- ప్రజావినతుల కార్యక్రమంలో బాధితుడి ఫిర్యాదు
- భూ కబ్జాలు, సమస్యలపై క్యూ కట్టిన అర్జీదారులు
- వినతులు స్వీకరించిన నూకసాని, నజీర్ అహ్మద్, నేతలు
మంగళగిరి(చైతన్యరథం): తనకు హోంగార్డ్ జాబ్ ఇప్పిస్తానని రూ.7 లక్షలు తీసు కుని హోంగార్డు మండ్ల వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి పండిట్‌లు ఇద్దరూ మోసం చేశారు.. వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పుచ్చగడ్డ గ్రామానికి చెందిన బాధితుడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌లో నేతలకు ఫిర్యాదు చేశాడు. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, ఖాదీ గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె.కె.చౌదరి, ఏపీ హ్యాండ్ లూమ్ కోఆపరేటివ్ చైర్‌పర్సన్ సజ్జా హేమలతలు అర్జీ స్వీకరించి విచారణ జరిపించి న్యాయం జరిగేలా చూస్తామని బాధితుడికి హామీ ఇచ్చారు. ఉద్యోగాల పేరుతో జరుగుతు న్న మోసాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని.. ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు డిమాండ్ చేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు
` అవుకు ఎస్‌ఆర్‌బీసీ రిజర్వాయర్ నిమిత్తం భూ సేకరణలో భాగంగా తమ ఊరి గ్రామస్తుల భూములు భూ సేకరణ కింద తీసుకుని నష్టపరిహారం చెల్లించారు..అయితే తమ నాలుగు కుటుంబాల భూములను మాత్రం తీసుకోలేదు.. తమ భూములను కూడా భూ సేకరణ కింద తీసుకుని తమకు నష్టపరిహారం ఇప్పించాలని నంద్యాల జిల్లా అవుకు మండలం చెర్లోపల్లికి చెందిన పలువురు గ్రామస్తులు వేడుకున్నారు.
` తాము అమెరికాలో ఉండటంతో బాపట్ల జిల్లా రేపల్లెలోని తమ స్థలాన్ని కాటూరి వెంకట శివనాగబాబు కబ్జా చేశాడు.. స్థలాన్ని కబ్జా నుంచి విడిపించి కబ్జాదారుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీనాథ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
` వారసత్వంగా తమకు సంపూర్ణ హక్కు అనుభవం కలిగిన జీరాయితీ భూములకు ప్రస్తుతం ఆన్‌లైన్ అడంగల్, 1బీ రికార్డులో తమ సర్వే నెంబర్‌ను పూర్తిగా తొలగిం చారు.. తమ పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేయించుటకు అనేక పర్యాయాలు అధికా రులకు అర్జీ పెట్టుకున్నా చర్యలు తీసుకోలేదు..తమ పేర్లను ఆన్‌లైన్ చేసి తమకు న్యాయం చేయాలని విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం చిట్టివలస గ్రామానికి చెందిన చిల్ల కైలాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
` బాపట్ల జిల్లా జె.పంగులూరు మండలం కొప్పెరపాడు గ్రామానికి చెందిన ఎనికపాటి నారాయణస్వామి సమస్యను వివరిస్తూ గత ప్రభుత్వం చేపట్టిన రీ సర్వే వల్ల తమకు నష్టం జరిగింది..90 సెంట్ల భూమి ఉంటే విస్తీర్ణాన్ని తగ్గించారు.. దీనిపై అధికా రులు పరిశీలించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు.
` తిరుపతి మున్సిపాలిటీ పరిధిలో తాను చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాకపో వడంతో తన కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతుందని, దయచేసి తనకు రావాల్సిన బిల్లులు వెంటనే వచ్చే విధంగా చూడాలని తిరుపతికి చెందిన ఆర్. బాబు నాయుడు విజ్ఞప్తి చేశాడు.
` నిరుపేద యానాది కులానికి చెందిన తమ అనుభవంలో ఉన్న పొలాన్ని క్రిస్టియన్ స్కూలుకు ఇచ్చి తమకు గతంలో అన్యాయం చేశారని బాపట్ల జిల్లా అద్దంకి గ్రామానికి చెందిన బూదూరి వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి తమకు నివాస స్థలాలు కేటాయించి ఆదుకోవాలని కోరారు.
` తనకు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో సాగు చేసుకుంటుంటే బాలిజమాను తండా కు చెందిన పలువురు తనపై దాడికి వచ్చారని..వారి మీద చర్యలు తీసుకుని కబ్జా దారులు అక్రమంగా సృష్టించిన పాస్‌బుక్‌లు, 1బీ అడంగల్ రద్దు చేసి తనకు న్యాయం చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం మాలగుండ్లపల్లి గ్రామానికి చెంది మేకల బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు.
` తనకు తన తండ్రి రాసి ఇచ్చిన భూమిని వేరే వారు ఆన్‌లైన్ చేయించుకున్నా రు..దానిని రద్దు చేసి అసలు భూ హక్కుదారులైన తన పేరుపై భూమిని ఆన్‌లైన్ చేసి తనకు న్యాయం చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మం డలం పొలం మాడిక వాండ్లపల్లికి చెందిన సాకే లక్ష్మీదేవి విజ్ఞప్తి చేశారు.