చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

బీసీ డిక్లరేషన్‌తో వైసీపీలో వణుకు

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర స్పష్టీకరణ

by చైతన్యరధం
Mar 7, 2024 at 8:15am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
5న టీడీపీ బీసీ డిక్లరేషన్
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అందుకే కట్టగట్టుకుని మంత్రులు, నేతల విమర్శలు
  • నిజంగా బీసీల మేలుకోరితే జగన్‌ కూడా స్వాగతించాలి
  • వైసీపీ బీసీ నాయకులు, మంత్రులకు డిక్లరేషన్‌పై మాట్లాడే అర్హత లేదు
  • జనసేన-టీడీపీ బీసీ డిక్లరేషన్‌లోని ప్రతి అంశం అద్భుతమే
  • గ్రామగ్రామానికి తీసుకెళ్లి, ప్రతి బీసీకి వాస్తవాలు తెలియచేస్తాం
  • టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర స్పష్టీకరణ

అమరావతి(చైతన్నరథం): లక్షలాది మంది హాజరైన జయహో బీసీ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌తో వైసీపీ ప్రభుత్వానికి గుండెలు అదురుతున్నాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మూడేళ్లపాటు గ్రామాల్లో అధ్యయనం చేసి,బీసీ నేతలు, సామాన్య ప్రజలతో మాట్లాడి.. 140కి పైగా ఉన్న బీసీ కులాల్లోని ప్రతి వర్గాన్ని సంప్రదించి టీడీపీ-జనసేన పార్టీలు ప్రకటించిన ఉమ్మడి బీసీ డిక్లరేషన్‌ చరిత్రలో నిలిచిపోతుందన్నారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్లు తగ్గించిన జగన్‌రెడ్డి, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 16,700 మందికి రాజ్యాంగపరమైన పదవులు దూరం చేశాడన్నారు. రూ.75వేల కోట్ల బీసీ సబ్‌ప్లాన్‌ నిధుల్ని దారి మళ్లిం చాడు. బీసీ వర్గాల్లో చేతి వృత్తుల్ని నమ్ముకున్నవారి కోసం చంద్రబాబు తీసుకొచ్చిన ఆదరణ పథకాన్ని జగన్‌రెడ్డి రద్దు చేశాడు. ఆదరణ పనిముట్లు, పరికరా లను తుప్పుపట్టిపోయేలా చేయడానికి సైతం ముఖ్య మంత్రి ఇష్టపడ్డాడు గానీ, బీసీలకు మాత్రం ఇవ్వలేదని కొల్లు విమర్శించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 13-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 12-03-2026

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

బీసీలపై జగన్‌ మారణహోమం
ఐదేళ్ల పాలనలో నందం సుబ్బయ్య,తోట చంద్రయ్య సహా దాదాపు 300మంది బీసీ నేతల్ని దారుణంగా చం పించిన బీసీ ద్రోహి జగన్‌రెడ్డి. వేలాది మంది బీసీలపై తప్పుడు కేసులు పెట్టించి వారిని చిత్రహింసలకు గురి చేయించాడు. తన అక్కను ఏడిపిస్తున్నాడని అడ్డుకున్న చిన్నారి మణికంఠను పెట్రోల్‌ పోసి తగలబెట్టిన వైసీపీ దుర్మార్గుల కర్కశత్వాన్ని సైతం సమర్థించిన జగన్‌రెడ్డి బీసీ వ్యతిరేక నైజాన్ని ఎప్పటికీ క్షమించలేం. బీసీలపై జగన్‌రెడ్డి సాగించిన మారణహోమం మాటల్లో చెప్ప లేనిది. బీసీలపై ఇలాంటి దురాగతాలు ఇకపై ఎవరూ పాల్పడకుండా చేసేలా బీసీల రక్షణకోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలన్న చంద్రబాబు నిర్ణయం నిజంగా బీసీలకు గొప్ప ఆయుధం.
రాష్ట్రాన్ని నాలుగుభాగాలు గా విడగ్గొట్టి నలుగురు రెడ్లకు అప్పగించిన రెడ్డి మహా రాజు జగన్‌రెడ్డి అయితే, బీసీ నాయకులకు కీలక మంత్రిత్వశాఖలు ఇచ్చి, రాష్ట్ర నాయకత్వంలో, అభి వృద్ధిలో బీసీల ముద్రకు స్థానం కల్పించిన వ్యక్తి చంద్ర బాబు. బీసీ వర్గాల్లోని వెనుకబాటుతనం పోగొట్టి, వారిని ఆర్థికంగా మరింత పైకి తీసుకురావాలనే సదుద్దేశంతోనే టీడీపీ 54బీసీ సాధికార కమిటీలు ఏర్పాటు చేసింది. ఇప్పటికీ కనీసం పంచాయతీ కార్యా లయం గడప తొక్కని వర్గాలు బీసీల్లో ఇంకా ఉన్నాయి. అలాంటి వర్గాలకు ఏం చేయాలనే దానిపై అధ్యయనం చేసి సీనియర్‌ బీసీ నాయకులతో సంప్రదించి, బీసీ ప్రజలతో మాట్లాడాకే చంద్రబాబు బీసీ డిక్లరేషన్‌ ప్రకటించారని కొల్లు చెప్పారు.

బీసీ డిక్లరేషన్‌పై తప్పుడు మాటలు
టీడీపీ-జనసేన ఉమ్మడి బీసీ డిక్లరేషన్‌ను పదవుల కోసం జగన్‌రెడ్డి ముందు మోకాళ్లపై కూర్చునే వైసీపీ బీసీ నాయకులు తప్పుపట్టడం సిగ్గుచేటు. ఉత్తరాంధ్ర నుంచి చిత్తూరు వరకు వైసీపీలోని కీలక బీసీ నేతలం దరితో జగన్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ బీసీ డిక్లరేషన్‌ గురించి తప్పుగా మాట్లాడిస్తున్నారు. కీలక పదవుల్ని బీసీలకే ఇచ్చామని, 70శాతం నామినేటెడ్‌ పదవులు బీసీలతో నింపామని సజ్జల చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్‌గా ఇప్పుడు జగన్‌ రెడ్డి ఎవరిని నియమించారో, టీడీపీ ప్రభుత్వంలో ఎవరున్నారో సజ్జల చెప్పాలి. పుట్టా సుధాకర్‌ యాదవ్‌, కాగిత వెంకట్రావు వంటి బీసీ నాయకుల్ని చంద్రబాబు టీటీడీ ఛైర్మన్లను చేస్తే, జగన్‌ రెడ్డి మాత్రం వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్‌ రెడ్డిని ఛైర్మన్లుగా నియమించాడు. ఏపీఐఐసీ ఛైర్మన్‌గా టీడీపీ ప్రభుత్వం గతంలో కృష్ణయ్య యాదవ్‌ను నియమిస్తే, జగన్‌ రెడ్డి.

ఇప్పుడు రోజారెడ్డిని నియమించాడు. ఇలా అన్ని కీలక పదవులు రెడ్లకే కట్టబెట్టిన జగన్‌రెడ్డిని సమర్థిస్తూ సజ్జల సిగ్గులేకుండా 70శాతం పదవులు బీసీలకు ఇచ్చామని చెప్పుకుంటున్నాడు. 5 ఏళ్ల పాలనలో బీసీలను దారుణంగా అణగదొక్కి, వారిని చంపి వారి శవాలపై ప్యాలెస్‌లు నిర్మించుకున్న జగన్‌ రెడ్డి, ఆయన మంత్రులు బీసీల గురించి మాట్లాడటం సిగ్గుచేటు. బీసీ డిక్లరేషన్‌ లోని అంశాలన్నీ చదివాకే సజ్జల సహా మంత్రులు, వైసీపీ నేతలు నోరు విప్పాలి. ఎల్లప్పుడూ బీసీల కోసమే ఆలోచించే చంద్రబాబు గురించి, టీడీపీ గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు, మంత్రులకు లేదు. జగన్‌ రెడ్డి పాలనలో బీసీలకు జరిగిన అన్యాయంపై గొంతెత్తలేని వైసీపీలోని అసమర్థ బీసీ నాయకులు వాస్తవాలు తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి మెప్పు కోసం, పదవుల కోసం పాకులాడే వారికి బీసీ డిక్లరేషన్‌ గురించి మాట్లాడే అర్హత లేదని కొల్లు అన్నారు.

చిత్తశుద్ధి ఉంటే స్వాగతించాలి
చంద్రబాబు ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌లోని ప్రతి అక్షరం అద్భుతమే. 50ఏళ్లు నిండిన ప్రతి బీసీకి నెలకు రూ.4వేల పింఛన్‌, సంవత్సరానికి రూ.48వేల చొప్పు న 5 సంవత్సరాలకు రూ.2.40లక్షల వరకు అందించే పథకం. జగన్‌రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, బీసీల పై గౌరవమున్నా… చంద్రబాబు బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించిన నెలకు రూ.4వేల పింఛన్‌ ప్రకటనను స్వాగతించాలి. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకు రావడం జగన్‌రెడ్డికి ఇష్టం లేదా? బీసీలకు ప్రత్యేక రక్షణచట్టం తీసుకురావడంతో పాటు, దాని పర్యవేక్షణ కు ప్రత్యేక న్యాయపరిశీలన కమిటీ ఏర్పాటు చేస్తానన్న చంద్రబాబునాయుడికి బీసీల తరుపున ప్రత్యేక కృతజ్ఞత లు తెలుపుకుంటున్నట్లు కొల్లు చెప్పారు.

జీర్ణించుకోలేకపోతున్నారు
బీసీ సబ్‌ప్లాన్‌లో భాగంగా రాష్ట్ర జనాభాలో సగం పైన ఉన్న బీసీల అభివృద్ధికి ఏటా రూ.30వేల కోట్ల చొప్పున… 5 ఏళ్లలో రూ.లక్షా 50వేల కోట్లు ఖర్చు పెడతానన్న చంద్రబాబు ప్రకటనను జగన్‌ రెడ్డి, వైసీపీ నేతలు జీర్ణించు కోలేకపోతున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్‌ బీసీలకు స్థానిక సంస్థల్లో ప్రవేశపెట్టిన 24 శాతం రిజర్వేషన్లను మరో 10శాతం పెంచి చంద్రబాబు 34 శాతం చేస్తే, జగన్‌రెడ్డి వాటిని 24శాతానికే పరిమితం చేశాడు. దాంతో బీసీలు 16,700 పదవులు కోల్పో యారు. బీసీలు ఎప్పటికీ చేతులు కట్టుకొని తమ ముందు నిలబడాలన్నదే జగన్‌రెడ్డి, అతని సామాజిక వర్గ నేతల దుష్ట ఆలోచన. ఇందుకు విరుద్ధంగా చంద్రబాబు మరలా బీసీ రిజర్వేషన్లు యథాతథంగా 34శాతం అమలుచేస్తామని చెప్పడాన్ని వైసీపీ నేతలు, మంత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రత్యక్ష రాజ కీయాల్లో పోటీచేయడానికి అర్హతలేని బీసీ వర్గాల్ని కీలక స్థానాల్లో నియమిస్తామని, రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తామన్న చంద్రబాబు నిర్ణయాన్ని కూడా మన స్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. కార్పొరేషన్లు, నామినేటెడ్‌ పదవుల్లో బీసీలకు 34శాతం ప్రకటించడం చంద్ర బాబు గొప్పతనమని కొల్లు అన్నారు.

బీసీల ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా..
జనాభా దామాషా ప్రకారం బీసీవర్గాలకు నిధులు కేటాయించి, మొత్తం ఖర్చు చేస్తామని, ఏటా రూ.2వేల కోట్ల చొప్పున 5 ఏళ్లలో బీసీలకు రూ.10వేలకోట్ల వరకు స్వయం ఉపాధి రుణాలు అందిస్తామన్న ప్రకట నను స్వాగతిస్తున్నాం. బీసీ యువతకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన శిక్షణ అందించి, వారికి అవసరమైన స్వయం ఉపాధి రుణాలు అం దించి, వారి ఆర్థికాభివృద్ధికి పాటుపడేలా నిర్ణయం తీసుకోవడం, చేతి, కులవృత్తుల వారికోసం కామన్‌ వర్క్‌ షెడ్లు ఏర్పాటు చేయాలనే నిర్ణయం నిజంగా అభినందనీయం. పారిశ్రామికవేత్తలుగా ఎదగాలను కునే బీసీ యువతకు అండగా నిలిచేలా వారికి పారిశ్రామిక రాయితీలు కల్పించడం కూడా చరిత్రలో ఇంతవరకు ఎక్కడా లేని గొప్ప అంశం.

చంద్రబాబు నాయుడు గతంలో చాలా బీసీ కులాలకు బ్యాంక్‌ గ్యారెంటీలతో సంబంధం లేకుండానే బీసీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు అందించారు. ఆ పథకాన్ని మరలా కొనసాగించడం… మరిన్ని బీసీ కులాలను రుణం పొందే అవకాశం కల్పించడాన్ని స్వాగతిస్తున్నాం. జగన్‌ రెడ్డిలా బీసీలను నమ్మించి వంచించేలా కాకుండా, చంద్రబాబు బీసీ కులగణనకు సంబంధించి తీసుకున్న చట్టబద్ధమైన కులగణన నిర్ణయం బహుదా ప్రశంశ నీయం. చంద్రన్న బీమా కింద బీసీ కుటుంబాలను ఆదుకునేలా ప్రమాదవశాత్తూ మరణించిన చేతి, కులవృత్తుల వారి కుటుంబాలకు రూ.10లక్షల చంద్రన్న బీమా ప్రకటన కూడా శుభపరిణామం. బీసీలకు శాశ్వత కులధృవీకరణ పత్రాలు ఇవ్వాలన్న చంద్రబాబు నిర్ణయం నిజంగా బీసీలకు వరమనే చెప్పా లి. నాయకులు, అధికారుల చుట్టూతిరిగే పనిలేకుండా ఒకేసారి కులధృవీకరణ పత్రాలు ఇవ్వాలనే నిర్ణయాన్ని స్వాగతించాల్సిందే. బీసీ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడేలా బీసీ పాఠశాలలు, గురుకులాలు, జూనియర్‌ కళాశాలల్ని అప్‌గ్రేడ్‌ చేయాలనే నిర్ణయం హర్షణీయం. ఎలాంటి షరతులు లేకుండా బీసీ యువతకు విదేశీవిద్య పథకం అమలు చేయడం, స్టడీ సర్కిళ్ల పునరుద్ధరణ, ఐఏఎస్‌, ఐపీఎస్‌, గ్రూప్స్‌ పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్‌ ఇవ్వాలనే నిర్ణయం బీసీ యువతకు గొప్పవరమని కొల్లు అన్నారు.

గ్రామగ్రామానికి తీసుకెళతాం
టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన బీసీ భవనాల్ని జగన్‌ సర్కార్‌ నిరుపయోగంగా మార్చింది. వాటిని ఇతర కార్యకలాపాలకు కేటాయించింది. గ్రామస్థాయి నుంచి బీసీ భవనాలు నిర్మించడమే గాక, రాజధానిలో భారీ స్థాయిలో బీసీ భవన్‌ నిర్మిస్తామన్న చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ల ఉమ్మడి నిర్ణయం నిజంగా చాలా గొప్పది. బీసీలను నిర్వీర్యం చేయాలన్న జగన్‌రెడ్డి ఆలోచనల్ని సమర్థించేవారే టీడీపీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను తప్పుపడతారు. ప్రతి బీసీ సోదరుడు టీడీపీ-జనసేన ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను పూర్తిగా చదివి, వాస్తవా లు గ్రహించాలి. బీసీల భవిష్యత్‌ బాగుండాలి, వారికి నిజంగా న్యాయం చేయాలి, వారు సంతోషంగా ఉండాలనుకునే బీసీ నాయకులు ఎవరూ జగన్‌ రెడ్డితో ఉండరు. జగన్‌రెడ్డి బీసీలకు చేసిన ద్రోహాన్ని భరించ లేకే కొలుసు పార్థసారథి, గుమ్మనూరు జయరామ్‌ టీడీపీ గూటికి చేరారు.

జగన్‌రెడ్డి చేతుల్లో దగాపడ్డ బీసీ బిడ్డలమని ఇప్పటికే బీసీ నాయకుడు జంగా కృష్ణ మూర్తి తన ఆవేదనను వెళ్లగక్కాడు. సొంత బాబాయ్‌ను చంపించి, తల్లి, చెల్లిని తరిమేసిన వ్యక్తి, స్వార్థ రాజ కీయాల కోసం దేనికైనా తెగించే వ్యక్తికి బీసీలు మద్దతు తెలిపితే, తమజాతికి తాము ద్రోహం చేసుకున్నట్టే. చంద్రబాబు ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను గ్రామ గ్రామానికి తీసుకెళ్లి, ప్రతి బీసీకి వాస్తవాలు తెలియ చేస్తామని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.

Previous Post

సర్వీసు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోండి సీఎస్‌కు

Next Post

నేటి నుంచి లోకేష్‌ మలివిడత శంఖారావం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 13-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 13-03-2026

కార్యకర్త
@ March 13, 2026
చైతన్యరధం ఈ పేపర్ 12-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-03-2026

కార్యకర్త
@ March 12, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్
ఆంధ్రప్రదేశ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం
ఆంధ్రప్రదేశ్

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
రాష్ట్రమంతటా ‘జలధార’!
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రమంతటా ‘జలధార’!

చైతన్యరధం
@ March 12, 2026
స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం
ఆంధ్రప్రదేశ్

స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

చైతన్యరధం
@ March 12, 2026
మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు
ఆంధ్రప్రదేశ్

మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

చైతన్యరధం
@ March 12, 2026
వన్ మంత్.. వన్ విలేజ్.. ఫోర్ విజిట్స
ఆంధ్రప్రదేశ్

వన్ మంత్.. వన్ విలేజ్.. ఫోర్ విజిట్స

చైతన్యరధం
@ March 12, 2026
Load More

ముఖ్య వార్తలు

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

చైతన్యరధం
@ March 12, 2026
‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

చైతన్యరధం
@ March 12, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
రాష్ట్రమంతటా ‘జలధార’!

రాష్ట్రమంతటా ‘జలధార’!

చైతన్యరధం
@ March 12, 2026
స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

చైతన్యరధం
@ March 12, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist