– ఆదాని డిస్టలరీస్‌తో సంబంధం లేదని చెప్పే ధైర్యముందా?
– అవినీతి ఘనాపాటి విజయసాయి.. చంద్రబాబు గురించి మాట్లాడటం తప్పు
అమరావతి: రాష్ట్రంలో పులిలా వ్యవహరిస్తూ.. ఢల్లీిలో పిల్లిలా మారే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అవినీతి చరిత్ర అందరికీ తెలిసిందేనని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. మంగళ గిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ ఏ2 విజయసాయిరెడ్డి గురివింద గింజ లాంటివాడని విమర్శించారు. విజయ సాయి చరిత్ర అంతా అవినీతిమయం. ఏ1 అంటే జగన్మోహన్ రెడ్డి, ఏ2 అంటే విజయసాయిరెడ్డి అని రాష్ట్రంలోని అందరికీ అర్థమైపోతుంది. 11 కేసుల్లో విజయసాయిపై సీబీఐ చార్జిషీట్ వేసిన విషయం అంద రికీ తెలిసిందే. విజయసాయి అవినీతి సామ్రాట్ అని చట్టాలు కూడా చెబుతున్నాయి. అదృష్టం కలిసొచ్చి కోట్లకు పడగెత్తాడు. ఆ కోట్లతో జల్సాలు చేసుకో.. అంతే కానీ ఏ తప్పు చేయని, అవినీతి వైపు కన్నెత్తి చూడని చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలడం సబబు కాదు. అదృష్టం కలిసి రావడంతో ఎంపీ అయి నంతమాత్రాన తప్పుగా వ్యవహరిస్తావా? విజయసాయి రెడ్డి పెద్ద మ్యానిపులేటెర్. తిమ్మిని బమ్మిని చేయడం.. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చేయడం విజయ సాయికి వెన్నతో పెట్టిన విద్య. ఇన్ని వేల కోట్ల రూపా యలు ఎలాసంపాదించావు?.అవినీతి చక్రవర్తి. ఆదాని డిస్టలరీస్‌తో సంబంధం లేదని చెప్పే ధైర్యముందా? ఢల్లీి లిక్కర్ కేసులో అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డికి బెయిల్ ఎలా వచ్చింది? అతడిని అప్రూ వర్‌గా మార్చిందెవరో తెలియాలి. ఇంకోసారి ఢల్లీి లిక్కర్ స్కామ్‌లో జోక్యం చేసుకుంటే సినిమా చూపిస్తా మని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విజయసాయికి వార్నింగ్ ఇచ్చింది. ఆ రోజు నుంచి విజయసాయికి ఫోన్లపై నిఘా ఉంచడంతో ఫోన్లు మార్చుకొని తిరుగు తున్న మాట వాస్తవం కాదా? శరత్ చంద్రారెడ్డిని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపేటప్పుడే విజయసాయి ఫోన్ పోవడంలో మతలబేంటో ఒకసారి ఆలోచించాలి. నీవు అవినీతిపరుడు కాకపోతే శరత్ చంద్రారెడ్డి అరెస్టు వెంటనే మీ సెల్ ఫోన్ ఎలా పోతుంది?, ఎందుకు హడావిడిగా ఫోన్ పోయిందని పోలీసులతో కేసు నమోదు చేయించావు? లిక్కర్ స్కామ్ కి విజయసాయిరెడ్డికి ఉన్న సంబంధం ఆ ఫోన్ ద్వారా బయటపడుతుందనే ఫోన్ పోయిందని ఫిర్యాదు ఇచ్చి నాటకాలు ఆడారని వర్ల ఆరోపించారు.
పురందేశ్వరిని విమర్శిస్తూ మధ్యలో చంద్రబాబును లాగడమెందుకు?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై ట్వీట్ చేస్తూ మధ్యలో చంద్రబాబును తీసుకురావడమేంటి? చంద్రబాబునాయుడు గురించి మాట్లాడే నైతిక హక్కు విజయసాయికి లేదు. బీజేపీ గురించి, పురందేశ్వరి గురించి మాట్లాడదలచుకుంటే ధైర్యంగా ఢల్లీిలోనే మాట్లాడాలిగానీ చంద్రబాబును మధ్యలోకి తీసుకు రావడం మంచిది కాదు. ఢల్లీిలో బీజేపీ వారివద్ద బక్కచిక్కిన పిల్లిలా వ్యవహరిస్తాడు. వంగి వంగి దండాలు పెడతారు, నీ బాంచన్ దొర కాల్మొక్తా అంటారు. రాష్ట్రానికొచ్చి బీజేపీ పై పులిలా మాట్లాడు తావు. ధైర్యముంటే బీజేపీతో, మోడీ, అమిత్ షాతో ఛాలెంజ్ చేయాలి. 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు విజయసాయిరెడ్డి ఎక్కడ ఉండేవారో ఒకసారి ఆలోచించుకోవాలి. చైన్నైలోని మౌంట్ రోడ్ లో చిన్న ఆఫీసు పెట్టుకుని ఉండేవాడని అందరికీ తెలుసు. నేను మీలా సభ్యతా, సంస్కారం లేనివాడిని కాదు. విజయసాయి సంపద లక్ష కోట్లు దాటి ఉంటుంది. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాలి. ఎన్ని ఆడిటింగ్‌లు చేస్తే, ఎన్ని ఇన్‌కమ్ ట్యాక్స్ వారికి రిపోర్టులు తయారు చేస్తే ఇన్ని కోట్లు వస్తాయని వర్ల ప్రశ్నించారు.
ఇటీవల ఆస్తుల పెంపుదలపై జగన్ వార్నింగ్ ఇచ్చిన మాట వాస్తవం కాదా?
ఇటీవల మీ ఆస్తుల పెరుగుదలపై జగన్ వార్నింగ్ ఇచ్చిన మాట వాస్తవం కాదా?. విజయసాయి అవినీతి పరుడు కాకపోతే రాజ్యసభ ప్యానల్ వైస్ ఛైర్మన్‌గా పేరు ఎందుకు తొలగించారు? అసాంఘిక కార్యకలా పాలను ప్రోత్సహించే విజయసాయిరెడ్డిలాంటివారిని ఇంటికి పంపడానికి జనం ఎదురుచూస్తున్నారు. ముం దుంది ముసళ్లపండుగ. అల్లుడి సోదరుడిని అప్రూవర్ గా మార్చిన విజయసాయి.. తానే అప్రూవర్‌గా మారడని గ్యారంటీ ఏంటి? నీవు కూడా అప్రూవర్‌గా మారుతావన్న భయంతోనే జగన్‌కు ఇష్టమున్నా, లేకపోయినా తప్పక విజయసాయిని భరిస్తున్నాడని వర్ల చురకలు వేశారు.