మంగళగిరి(చైతన్యరథం): తెలుగుదేశం ఎంపవర్మెంట్ సెంటర్లో శిక్షణ పొందిన ముగ్గురు విద్యార్థులు గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు పొందారు. ఉద్యోగాలు పొందిన వారిలో ఈపూరి హరీష్‌బాబు (గుంటూరు), షేక్ వలి (బాపట్ల), చింతా హరినాథ్ (యలమంచిలి) ఉన్నారు. వీరంతా ఎలక్ట్రిషియన్ కోర్సులో ఉచితంగా శిక్షణ పొంది ఉద్యోగాలు సాధిం చా రు. ఈ సందర్భంగా మంత్రి సవిత బుధవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాల యంలో నియామక పత్రాలు అందచేసి వారిని అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు నిలబెట్టేలా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ బ్రాహ్మణ సాధికారిత విభాగం స్టేట్ కో ఆర్డినేటర్ కె.బుచ్చిరాంప్రసాద్, బీసీ వేల్పేర్ విభాగం కో ఆర్డినేటర్ వి.గురుమూర్తి, టీడీపీ ఎంపవర్మెంట్ సెంటర్ ట్రైనింగ్ కో ఆర్డినేటర్ యామిని, ట్రైనర్లు వి.భాను, అధికారి ఉమామహేశ్వరి, ప్రతినిధులు డి.వి.రావు, డోమ్నిక్ పాల్గొన్నారు.