- వాలంటీర్లకు పెన్షన్ బాధ్యత తప్పించడానికి కారణం అధికారపార్టీనే
- అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల ద్వారా మెరుగైన సంక్షేమం
- దొంగలు, రౌడీలు, బ్లేడ్ బ్యాచ్లను కట్ డ్రాయర్లపై ఊరేగిస్తాం
- మంగళగిరి రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్
మంగళగిరి (చైతన్యరథం): పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లపై ఎలక్షన్ కమిషన్ ఆంక్షలు విధించడానికి వైసీపీనే కారణం, వారిని రాజకీయ అవసరాలకు వినియోగించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక వాలంటీర్ వ్యవస్థను మరింత పటిష్టపర్చి పెన్షన్లతోపాటు ఇతర సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తా మని యువనేత లోకేష్ చెప్పారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి ప్రకాష్ నగర్లో సోమవారం నిర్వహించిన రచ్చబండ సభలో లోకేష్ మాట్లాడుతూ… టీడీపీ కారణంగా పింఛన్లు ఆపేశారని వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దన్నారు.
సంక్షేమాన్ని రాష్ట్రానికి పరిచయం చేసింది, తొలిసారి పెన్షన్ను ప్రవేశపెట్టింది ఎన్టీఆర్ అని చెప్పారు. రూ. 200 ఉన్న పెన్షన్ ను నూ. 2వేలు చేసింది చంద్రబాబునాయుడు. రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్ ను రూ. 4వేలకు పెంచి ఇంటివద్దకే అందజేస్తామని స్పష్టంచేశారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే దొంగలు, రౌడీలు, బ్లేడ్ బ్యాచ్ లు ఉండవు, ప్రజలను ఇబ్బందులు పెట్టే అసాంఘిక శక్తులను కట్ డ్రాయర్లపై ఊరేగిస్తామని లోకేష్ చెప్పారు.