న్యూఢిల్లీ: ఏపీలోని తిరుపతి ఎయిర్‌పోర్టు పేరును శ్రీ వేంకటేశ్వర ఎయిర్‌పోర్టుగా మార్చాలని ఏపీ సర్కార్ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు లోకసభ లో ఒక ప్రశ్నకు పౌరవిమానయాన సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ లిఖితపూర్వ కంగా సమాధాన మిచ్చారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని మరో రెండు ఎయిర్‌పోర్టుల పేర్లను మారుస్తూ ప్రతిపాదించిందని వెల్లడిరచారు. 10 రాష్ట్రాలలో 22 ఎయిర్‌పోర్టుల పేర్ల మార్పు కోసం ప్రతిపాదనలు అందినట్టు వెల్లడిరచారు. దర్బంగా ఎయిర్‌పోర్టు విద్యాపతి ఎయిర్‌పోర్టుగా మార్చాలని బీహార్ ప్రభుత్వం కోరింది. ఉత్తరప్రదేశ్, హర్యానా, కర్నాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్, మహారాష్ట్రలూ ఈ జాబితాలో ఉన్నాయి.