చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఇదీ.. వాళ్ల దుర్మార్గం!

జగన్‌ పార్టీ కుట్రలు ఏకరువు పెట్టిన చంద్రబాబు

by చైతన్యరధం
Aug 24, 2025 at 6:40am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఇదీ.. వాళ్ల దుర్మార్గం!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • వైసీపీ అనైతిక రాజకీయంపై సీఎం నిప్పులు
  • జగన్‌ పార్టీ కుట్రలు ఏకరువు పెట్టిన చంద్రబాబు
  • ఏపీలో బొమ్మాళీ భూతమంటూ చమత్కారం

పెద్దాపురం (చైతన్య రథం): గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం అభివృద్ధి పరుగులు తీస్తుంటే.. ప్రతిపక్ష హోదాకూడా దక్కించుకోని వైసీపీ అడ్డంకులు సృష్టిస్తోందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రమాదకరమైన విషపూరిత ప్రచార రాజకీయాలతో రాష్ట్ర ప్రగతిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు.. స్వచ్ఛతా ర్యాలీ అనంతరం నిర్వహించిన సభలో వైసీపీ దుర్మార్గ రాజకీయాలను ఎండగట్టారు. వైసీపీ సాగించిన అత్యంత విషపూరిత ప్రచారాలైన పది అంశాలను సీఎం చంద్రబాబు ఏకరువు పెడుతూ.. రాష్ట్రంలో ఎలాంటి దుష్ట రాజకీయ పార్టీ ఉందో, వాళ్ల క్రిమినల్‌ పాలిటిక్స్‌ ఎలా ఉంటాయో అర్థం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
1. వివేకా హత్య కేసు: బాబాయి హత్య అనేది దేశంలోనే క్రిమినల్‌ పాలిటిక్స్‌కు కేస్‌ స్టడీ… అవునా? కాదా? తప్పుడు ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ది పొందారా లేదా?
2. కోడి కత్తి డ్రామా: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాడు కోడి కత్తి డ్రామా ఆడారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ కేసు ఎటుపోయిందో మీరే చూశారు. దీన్ని మిస్టరీగా మార్చారు.
3. గులకరాయి డ్రామా: సీఎంగా ఉండి గులకరాయితో హత్యాయత్నమంటూ కట్టుకథలతో ఎన్నికల డ్రామా ఆడారు.
4. డయాఫ్రమ్‌ వాల్‌: అసమర్ధతో, నిర్లక్ష్యంతో, అహంకారంతో పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్‌ వాల్‌ కొట్టుకుపోవడానికి కారణమై… ఆ నెపాన్ని మాపైనే నెట్టారు.
5. పింఛన్ల నిలిపివేత: 2024 ఎన్నికల సమయంలో వాలంటీర్లతో పింఛన్లు ఇవ్వొద్దంటే.. ఏకంగా ఇంటికివెళ్లి పింఛను ఇవ్వడమే ఆపేశారు. అక్కడికి రా.. ఇక్కడికి రా.. అంటూ వాళ్ల రాజకీయం కోసం వృద్ధులను మండుటెండలో తిప్పారు. 16మంది వృద్ధుల ప్రాణాలు తీసి… దానికి చంద్రబాబు కారణమని సొంత మీడియా ద్వారా ఊదర గొట్టారు.
6. సింగయ్య మృతి: 2024 ఎన్నికల తీర్పు తరువాతా వాళ్లు మారలేదు. పరామర్శల పేరిట యాత్రలు చేస్తున్నారు. ఈ రాజకీయ ఉనికి యాత్రల కోసం అమానుషంగా తమ వెహికల్‌తో తొక్కించి సింగయ్య అనే కార్యకర్త ఉసురు తీశారు. వీడియో బయటపడే వరకు అసలు ఏంజరిగిందనే విషయాన్ని దాచిపెట్టారు. వీడియో బయటికి వచ్చాక.. సింగయ్య భార్యను ప్రలోభపెట్టి… అంబులెన్సులో చంపేశారని మనపైనే విమర్శలు చేయించారంటే వాళ్లు ఏస్థాయి క్రిమినల్స్‌ అనేది అర్ధం చేసుకోవాలి.
7. వీడియో మార్ఫింగ్‌: జనం తన కోసం ఎగబడుతున్నట్టుగా బిల్డప్‌ ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. నెల్లూరు పర్యటనలో బంగారుపాళ్యం జనాన్ని మిక్స్‌చేసి చూపించారు.
8. మునిగింది రాజధాని కాదు: వైసీపీ ‘రాజధాని అమరావతిపై ఎప్పుడూ విషం కక్కే వైసీపీ… అమరావతి మునిగిందంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది. అమరావతిపై విషం చిమ్మాలనే ప్రయత్నంలో రాష్ట్ర బ్రాండ్‌ను కూడా దెబ్బ తీస్తున్నారు. రాజధాని మునగలేదు. విష ప్రచారంలో వైసీపీ మునిగింది. రాజకీయంగానూ పూర్తిగా మునిగిపోతుంది.
9. పెట్టుబడులు వద్దంటూ లేఖలు: ‘తాము అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో కంపెనీలను వెళ్లగొట్టిన వైసీపీ పాలకులు… ప్రతిపక్షంలోనూ కుట్రలు కంటిన్యూ చేస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రానివ్వకుండా సంస్థలకు లేఖలు రాస్తున్నారు.
10. పింఛన్లపై తప్పుడు ప్రచారాలు: ‘ఇప్పుడు మళ్లీ పింఛన్లపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ల హయాంలో వేలు, లక్షల మంది అనర్హులకు, పార్టీ కార్యకర్తలకు పింఛన్లు ఇచ్చారు. వీటిపై వెరిఫికేషన్‌ జరుగుతుంటే… 4 లక్షల పింఛన్లు తీసేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఒక్క పింఛను కూడా ఇప్పటికి తీయలేదు. అర్హులైన వారి ఏ ఒక్క పింఛనూ తీసేది లేదు. అనర్హులకు తప్పుడు పత్రాలతో పింఛన్లు ఇప్పించారు. అనర్హులకు ఫించన్లు ఇచ్చి.. అర్హులను వైసీపీ పక్కన పెట్టింది. కూటమి ప్రభుత్వం అలా చేయదు. అనర్హులను పక్కన పెడుతుంది.. అర్హులకు పింఛన్లు ఇస్తుంది `అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
ఏపీలో బొమ్మాళీ భూతం…
ఈ సందర్భంగా అరుంధతి సినిమా గుర్తుందా? అంటూ సీఎం సభికులను ప్రశ్నించారు. సభికులనుంచి ‘వదల బొమ్మాళీ..’ అంటూ సమాధానం వచ్చింది. దీంతో మీరే ఆ విషయం చెప్పండంటూ ముఖ్యమంత్రి సభికులకే మైక్‌ ఇచ్చారు. ‘వదల బొమ్మాళీ.. వదల’ అంటూ అరుంధతి సినిమాలో పశుపతి పాత్రధారి చెప్పిన డైలాగును సభికులు చెప్పడం ఆసక్తిని రేకెత్తించింది. అలాంటి భూతం మళ్లీ దుష్ప్రచారం చేస్తూ వస్తోందని.. ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని సీఎం చంద్రబాబు ప్రజలకు జాగ్రత్త చెప్పారు. పెళ్లి చేయాలంటే అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూస్తాం. ఏదైనా ఊరిలో పరిస్థితులు సరిగా లేకుంటే ఆ ఊరిలో ఉండేవారికి పిల్లనిచ్చేందుకు వెనుకాడతాం. అలాగే ఓటు వేసేటప్పుడూ మంచీ, చెడూ ఆలోచించి ఓటేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ఈ సందర్భంగా సూచించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 19-02-2026

స్పీడ్ ఆఫ్ రూల్!

ఆనందాలు నిండుగా..ఆత్మీయ పండుగ

Previous Post

మున్సిపల్‌ కార్మికులకు రూ.కోటి బీమా

Next Post

పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య రక్ష!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 19-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 19-02-2026

కార్యకర్త
@ February 19, 2026
‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక
ఆంధ్రప్రదేశ్

స్పీడ్ ఆఫ్ రూల్!

చైతన్యరధం
@ February 19, 2026
ఆనందాలు నిండుగా..ఆత్మీయ పండుగ
ఆంధ్రప్రదేశ్

ఆనందాలు నిండుగా..ఆత్మీయ పండుగ

చైతన్యరధం
@ February 19, 2026
‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక
ఆంధ్రప్రదేశ్

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

చైతన్యరధం
@ February 19, 2026
అదరహో.. ఐఎఫ్ఆర్
ఆంధ్రప్రదేశ్

అదరహో.. ఐఎఫ్ఆర్

చైతన్యరధం
@ February 19, 2026
తప్పుడు ఆరోపణలు ఉపసంహరించుకోవాలి
ఆంధ్రప్రదేశ్

తప్పుడు ఆరోపణలు ఉపసంహరించుకోవాలి

చైతన్యరధం
@ February 19, 2026
ఒక నిజాయితీ.. ఒక హెరిటేజ్
ఆంధ్రప్రదేశ్

ఒక నిజాయితీ.. ఒక హెరిటేజ్

చైతన్యరధం
@ February 19, 2026
ఆత్మీయ వారధి..ఆతిథ్య సారథి లోకేష్
ఆంధ్రప్రదేశ్

ఆత్మీయ వారధి..ఆతిథ్య సారథి లోకేష్

చైతన్యరధం
@ February 18, 2026
Load More

ముఖ్య వార్తలు

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

చైతన్యరధం
@ February 19, 2026
అదరహో.. ఐఎఫ్ఆర్

అదరహో.. ఐఎఫ్ఆర్

చైతన్యరధం
@ February 19, 2026
మీరే ఈ దేశపు హీరోలు

మీరే ఈ దేశపు హీరోలు

చైతన్యరధం
@ February 18, 2026
చదువును దెబ్బతీశారు!

చదువును దెబ్బతీశారు!

చైతన్యరధం
@ February 18, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

స్పీడ్ ఆఫ్ రూల్!

చైతన్యరధం
@ February 19, 2026
ఆనందాలు నిండుగా..ఆత్మీయ పండుగ

ఆనందాలు నిండుగా..ఆత్మీయ పండుగ

చైతన్యరధం
@ February 19, 2026
‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

చైతన్యరధం
@ February 19, 2026
అదరహో.. ఐఎఫ్ఆర్

అదరహో.. ఐఎఫ్ఆర్

చైతన్యరధం
@ February 19, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist