• కావలి అసెంబ్లీ నియోజకవర్గం తుమ్మలపెంట పట్టపుపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామం సముద్ర తీరానికి సమీపంలో ఉంది. గ్రామంలో నివసించేవాళ్లు మొత్తం మత్స్యకారులే.
• మాకు ఇళ్ల పట్టాలు లేవు.
• అటవీ భూమిని మార్పిడి చేసి బీసీలకు గృహ నిర్మాణ పథకం చేయాలి.
• మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యల్ని పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• జగన్మోహన్ రెడ్డికి మత్స్యకారుల ఓట్లపై తప్ప వారి సంక్షేమంపై శ్రద్ధ లేదు.
• సముద్రతీర ప్రాంతాల్లో మత్స్యకారుల సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
• టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే తుమ్మలపెంట పట్టపుపాలెం గ్రామస్తులకు ఇళ్లస్థలాలతో ఇళ్లు నిర్మించి ఇస్తాం.
• మత్స్యకారుల సంక్షేమానికి గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తాం.