- వంద రోజుల ఐక్య కార్యాచరణ ప్రణాళిక ప్రకటన
- చంద్రబాబు అక్రమ అరెస్టు, రాష్ట్ర శ్రేయస్సు, అన్ని వర్గాల అభివృద్ధిపై మూడు తీర్మానాలు
- ప్రజల ఉజ్వల భవిత, రాష్ట్ర అభివృద్ధి కోసమే పొత్తు
- వచ్చే ఎన్నికల తరువాత టీడీపీ-జనసేన ప్రభుత్వ ఏర్పాటు తథ్యం
- దాదాపు 3 గంటలు సాగిన ఐక్య కార్యాచరణ కమిటి సమావేశం
- ఆత్మీయ వాతావరణంలో జరిగిన సమావేశం
రాజమండ్రి : నాలుగున్నరేళ్ల ప్రజా వ్యతిరేక, విధ్వంసక, అరాచక పాలనతో నవ్యాంధ్రను ఛిన్నాభిన్నం చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వానికి నిన్న తెలుగుదేశం,జనసేన పార్టీలు ఫైనల్ కౌంట్ డౌన్‌ను స్టార్ట్ చేశాయి. రాజమహేంద్రవరంలో మూడు గంటల పాటు నిర్వహించిన ‘సంయుక్త కార్యా చరణ కమిటి’ (జాయింట్ యాక్షన్ కమిటి) సమావేశం అనంతరం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్య దర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన కల్యాణ్ పాత్రికేయులతో మాట్లాడుతూ.. ఇరుపార్టీల పొత్తు ఆవ శ్యకతను,రానున్న వంద రోజుల్లో సంయుక్తంగా చేపట్టే కార్యాచరణ ప్రణాళికను వివరించారు. దీంతో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరు పార్టీలు కలిసి చేపట్టే పోరాటానికి క్షేత్రస్థాయిలో నాంది పలికారు.
విజయదశమి నాడు జరిగిన ఈ చారిత్రాత్మక సమా వేశంలో లోకేష్, పవన్ కల్యాణ్‌తో పాటు రెండు పార్టీల నుంచి ఆరుగురు చొప్పున నాయకులు పాల్గొని పలు విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. జగన్‌రెడ్డి నిర్వా కాలతో రాష్ట్రానికి పట్టిన తెగులును నివారించడానికి, అంధకారాన్ని తొలగించడానికి ఇరు పార్టీలమధ్య పొత్తు అనివార్యమని ఇద్దరు నాయకులు స్పష్టం చేశారు.
సమావేశం అనంతరం ఇరువురు నాయకులు పత్రి కలవారితో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులను సోదాహరణంగా వివరించారు. తమ అభి ప్రాయాలను వెల్లడిరచిన తరువాత పవన్ కల్యాణ్ సూచన మేరకు, నారా లోకేష్ మొదటి దశలో రానున్న వంద రోజుల్లో రెండు పార్టీలు కలిసి చేపట్టే కార్యక్రమా లను వివరించారు.
కార్యక్రమాల వివరాలు :
- ఈనెల 29, 30, 31 తేదీల్లో తెదేపా, జనసేనల జిల్లాస్థాయి నేతల సమావేశాలు. ఈ సమావేశాల్లో రాష్ట్రంలోని పరిస్థితులపై విస్తృతంగా చర్చించి ఇరు పార్టీల మధ్య సమన్వయంతో చేపట్టే కార్యక్రమా లను రూపొందిస్తారు.
- నవంబర్ 31 నుంచి ఉమ్మడి మేనిఫెస్టోపై ఇంటింటికి తిరిగి ప్రచారం
- ఇరు పార్టీల నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించి నీటి ఎద్దడితోపాటు ఇతర కారణాల వలన రైతాం గం
నష్టపోతున్న పరిస్థితులను పరిశీలించి నివేది కలు అందజేస్తారు. ఈ నివేదికల ఆధారంగా తదు పరి కార్యక్రమాలను రూపొందిస్తారు.
జాయింట్ యాక్షన్ కమిటి ఆమోదించిన తీర్మానాలు :
- తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడు అక్రమ అరెస్టు పట్ల నిరసన, ఖండన.
- అరాచక పాలన నుండి రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు పొత్తు.
- అన్ని వర్గాలను అభివృద్ధి మార్గంలో నడిపించటం.
నిన్న జరిగిన సమావేశంలో నారా లోకేష్, పవన్ కల్యాణ్ లతోపాటు రెండు పార్టీల నుండి మరో 12 మంది నాయకులు పాల్గొన్నారు. తెదేపా నాయకులు ` కింజరాపు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పితాని సత్యనారాయణ, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, తంగిరాల సౌమ్య. జనసేన తరపున నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, బొమ్మిడి నాయ కర్, పాలవలస యశస్వీ, మహేందర్‌రెడ్డి, కొటికల పూడి గోవిందరావు సమావేశంలో పాల్గొన్నారు.
నిన్నటి సమావేశం స్నేహపూర్వక, ఆత్మీయ వాతావరణంలో జరిగిందని కొందరు నాయకులు తెలిపారు. పవన్ కల్యాణ్, లోకేష్‌లు తమ పార్టీలకు చెందిన ఇతర నాయకులను ఒకరికొకరు పరిచయం చేశారు. సమావేశానికి ముందు లోకేష్ జైల్లో ఉన్న చంద్రబాబుతో అరగంటపాటు సమావేశమై, తరువాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో విడివిడిగా చర్చించారు. నిన్నటి సమావేశం జరిగిన తీరు, రెండు పార్టీల నాయకుల మధ్య నెలకొన్న సామరస్య వాతావరణం ఇరు పార్టీల శ్రేణులకు సరైన సందేశాన్ని అందిస్తుందని నాయకులు అభిప్రాయపడ్డారు.
తెదేపా, జనసేనల మధ్య ఎన్నికల పొత్తు గురించి కొన్ని నెలలుగా ప్రజా క్షేత్రంలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన నాలుగు రోజుల తరువాత జనసేన అధినేత చంద్రబాబును జైలులో ములాఖత్ లో కలిసి గత నెల 14న నారా లోకేష్ సమక్షంలో ఇరు పార్టీ ల మధ్య పొత్తుల గురించి మొదటిసారిగా అధికార ప్రకటన చేశారు. అదేరోజున ఈ పొత్తు ఆవశ్యకత గురించి లోకేష్ వివరించారు.