- పశ్చాత్తాపం లేకపోగా నాటకాలు ఆడుతున్నారు
- తప్పు చేయలేదని నిరూపించుకునే దమ్ముందా?
- జగన్‌రెడ్డిపై కడప ఎమ్మెల్యే ఆర్.మాధవి ధ్వజం
మంగళగిరి(చైతన్యరథం): పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వైసీపీ ప్రభుత్వం అపవిత్రం చేసిందని కడప ఎమ్మెల్యే ఆర్.మాధవి ధ్వజమెత్తారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తిరుపతి ప్రసాదం లడ్డూను కూడా అపవిత్రం చేశారు..నేడు ప్రజలు ఛీకొడుతుంటే కొత్త కొత్త నాటకాలు మొదలుపెట్టారని మండిపడ్డారు. లడ్డూలు తయారు చేసే నెయ్యిలో కల్తీ జరిగిన మాట అక్షరాల వాస్తవం..దీనివల్ల ఎంతోమంది మనోభావాలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు. కమీషన్లకు కక్కుర్తిపడి దురాగతాలకు పాల్పడ్డారు. జూలై నెలలో దర్శనానికి వెళ్లినప్పుడే మేం తిరుమల తిరుపతి దేవస్థానం వారికి లడ్డూ నాణ్యత లేదని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశాం. వైసీపీ నేతలు తప్పు చేసి పశ్చాత్తాప పడకపోగా బుకా యిస్తు న్నారు. దొంగతనం చేసి దొంగే…దొంగ దొంగ అని అరచినట్లుంది వారి తీరు అని మండిపడ్డారు.
వారి నాటకాలను ప్రజలందరూ గమనిస్తున్నారు..టీడీపీ పాలనలో ఏదో జరిగిందని అందుకే (సంప్రోక్షణ) శుద్ధి చేస్తున్నామని వైసీపీ నాయకులు చెబుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో రివర్స్ టెండరింగ్ అని చెప్పి కమీషన్లకు కక్కుర్తి పడ్డారు. ఈ రివర్స్ టెండరింగ్‌ను టీటీడీకి కూడా అంటిం చారు. కమీషన్లకు కక్కుర్తిపడి కల్తీకి పాల్పడడం బాధాకరమన్నారు. లిక్కర్ స్కాంలో నింది తులైన వ్యక్తులు, హత్య కేసులో నిందితులైన వ్యక్తులను తిరుపతి తిరుమల పాలక మండలి లో ఉంచితే ఇలాంటి పనులు చేయకుండా ఉంటారా? జగన్ తన సీబీఐ కేసుల్లో విచార ణకు కోర్టులు పిలిస్తే వెళ్లడు. లడ్డూల విషయంలో మాత్రం సీబీఐ విచారణ కావాలని అడు గుతాడు. ఆ తర్వాత మాట మార్చి ఎటువంటి విచారణకైనా సిద్ధమంటూనే రెండవ వైపు ఏ విధమైన విచారణ జరగకూడదని జగన్ రెడ్డి అండ్ కో కోర్టుకు వెళుతున్నారు.
సిట్ విచార ణకు ఆదేశిస్తే దానిపై కూడా విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులనా మనం ఎన్నుకున్న దని ప్రజలు కూడా వారిని ఛీకొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టుకు వెళ్లి ఈ లడ్డూ వ్యవహారంపై ఎవరూ మాట్లాడకూడదని జగన్‌రెడ్డి ఒక ఆర్డర్ తెచ్చుకునే ప్రయ త్నం చేస్తున్నాడు. ఎన్నికలప్పుడు వివేకానందరెడ్డి హత్య గురించి ఎవరూ మాట్లాడకూడదని కోర్టుకు వెళి ఆర్డర్ తెచ్చుకున్నట్టే ఈరోజు కూడా అదే పని చేసే ప్రయ త్నం చేస్తున్నారు. తప్పు చేయలేదని మాట్లాడుతున్న ఆయన తప్పు చేయలేదని నిరూపించు కోవాలని హిత వుపలికారు. లడ్డూలో వాడే నెయ్యిని కల్తీ చేసినట్లు ల్యాబ్ రిపోర్టు కూడా ఇచ్చింది.. హిందువుల ఆచారాలను, సాంప్రదాయాలను సంస్కృతిని దెబ్బకొట్టిన వ్యక్తిగా జగన్ చరిత్ర లో నిలిచిపోతారు..ఈ అపవాదును ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా చెరు పుకోలేరు.. ఇది ముమ్మాటికీ వాస్తవమని వ్యాఖ్యానించారు.
ఇకనైనా వైసీపీ డ్రామాలు ఆపి లడ్డూ కల్తీ విచారణకు సహకరించి విచారణలో వచ్చిన ఫలితాలను అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. 11 సీట్లతో గెలిచి చేయడానికి ఏ పని లేక తనపై ఆరోపణలను ఎదుర్కోలేక నాటకాలకు తెరలేపారు. అధికారంలో ఉన్నప్పుడు ఏరోజూ బయటకు వచ్చి ప్రజలను కలిసిన పాపాన పోలేదు. ప్రతిపక్షంలో కూర్చోబెడితే నడవడం, తిరగడం, బయటకు రావడం చేస్తాడు. రాజకీయాలకు పనికిరాని వ్యక్తిగా తనను తాను నిరూపించు కుంటున్నాడు. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు ప్రపంచంలోనే జగన్‌ను నమ్మే వ్యక్తి లేరు. జగన్ సతీమణి భారతికి ప్రసాదం ఇస్తే ఒక టిష్యూ పేపర్‌లో వేసి పక్కన పడేసిన సంద ర్భాన్ని సోషల్ మీడియాలో చూశాం. వారిద్దరికీ హిందూ మతం మీద గౌరవం లేకపోయినా పర్వాలేదు..అగౌరవపరచకుంటే చాలన్నారు. హిందువులు గౌరంగా భావించే ప్రసాదాలను తినకూడదనుకుంటే మీరు అలాంటి కార్యక్రమాలకు వెళ్లకుండా ఉండాలి. కానీ వాటిని ప్రచార కార్యక్రమాలుగా వాడుకుని హిందువులను అవమానపరచ డమనేది చాలా అన్యాయమని వ్యాఖ్యానించారు.