభుత్వాన్ని చూస్తున్నాం
రాష్ట్రంలో సమర్థతలేని చెత్త ప్రభుత్వాన్ని చూస్తు న్నాం. పోలవరాన్ని సంవత్సరంలోపు పూర్తిచేస్తామన్నా రు… నాలుగున్నరేళ్లు అయినా చేయలేని చెత్త ప్రభు త్వంగా మిగిలింది. అభివృద్ధి శూన్యం. నిత్యావస రాలు.. పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. వైసీపీ పాలన అంతా కల్తీ మద్యం.. గంజాయి.. మాద కద్రవ్యాల మయం. వైసీపీనేతలు ల్యాండ్,శాండ్, ఇతర కుంభకోణాలతో కోట్లు కొల్లగొడుతున్నారు. అమరావ తిని గాలికి వదిలేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. అన్యా యంగా అరెస్ట్‌చేసి జైళ్లకు పంపారు. ఈ ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని విధాలా వెనుకబడిపోయిందని బాలకృష్ణ విమర్శిచారు.
జగన్ తెలంగాణకు వెళ్లాలనుకుంటే అక్కడి ప్రజలు సరిహద్దుల్లోనే ఆయన్ని అడ్డుకుంటారు
ఉద్యోగులు.. ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు కూడా జగన్ నెరవేర్చలేదు. అందరిపై పెత్తనం చేయ డం.. అందినకాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నా రు. హిందూపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ ఆసుపత్రిస్థాయిలో తీర్చి దిద్దాము. అలాంటి ఆసుపత్రిని ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా గాలికి వదిలేసింది. ఎక్కడా రాష్ట్రంలో ఒక్క రోడ్డు వేసిందిలేదు. కనీసం గుంతలు కూడా పూడ్చలేదు. కనకపు సింహాసనంపై శునకం అన్న రీతిలో ఒక సైకో ప్రజలపై పెత్తనం చేస్తు న్నాడు. తెలంగాణ ప్రభుత్వం గతపాలకులు సాగించిన అభివృద్ధిని కొనసాగించింది. ఎక్కడా ఏమీ నష్టపరచ లేదు. జగన్‌రెడ్డిని ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయా లనుకుంటే అక్కడి ప్రజలు సరిహద్దుల్లోనే అడ్డుకుంటా రు. రాష్ట్ర ప్రజల్లో ఒక ఉద్యమం రావాలి. కులాలు.. మతాలు.. ప్రాంతాలకు అతీతంగా అందరూ రాష్ట్రం కోసం ఒక్కటవ్వాలి. మన రాష్ట్రాన్ని చూసి ఇప్పటికే పొరుగు రాష్ట్రాలు అవహేళన చేస్తున్నాయని తెలుసు కోండి. తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. చంద్రబాబు తెలుగువారి శక్తియుక్తుల్ని ప్రపంచానికి చాటారు. ఇకమనకు సమయంలేదని గుర్తుంచుకోండి. ఉచిత పథకాల మాయలో పడకుండా.. ప్రజలంతా ముందుకు రావాలి. రాష్ట్రాన్ని ఈ సైకో సర్వ నాశనం చేశాడని తెలుసుకోవాలని బాలకృష్ణ హితవు పలికారు.
జగన్ బావిలో కప్పమాదిరి రాష్ట్రాన్ని మార్చాడు
వైసీపీలో జరుగుతున్న సీట్ల మార్పిడిపై సొంతపార్టీ నేతలు కూడా జగన్ ను వ్యతిరేకిస్తున్నారు. సామాజిక న్యాయం అనేది లేకుండా దళితులు… బీసీలనే జగన్ మారుస్తున్నాడు. యువతను మత్తుపదార్థాలకు బానిస ల్ని చేశాడు. రాష్రానికి ఎన్ని పరిశ్రమలు వచ్చాయి.. ఎంతమంది యువతకు ఉద్యోగాలు ఇచ్చారంటే ప్రభు త్వం నుంచి సమాధానంలేదు. టీడీపీ ప్రభుత్వం పేదల కోసం కట్టించిన టిడ్కో ఇళ్లను నిరుపయోగంగా మార్చాడు. బావిలో కప్ప..ఆ బావే సర్వస్వం అనుకున్న ట్టు రాష్ట్రంలో పరిస్థితిని మార్చాడు. నాలుగున్నరేళ్ల పాటు ఈ ముఖ్యమంత్రి ఎవరికీ ఏమీ చేసింది లేదు. ప్రజల్నీ ఉద్ధరించింది లేదని బాలకృష్ణ దుయ్యబట్టారు.
పవన్ కల్యాణ్ నేను ముక్కుసూటి మనుషులం.. ప్రజలకోసం ఎంతకైనా తెగిస్తాం
టీడీపీ-జనసేన కలయిక మహా కలయిక. పవన్ కల్యాణ్..నేను ఇద్దరం ముక్కుసూటి మనుషులమే. ప్రజలకోసం మేం ఎంతకైనా తెగిస్తాం. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రానికి.. తెలుగుజాతికి పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు.. పిల్లల భవిష్యత్ కోసం కలిసి పోరాడదాం.. కలిసి ఉద్దమిద్దాం. అడ్డొచ్చిన వారికి ఎలాంటి సమాధానం చెప్పాలో చెబుదామని బాలకృష్ణ తేల్చిచెప్పారు.