విశాఖ: వై నాట్ 175, వై ఏపీ నీడ్స్ జగన్, నువ్వే మా నమ్మకం జగనన్న… అంటూ వైసీపీ ప్రచార స్లొగన్స్ తో ప్రజల ముందుకెళ్తుంటే టీడీపీ ముఖ్యనేత, విశాఖ నార్త్ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు తన సోషల్ మీడియాలో జగన్ ను ఉద్దేశించి ఓ ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేశారు. ఏపీ హేట్స్ జగన్.., వద్దు వద్దు ఈ జగన్, మళ్ళీ మాకొద్దు ఈ జగన్.. అని ప్రజలు ఎందుకంటున్నారో ఇప్పటికైనా అర్థమైందా జగన్ అంటూ తన ఎక్స్ మాధ్యమంలో వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి జగన్ చేసిన విధ్వంసాన్ని ఒక్క ఫొటోతోనే ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.