చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

సాగుకు సాయంగా నిలవాలి

బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు స్పష్టీకరణ

by చైతన్యరధం
Jul 10, 2024 at 6:14am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు, రాయలసీమ
సాగుకు సాయంగా నిలవాలి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో రూ.5.4 లక్షల కోట్లతో రాష్ట్ర రుణ ప్రణాళిక విడుదల
  • ప్రాధాన్య రంగాలకు రూ.3,75,000 కోట్లు
  • ఇతర రంగాలకు రూ.1,65,000 కోట్లు
  • కౌలు రైతులకు రుణాలు సులభతరం చేయాలన్న ముఖ్యమంత్రి
  • పథకాల అమలుకు బ్యాంకులు సహకరించాలి
  • సంపద సృష్టించే రంగాలకు ప్రోత్సాహం ఇవ్వాలి
  • 100 శాతం డిజిటల్‌ లావాదేవీలు సాధించాలి
  • నోట్ల వాడకం పూర్తిగా తగ్గిస్తే అవినీతి పోతుంది.
  • 5 ప్రధాన అంశాలపై మంత్రులు, బ్యాంకర్లు, నిపుణులతో సబ్‌ కమిటీ

అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో వ్యవసాయానికి ఊతమిచ్చేలా బ్యాంకులు పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కౌలు రైతులకు రుణాలు సులభంగా అందే పరిస్థితి రావాన్నారు. దీని కోసం బ్యాంకులు, ప్రభుత్వం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్బీసీ) సమావేశంలో చంద్రబాబు అన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో ఎస్‌ఎల్బీసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.5,40,000 కోట్లతో రుణ ప్రణాళికను విడుదల చేశారు. రూ.3,75,000 కోట్లు ప్రాధాన్య రంగాలకు, రూ.1,65,000 కోట్లు ఇతర రంగాలకు కేటాయిస్తూ రుణ ప్రణాళిక విడుదల చేశారు. వ్యవసాయ రంగానికి రూ.2,64,000 కోట్లు రుణాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యవసాయ రంగానికి గతం కంటే 14 శాతం అధికంగా రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు.

డెయిరీ, ఫౌల్ట్రీ, ఫిషరీస్‌, వ్యవసాయ యాంత్రీకరణకు, వ్యవసాయం రంగంలో మౌలిక సదుపాయాలకు రూ.32,600 కోట్లతో రుణ ప్రణాళిక రూపొందించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రాధాన్యతా రంగానికి రూ.3,23,000 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా…ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.3,75,000 కోట్లు రుణ ప్రణాళికా లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. గతంతో పోల్చితే 16 శాతం అధికంగా రుణాల లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యవసాయ రంగానికి గత సంవత్సరం రూ.2,31,000 కోట్లు రుణ లక్ష్యంగా పెట్టుకోగా అందులో 90 శాతం మేర రూ.2,08,136 కోట్ల రుణాలు మంజూరు జరిగిందని సమావేశంలో తెలిపారు. ఉద్యోగ, ఉపాధి కల్పనకు దోహదపడే మధ్య, సూక్ష్మ తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగానికి 2023-24 ఏడాదిలో రూ.69,000 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా, ఈ ఏడాది ఏకంగా రూ.87,000 కోట్లు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అలాగే గృహ నిర్మాణానికి రూ.11,500 కోట్లు రుణాలు, సాంప్రదాయేతర ఇంధన సెక్టార్‌ కు రూ. 8,000 కోట్లు రుణాలు ఇవ్వనున్నారు.

సంబంధితవార్తలు

చట్ట సభలను అగౌరవపరుస్తున్న జగన్‌రెడ్డి

గణేష్‌ చతుర్థి శుభాకాంక్షలు

జగన్‌రెడ్డి రక్తంలోనే మోసం, నయవంచన!

5 ప్రధాన అంశాలపై మంత్రులు, బ్యాంకర్లతో సబ్‌ కమిటీ
గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల అన్ని వ్యవస్థలు కుదేలయ్యాయని…మళ్లీ గాడిన పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వంపై ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారని..వాటిని నెరవేర్చేందుకు తీసుకుంటున్న చర్యలకు బ్యాంకులు చేయూతనివ్వాలని చంద్రబాబు అన్నారు. వ్యవసాయ రంగంలో సాగు ఖర్చులను తగ్గించాల్సిన అవసరం ఉందని…దీనిపై ప్రభుత్వం, బ్యాంకులు కలిసి పని చేయాలని సీఎం అన్నారు. ఐదు ప్రధాన అంశాలపై మంత్రులు, బ్యాంకర్లు, ఆయా రంగాల నిపుణులతో సబ్‌ కమిటీ ఏర్పాటు

చేస్తామన్నారు. ఆ రంగాలు ఇవే..
1. వ్యవసాయంలో సాగు ఖర్చులు తగ్గించడం, కౌలు రైతులకు సులభంగా రుణాలు అందించడం, మెరుగైన పంటల బీమాను అందుబాటులోకి తేవడం
2. పీ 4 విధానం ద్వారా పేదరిక నిర్మూలనకు అవసరమైన ప్రాజెక్టులు, ప్రణాళిక చేపట్టడం
3. డిజిటల్‌ లావాదేవీల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడం
4. స్కిల్‌ డెవల్మెంట్‌కు చర్యలు తీసుకోవడం
5. సంపద సృష్టించే, జీఎస్‌డీపీ పెంచే రంగాలకు తగు ప్రోత్సాహం ఇవ్వడం
ఈ ఐదు అంశాలపై ప్రణాళికలు సిద్దం చేసి, అమలు చేసేందుకు ఈ సబ్‌ కమిటీ పనిచేస్తుందని సీఎం పేర్కొన్నారు. ముఖ్యంగా కౌలు రైతులకు రుణాల విషయంలో ఉన్న ఆంక్షలను తొలగించి వారు సులభంగా రుణాలు పొందే పరిస్థితి కల్పించాలని చంద్రబాబు అన్నారు. పలు కీలక అంశాల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వం, బ్యాంకులు కలిసి పని చేయాలన్నారు. సంపద సృష్టించే రంగాలకు ప్రోత్సాహం ఇచ్చే అంశంపై బ్యాంకులు ఫోకస్‌ పెట్టాలని అన్నారు. డిజిటల్‌ లావాదేవీల్లో ఏపీ ప్రభుత్వం మొదటి మూడు రాష్ట్రాల్లో ఒకటిగా ఉందని….రానున్న రోజుల్లో నెంబర్‌ 1గా నిలిచే ప్రణాళికలు అమలు చేయాలని సీఎం అన్నారు.

డిజిటల్‌ చెల్లింపులను బ్యాంకులు కూడా ప్రోత్సహించాలని చెప్పారు. దీని వల్ల అవినీతి తగ్గుతుందని… ప్రొడక్టవిటీ పెరుగుతుందని చంద్రబాబు తెలిపారు. పేదరికం నిర్మూలన విషయంలో ప్రభుత్వం కొత్తగా పీ 4 విధానం తీసుకువస్తుందని సీఎం చెప్పారు. ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యల విషయంపైన సబ్‌ కమిటీ ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. యువత లో నైపుణ్యాలు పెంచడంపై తమ ప్రభుత్వం దృష్టిపెట్టిందని…స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కు తీసుకోవాల్సిన చర్యలపై సబ్‌ కమిటీ అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. ఇకపోతే సంపద సృష్టించే, జీఎస్‌డీపీ పెంచే రంగాలకు బ్యాంకుల ప్రోత్సాహం అవసరమన్న దానిపైనా ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయంలో సబ్‌ కమిటీ చర్చిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ అంశాల్లో సత్వర నిర్ణయాలు, మెరుగైన ఫలితాలు సాధించే విధంగా మంత్రులు, బ్యాంకర్లు, ఆయా రంగాల నిపుణులతో కమిటీ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు తెలిపారు.

హార్టి, ఆక్వా కల్చర్‌ను ప్రోత్సహించాలి: అచ్చెన్నాయుడు
సమావేశంలో వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… హార్టికల్చర్‌, ఆక్వా కల్చర్‌కు బ్యాంకులు రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో హార్టికల్చర్‌ పూర్తిగా నాశనం అయ్యిందని… తిరిగి నిలబెడితే రైతులకు మేలు జరుగుతుందన్నారు. పాడి పరిశ్రమ వృద్ది చెందేలా ఆవులు, గేదెలు కొనుగోలుకు బ్యాంకులు ఆంక్షలు లేకుండా రుణాలు ఇవ్వాలని సూచించారు. కౌలు రైతులకు రుణం అందడం చాలా కష్టంగా మారిపోయిందని తెలిపారు.

బ్యాంకులు బాసటగా నిలవాలి: పయ్యావుల
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ మాట్లాడుతూ 93 శాతం స్ట్రైక్‌ రేట్‌ తో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించారని…. కొత్త ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న అనేక ఆశలను తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అయితే వీటికి బ్యాంకు సహకారం అవసరమన్నారు. బ్యాంకులు రాష్ట్ర అభివృద్ది ప్రయాణంలో విశ్వసనీయ భాగస్వాములు కావాలన్నదే సీఎం చంద్రబాబు అభిప్రాయమని తెలిపారు. డ్రిప్‌ ఇరిగేషన్‌ ద్వారా కరువు ప్రాంతంలో సిరులు పండిరచిన చంద్రబాబు ఆలోచనలకు బ్యాంకులు బాసటగా నిలవాలని సూచించారు. అంతా డబుల్‌ డిజిట్‌ గ్రోత్‌ గురించి మాట్లాడుతుంటే… సీఎం చంద్రబాబు ఎకానమీని డబుల్‌ చేయాలనే ఆలోచనలతో పని చేస్తున్నారని అన్నారు.
కాగా 4వ సారి ముఖ్యమంత్రి అయిన సీఎం చంద్రబాబు నాయుడుకు ఎస్‌.ఎల్‌.బీ.సీ సమావేశం శుభాకాంక్షలు తెలిపింది. సమావేశంలో యూనియన్‌ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సంజయ్‌ రుద్ర, ఎస్‌.ఎల్‌.బీసీ కన్వీనర్‌ సీ.వి.ఎన్‌ భాస్కర్‌ రావు, ఇతర బ్యాంకు అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags: ఎస్‌ఎల్‌బీసీ సమావేశంవ్యవసాయవ్యవసాయరంగం
Previous Post

ప్రజాదర్బార్‌’తో లోకేష్‌ నూతన ఒరవడి!

Next Post

కిడ్నీ రాకెట్‌ కేసు ఛేదించండి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 13-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 13-03-2026

కార్యకర్త
@ March 13, 2026
చైతన్యరధం ఈ పేపర్ 12-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-03-2026

కార్యకర్త
@ March 12, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్
ఆంధ్రప్రదేశ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం
ఆంధ్రప్రదేశ్

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
రాష్ట్రమంతటా ‘జలధార’!
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రమంతటా ‘జలధార’!

చైతన్యరధం
@ March 12, 2026
స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం
ఆంధ్రప్రదేశ్

స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

చైతన్యరధం
@ March 12, 2026
మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు
ఆంధ్రప్రదేశ్

మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

చైతన్యరధం
@ March 12, 2026
వన్ మంత్.. వన్ విలేజ్.. ఫోర్ విజిట్స
ఆంధ్రప్రదేశ్

వన్ మంత్.. వన్ విలేజ్.. ఫోర్ విజిట్స

చైతన్యరధం
@ March 12, 2026
Load More

ముఖ్య వార్తలు

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

చైతన్యరధం
@ March 12, 2026
‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

చైతన్యరధం
@ March 12, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
రాష్ట్రమంతటా ‘జలధార’!

రాష్ట్రమంతటా ‘జలధార’!

చైతన్యరధం
@ March 12, 2026
స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

చైతన్యరధం
@ March 12, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist