అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా సోమవారం 75వ స్వాతంత్య్ర దినోత్సవ ఘనంగా నిర్వహించారు. పిడుగురాళ్ల పట్టణం తెలుగుదేశం కార్యాలయం వద్ద నిర్వహించిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణ, పిడుగురాళ్ల మండల, మాచవరం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జమ్మలమడుగు: తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ దేవగుడి భూపేష్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేవగుడి అభిమానులు పాల్గొన్నారు.
పోలవరం: బుట్టాయగూడెంలోని పోలవరం నియోజకవర్గం క్యాంపు కార్యాలయంలో జరిగిన వేడుకల్లో టీడీపీ నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు జాతీయ జెండాను ఎగురవేశారు.
నరసరావుపేట: నరసరావుపేటలోని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా కార్యాలయంలో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో టీడీపీ నరసరావుపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చదలవాడ అరవింద బాబు, డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు: ఒంగోలులోని తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లా కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో పార్టీ జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, పార్టీ అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ, పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధికార ప్రతినిధి మొఘల్ కాలేషా బేగ్ తదితరులు పాల్గొన్నారు.
పెడన: పెడనలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్ జాతీయ జెండా ఎగరవేశారు. ఎచ్చెర్లలోని టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో మాజీ మంత్రి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ కిమిడి కళా వెంకట్రావు జాతీయ జెండా ఆవిష్కరించారు.
బొబ్బిలి: బొబ్బిలిలోని కోటలో పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి ఆర్వీఎస్‌కేకే రంగారావు (బేబినాయన) జాతీయ జెండాను ఆవిష్కరించారు.
కావలి: కావలిలో పార్టీనియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో డాక్టర్ ఎన్.ప్రభాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు: ఆత్మకూరులోని శ్రీశైలం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
అనపర్తి: అనపర్తి గ్రామంలోని పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు వేడుకలు నిర్వహించారు. రామవరంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలుగు రైతు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు సిరసపల్లి నాగేశ్వరరావు, వాణిజ్య విభాగ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కమలాపురం: కమలాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
శ్రీకాకుళం : శ్రీకాకుళంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో శాసనసభ మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ,మాజీ శాసనసభ్యులు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ గుండ లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.
ఆముదాలవలస: పార్టీ పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు కూన రవికుమార్ ఆధ్వర్యంలో ఆమదాలవలస నుండి శ్రీకాకుళంలోని పార్టీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
బనగానపల్లె: బనగానపల్లె పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో 75 స్వాతంత్య్ర దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
శ్రీ సత్యసాయి జిల్లా: పెనుకొండ పట్టణంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక వద్ద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు పంచాంగం శేషప్ప స్వామి కుమారుడు సుధీర్ బాబును సన్మానించారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించి పట్టణంలోని గాంధీ, తెలుగుతల్లి, ఎన్టీఆర్, అంబేద్కర్, అబ్దుల్ కలాం, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పాణ్యం: మాధవి నగర్‌లో గౌరు దంపతుల స్వగృహంలో జాతీయ జెండా ఎగరవేశారు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి గౌరు చరితరెడ్డి, టీడీపీ నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొవ్వూరు: కొవ్వూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పార్టీ ద్విసభ్య కమిటీ ఆధ్వర్యంలో స్వతంత్య్ర దినోత్సవం జరిగింది.
కోరుకొండ: ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు కోరుకొండ కొండపైకి జాతీయ జెండాలతో ఎక్కి లక్ష్మీనరసింహస్వామి శిఖరాన్ని అధిరోహించి అక్కడ మొట్టమొదటిసారిగా జాతీయ జెండాను ఎగరవేశారు.
బద్వేలు: బద్వేలులోని తన నివాసంలో బద్వేలు మాజీ శాసన సభ్యురాలు విజయమ్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె టీడీపీ కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. పోరుమామిళ్ళ రోడ్డులోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
రాజమహేంద్రవరం: తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అజదీకా అమృత్ మహోత్సవ్ ను ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కె.ఎస్ జవహర్ తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తపల్లి ఆశిష్ లాల్ తదితరులు పాల్గొన్నారు. రొద్దంలోని పార్టీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. పార్టీ మండల కన్వీనర్ నరహరి, హిందూపురం పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు సుబ్బరతమ్మ తదితరులు పాల్గొన్నారు.
గూడూరు: గూడూరులో పార్టీ నియోజవకర్గ ఇన్ చార్జి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
గజపతినగరం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొండపల్లి అప్పలనాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి రాష్ట్ర కరణం శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
చీపురుపల్లి: పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ కిమిడి నాగార్జున ఆధ్వర్యంలో స్వాతంత్య్రదినోత్సవం నిర్వహించారు.
సింగరాయకొండ: శ్రీ చైతన్య విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్య్రదినోవ్సవంలో టీడీపీ ప్రకాశం జిల్లా న్యాయ విభాగం అధ్యక్షులు సన్నెబోయిన శ్రీనివాసులు (నాయుడు) జాతీయ జండాను ఎగరవేశారు. అనంతరం ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చైతన్య ప్రిన్సిపాల్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
పొన్నూరు: పొన్నూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు జాతీయ పతాకాలను చేతబట్టి వందేమాతరం నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. మార్గంలో మధ్యలో మహాత్మా గాంధీ విగ్రహానికి, ఐలాండ్ సెంటర్ లో అబ్దుల్ కలాం, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఎలమంచిలి: తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ ఇన్ చార్జి ప్రగడ నాగేశ్వరరావు జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎంపీ పప్పల చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.
తిరువూరు: తిరువూరులోని పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ ఇన్ చార్జ్ శావల దేవదత్ జాతీయ పతాకాన్ని ఎగరవేశఆరు. మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామి దాసు, జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ నల్లగట్ల సుధారాణి తదితరులు పాల్గొన్నారు.
మైలవరం: నియోజకవర్గం కొండపల్లిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. పార్టీ నేతలు రామినేని రాజశేఖర్, చుట్టుకుదురు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
రంపచోడవరం: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో నియోజకవర్గం ఇన్ చార్జి, మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి తన క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
పార్వతీపురం: జరిగిన పార్టీ నియోజకవర్గం కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శాసనమండలి మాజీ సభ్యులు జగదీష్, మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ చార్జి బొబ్బిలి చిరంజీవులు, అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షులు గొట్టాపు వెంకట నాయుడు తదితరులు పాల్గొన్నారు.
కురుపాం: పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌చార్జీ తోయక జగదీశ్వరి ఆధ్వర్యంలో జాతీయ జెండాని ఎగరవేశారు.
తంబళ్లపల్లె: నియోజవర్గం మొలకల చెరువులో తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి మాజీ శాసన సభ్యులు శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగరవేశారు. భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు.
మదనపల్లిలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు గంటా నరహరి జాతీయ్య జెండాను వెగురవేశారు. మదనపల్లి మాజీ శాసనసభ్యులు, పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జ్ దొమ్మలపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
నందికొట్కూరు: నందికొట్కూరులోని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి జాతీయ జెండాను ఎగరవేశారు.
విశాఖ: తెలుగుదేశం పార్టీ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎన్టీఆర్ భవన్ నుంచి ఇన్‌చార్జ్ గండి బాబ్జి ఆధ్వర్యంలో హర్ ఘర్ క తిరంగ్ కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ దువ్వరపు తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి: తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు, తుడా మాజీ చైర్మన్ జి.నరసింహయాదవ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు నరసింహయాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పాల్గొన్నారు.
సత్యవేడు: భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ తరుణంలో ఆజాదీక అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా సత్యవేడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జేడి రాజశేఖర్ ఆధ్వర్యంలో సత్యవేడు మండల హెడ్ క్వార్టర్‌లోని సాయిబాబా గుడి దగ్గర నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు దేశభక్తిని చాటుతూ పట్టణంలో వందేమాతరం నినాదాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు.
కాకినాడ: స్వాతంత్య్ర దినోత్సవ సందర్బంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గాంధీ మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయ పతాకా ఆవిష్కరించారు. అనంతరం స్థానిక గాంధీనగర్ పార్కు వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జగ్గంపేట: స్థానిక రావులమ్మనగర్‌లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసిన జ్యోతుల నెహ్రూ జగ్గంపేట నుండి గోకవరం వరకు అజాద్ కా అమృత్ మహోత్సవ్ భాగంగా భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు.
సత్తెనపల్లి: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా సత్తెనపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ, మాజీ ఎమ్మెల్యే వై.వి ఆంజనేయులు ఆధ్వర్యంలో 75 మీటర్ల జాతీయ పతాకంతో భారీ ర్యాలీ నిర్వహించారు.
అనకాపల్లి: అజాద్ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా అనకాపల్లిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బుద్ధ నాగజగదీశ్వరరావు ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
పెనమలూరు: ఎందరో మహనీయుల ప్రాణత్యాగాలు వలనే మనకు ఈ స్వాతంత్య్రమనే స్వేచ్చా వాయవులు లభించాయని మాజీ శాసనసభ్యులు బోడె ప్రసాద్ వ్యాఖ్యానించారు. అజాద్ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
కామవరపుకోట: 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు కామవరపుకోట కొత్తూరులో టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. చింతలపూడి మాజీ శాసనసభ్యులు గంటా మురళి రామకృష్ణ, కామవరపుకోట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిలారు సత్యనారాయణలు ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా 700 బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు.
గుంటూరు: ఆజాదికా అమృత్ మహాత్సవ్ కార్యక్రమంలో భాగంగా గుంటూరు విచ్చేస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షలు నారా చంద్రబాబు నాయుడుకి గుంటూరు పశ్చిమ టిడిపి ఇన్‌చార్జ్ కోవెలమూడి రవీంద్ర, జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ, పార్టీ ముఖ్య నాయకులు వినూత్నంగా స్వాగతం పలికారు. మిరపకాయలతో రూపొందించిన త్రివర్ణ రంగుల భారీ గజమాలతో చంద్రబాబుకు స్వాగతం పలికారు. మరోవైపు ఆజాద్ కా అమృత మహోత్సవంలో భాగంగా తెలుగు విద్యార్థి విభాగం గుంటూరు జిల్లా అధ్యక్షులు మన్నవ వంశికృష్ణ, రాయపాటి అమృత్, కుంచకర్ల ధర్మంతేజ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
అవనిగడ్డ : భారతదేశ 75 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అవనిగడ్డ గాంధీక్షేత్రంలో ఘనంగా మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహాత్మునికి నివాళులర్పించిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండా వందనం చేశారు.
నెల్లూరు నగరం: ఆజాది కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో సోమవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు.
నూజివీడు: నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కరికి స్వతంత్ర ఫలాలు అందినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు అని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్, మాజీ శాసనసభ్యులు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నూజివీడు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
తంబళ్లపల్లె: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా నియోజకవర్గంలోని మొలకల చెరువు మండలంలో టిడిపి నేతలు భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఇన్‌ఛార్జ్ మాజీ శాసన సభ్యులు శంకర్‌యాదవ్ పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం: 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జంగారెడ్డిగూడెంలో పట్టణ టిడిపి అధ్యక్షులు రావూరి కృష్ణ అధ్యక్షతన సంబరాలు అంబారాన్ని అంటాయి. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం, జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు.
విశాఖ పశ్చిమ నియోజకవర్గం: భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్విహించారు. పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురం నుంచి మల్కాపురం మీదగా సిందియా వరకు సాగిన ఈ ర్యాలీలో విశాఖ పార్లమెంట్ టి.ఎన్.టి.యు.సి. ప్రధాన కార్యదర్శి నక్క లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
పాతపట్నం: 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కలమట దంపతులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. నియోజకవర్గంలోని కొత్తూరు మండలం మాతల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో నిర్వహించారు.
భీమిలి: 75వ గణతంత్ర దినోత్సవాన్ని భీమిలి నియోజకవర్గంలో టిడిపి శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఇన్‌ఛార్జ్ కోరాడ రాజబాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధులను స్మరించుకున్నారు.
విశాఖ నార్త్: 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి, విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ విజయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
కైకలూరు: కైకలూరు నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో పార్టీ ఇన్‌ఛార్జ్ జయమంగళ వెంకటరమణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విజయవాడ సెంట్రల్: 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా 63వ డివిజన్ రాజీవ్ నగర్ సెంటర్ వద్ద నుంచి 400 బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ బొండా ఉమామహేశ్వరరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు: 75వ స్వాతంత్ర దినోత్సవం కార్యక్రమాన్ని టిడిపి నేతలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా పార్లమెంటు అధ్యక్షులు నెట్టెం రఘురాం జాతీయ జెండాను ఎగరవేశారు. గన్నే వెంకట నారాయణ ప్రసాద్ (అన్న) గాంధీజి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ : విజయవాడ పార్లమెంటు సభ్యుని కార్యాలయం కేశినేని భవన్‌లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఎంపీ కేశినేని నాని ముఖ్య అతిధిగా పాల్గొని మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా వికలాంగులకు ట్రై స్కూటర్లను పంపిణీ చేశారు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట: జగ్గయ్యపేట పట్టణంలో శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పట్టణంలో తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి పలుచోట్ల నిర్వహిస్తున్న అన్నక్యాంటీన్ల వద్ద జాతీయ జెండాలను ఆవిష్కరించారు.
కందుకూరు: 75వ స్వాతంత్రదిత్సోవ వేడుకలు కందుకూరులో టిడిపి నేతల ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మానసిక వికలాంగుల పాఠశాలలో జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం పేద పిల్లలకు దుస్తులు పంపిణీ చేశారు. 40వేల రూపాయల ఖర్చుతో ఇద్దరు విద్యార్థులకు హియరింగ్ మిషన్లు, 60 మంది విద్యార్థులకు ఉచితంగా దుస్తులు పంపిణీ చేశారు.
నెల్లూరు: నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు అంబరాన్ని అంటాయి. మాజీ మంత్రి, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్, సిటీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, తాళ్లపాక అనూరాధ తదితరులు పాల్గొన్నారు.
వెంకటగిరి: 76వ స్వాతంత్ర దినొత్సవ వేడుకలు వెంకటగిరి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం పట్టణంలో టీడీపీ శ్రేణులతో కలిసి ఆయన బైక్ ర్యాలీ నిర్వహించారు.
గుడివాడ: గుడివాడలో తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ రావి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆజాద్ కా అమృత్ మహోత్సవం సందర్భంగా పట్టణంలో టీడీపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాతీయ జెండాకు వందనం చేశారు.
మార్కాపురం: మార్కాపురం పట్టణంలో మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులో కంభం బస్టాండ్ సెంటర్‌లో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరణ చేసి వందన సమర్పణ చేశారు.
విశాఖ: 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. విశాఖ పార్లమెంటరీ నియోజవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, మాజీ ఐఏఎస్ అధికారి టిడిపి హెచ్‌ఆర్డి చైర్మన్ రామానుజనేయులు, శ్రీ భరత్, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్‌లు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
గిద్దలూరు: ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని టిడిపి కార్యాలయం వద్ద టీడీపీ ఇన్‌చార్జ్ మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. గిద్దలూరు పట్టణంలోని ప్రధాన కూడళ్ల లో నిర్వహించిన ఈ బైక్ ర్యాలీలో స్వాతంత్ర సమరయోధులను స్మరిస్తూ ర్యాలీ నిర్వహించారు.
యర్రగొండపాలెం: తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ గూడూరి ఎరిక్షన్‌బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాకు వందనం సమర్పించిన నేతలు అనంతరం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
గన్నవరం: 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బచ్చుల అర్జునుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం పట్టణంలోని మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రాజమండ్రి: కుల,మతాలను కూకటివేళ్ళతో పెకలించి సమానత్వాన్ని సాధించినప్పుడే త్యాగధనుల కష్టానికి సార్ధకత చేకూరుతుందని గుడా మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శ్రీరామనగర్‌లోని గన్ని నివాసం వద్ద నిర్వహించారు.
అరకు: అరకు నియోజకవర్గం హుకుంపేట మండలం కొట్నపల్లి పంచాయితి పరిధిలోని పెదగరువు గ్రామంలో ఏర్పాటు చేసిన 75వ భారతదేశ స్వాతంత్య్రం వేడుకలలో తెలుగుదేశం పార్టీ అరకు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మాజీమంత్రి కిడారి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.
పెద్దాపురం పట్టణం : పెద్దాపురం పట్టణం నందు మాజీ మున్సిపల్ చైర్మన్ తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబు రాజు అధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 75 అడుగుల జాతీయ పతాకంతో సోమవారం నాడు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధర్వ్యంలో ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’’ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుండి మార్కెట్, చర్చ సెంటర్ మీదుగా ఉప్పాడ సెంటర్ వరకూ సుమారుగా 3 వేల మంది కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు.
తుని: తుని నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌ఛార్జ్ యనమల కృష్ణుడు ఆధ్వర్యంలో ఆజాది కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తుని పట్టణ టీడీపీ ప్రెసిడెంట్ యినుగంటి సత్యనారాయణ, తొండంగి మండల టీడీపీ ప్రెసిడెంట్ కోడా వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
ఖాజీపేట: తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ఆధర్వ్యంలో దుంపలగట్టు గ్రామంలో ఆజాదీకా అమృత్ మహత్సోవాలు ఘనంగా నిర్వహించారు.