- జగన్‌రెడ్డి క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పడానికి కుప్పంలో అరాచకం ఒక కేస్ స్టడీ
- భేషజాలకు పోవద్దు.. అందరినీ కలుపుకెళ్లండి
- మంగళగిరిలో వార్ వన్ సైడ్ కావాలి లోకేష్
- నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లతో అధినేత చంద్రబాబు సమీక్ష
- కుప్పం, మంగళగిరి సహా 111 నియోజకవర్గాల్లో ముగిసిన సమీక్షలు
అమరావతి, అక్టోబరు 27(చైతన్యరథం): ముఖ్య మంత్రి జగన్‌రెడ్డి పులివెందులలో చేసే ఫ్యాక్షన్ రాజ కీయాలు కుప్పంలో చెల్లు బాటుకావని, అరాచకాన్ని కుప్పం ప్రజలు సహించబోరని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి క్యారెక్టర్ ఏంటో తెలియాలంటే ఈప్రభుత్వం కుప్పంలో ఆయన, అయ న పరివారం చేస్తున్న అరాచకాన్ని ఒక కేస్ స్టడీగా తీసుకోవచ్చని అన్నారు.అభివృద్ది రాజకీయాలు మాత్ర మే తెలిసిన కుప్పం ప్రజలకు వైసిపి అరాచక రాజకీ యం కొత్తగా ఉందని, శాంతికా ముకులైన కుప్పం ప్రజలు అరాచక రాజకీయాన్ని సహించబోరని స్పష్టం చేశారు. పార్టీ నియోజకవర్గాల ఇంచార్జ్‌లతో రివ్యూల లో భాగంగా గురువారం కుప్పం నేతలతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని 11 మంది క్లస్టర్ ఇంచార్జ్‌లు, మండల పార్టీ అధ్యక్షులతో పాటు మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, నియోజకవర్గ ఇంచార్జ్ పిఎస్ మునిరత్నం, మనోహర్, త్రిలోక్‌తో పాటు పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు. కుప్పం ను తొలి నుంచి ఒక మోడల్ నియోజకవర్గంగా చేశామని.. హింసను, విద్వేష రాజకీయాలను ఇక్కడి ప్రజ లు అనుమతించరని చంద్రబాబు అన్నారు. సభ్యత్వ నమోదు, బాదుడే బాదుడు నిర్వహణ, ఓటర్ వెరిఫికే షన్ సహా పార్టీ కార్యక్రమాలపై అధినేత రివ్యూ చేశా రు. నేతలు ఎవరూ భేషజాలకు పోవద్దని.. గ్రామ స్థాయి వరకు అందరినీ కలుపుకుని వెళ్లాలని సూచిం చారు. కుప్పంలో ప్రజలు అభిమానంతో తనను గెలిపి స్తూ వస్తున్నారని.. పులివెందుల మాదిరిగా తాను భయపెట్టి ఓట్లు వేయించుకోవడం లేదని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఒకే సింబల్‌పై అన్ని సార్లూ గెలి చిన నియోజకవర్గాలు కుప్పం, హిందూపురం అని చంద్రబాబు నాయుడు గుర్తుచేశారు. ఇదే సందర్భం లో పులివెందులలో..నేతలు,పార్టీలు, గుర్తులు ఆయా ఎన్నికల్లో మారాయని పేర్కొన్నారు. కుప్పంలో నేత లను, కార్యకర్తలను.. కేసులు, దాడులు, కుల విద్వే షాలతో నైతికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని.. దీన్ని స్థానిక నాయకత్వం సమర్థంగా తిప్పి కొట్టాలని నేతలకు సూచించారు. తమకు ఊడిగం చేసే అధికా రులను ఉపయోగించుకుని అరాచకాలు చేస్తున్న వైసీ పీ నేతల లెక్కలు సరిచేస్తామని చంద్రబాబు చెప్పారు.
అరాచకాన్ని దీటుగా ఎదుర్కొంటున్నాం
ఈ సందర్భంగా సమీక్షకు వచ్చిన నేతలు స్థానికం గా జరుగుతున్న పరిణామాలను అధినేత దృష్టికి తెచ్చారు. పార్టీ నేతలపై పెట్టిన అక్రమ కేసులు, అరె స్టులు తమను భయపెట్టలేదని.. పైగా అంతా ఇప్పు డు మరింత ఐక్యంగా పోరాడుతున్నామని చెప్పారు. ఈ తరహా ప్రభుత్వ పోకడలతో ప్రజల్లో అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని వివరించారు. పొరుగు రాష్ట్రాల నుంచి, మూడు పార్లమెంట్ నియో జకవర్గాల నుంచి జనాన్ని తెచ్చినా కుప్పంలో సిఎం సభ సక్సెస్ కాకపోవడానికి స్థానికంగా వచ్చిన వ్యతి రేకతే కారణం అని నేతలు వివరించారు. కుప్పం అభి వృద్ధికి రూపాయి ఖర్చు పెట్టని సీఎం.. తన సభకు మాత్రం కోట్ల రూపాయలను వెచ్చించారని నేతలు తెలిపారు. నియోజకవర్గంలోని గుడిపల్లి మండలంలో మళ్లీ అక్రమ గ్రానైట్ తవ్వకాలు జరుగుతున్నాయని, శాంతి పురం మండలంలో పాఠశాలల్లో నాడు నేడు పనుల పేరుతో లక్షలు కాజేశారని నేతలు చెప్పారు. నియోజకవర్గంలోని నరేగా పనుల్లో లక్షల రూపాయల అవినీతి జరిగిందని, గుడిపల్లి మండలంలో 230 మంది వైసీపీ కార్యకర్తలకు నిబంధనలకు విరుద్దంగా డికెటి పట్టాలు ఇప్పించే పని మొదలయ్యిందని వివరించారు. ఇక కుప్పం రెస్కో సంస్థలో అక్రమంగా నియామకాలు జరుగుతున్నాయని నేతలు చంద్రబాబు కు వివరించారు. వైసీపీ నేతలు పొరుగు రాష్ట్రాల నుండి అక్రమ మద్యం తెప్పించి విక్రయాలు సాగిస్తు న్నారని తెలిపారు. హంద్రీనీవా పనులపై ప్రకటనలు తప్ప పని జరగడం లేదని వివరించారు. ఈ అంశా లపై స్థానికంగా ప్రభుత్వంపై పోరాడాలని నేతలకు చంద్రబాబు సూచించారు.
పసుపుజెండా రెపరెపలాడాలి
రాబోయే ఎన్నికల్లో మంగళగిరిలో తిరుగులేని విజయంతో పసుపు జెండా ఎగరాలని యువనేత లోకేష్ కు చంద్రబాబునాయుడు దిశనిర్దేశం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలపై ఇంచార్జ్ నారా లోకేష్ తో పార్టీ అధినేత సమీక్ష జరిపారు. పార్టీ కార్యక్రమాలు, కమిటీల నియామకం, స్థానిక నేతల పనితీరు వంటి అంశాలపై తన వద్ద ఉన్న నివేదికల ఆధారంగా రివ్యూ చేశారు. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం తరువాత 1983,1985 ఎన్నికల్లో మంగళగిరిలో టిడిపి గెలిచిందని..1989 నుంచి 2009 వరకు జరిగిన 5 ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా మిత్రపక్షాలకు టిక్కెట్లు ఇవ్వాల్సి వచ్చిందని చంద్రబాబు అన్నారు. పొత్తుల్లో రెండు దశాబ్దాల పాటు మంగళగిరి సీటు వేరు పార్టీలకు ఇచ్చుకుంటూ వచ్చిన కారణంగా నియోజకవర్గంలో అప్పట్లో పార్టీ బలోపేతం కాలేదని చెప్పారు. 2019 ఎన్నికల తరు వాత పార్టీ యాక్టివిటీ పెంచడం, కార్యకర్తల సంక్షేమం చూడడం, ఇతర కార్యక్రమాల కారణంగా మంచి మార్పు కనిపిస్తుందని చంద్రబాబు అన్నారు. అయితే దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని, తిరుగు లేని విజయంతో మంగళగిరిలో కొత్త చరిత్ర రాయా లని ఇంచార్జ్ లోకేష్‌కు పార్టీ అధినేత సూచించారు. ఈ రోజు 4 నియోజవర్గాల ఇంచార్జ్‌లతో ముఖాముఖీ భేటీలు జరిగాయి. కర్నూలు ఇంచార్జ్ టిజి భరత్, ఇచ్చాపురం ఇంచార్జ్ బెందాళం అశోక్ రివ్యూలకు హాజరయ్యారు. ఇప్పటికి మొత్తం 111 నియోజకవర్గా ల ఇంచార్జ్‌లతో ముఖాముఖి సమీక్షలు ముగిశాయి.