- గిరిజన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేశారు
- జగన్ పాలనలో గిరిజన సంక్షేమ పథకాలు రద్దు చేశారు
- గిరిజనుల భవితవ్యం చంద్రబాబు గెలుపుతోనే సాధ్యం
- గిరిజన మహిళల ముఖాముఖిలో భువనేశ్వరి వ్యాఖ్యలు
పాడేరు: గిరిజన ప్రాంతాల అభివృద్ధే చంద్రబాబు ధ్యేయమని,గిరిజన ప్రాంతాలపై చంద్రబాబుకు ఎనలేని ప్రేమాభిమానాలు ఉన్నాయని టీడీపీ అధినేత చంద్ర బాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. నిజం గెల వాలి పాడేరు నియోజకవర్గ పర్యటన సందర్భంగా పాడే రులోని గిరిజన మహిళలతో భువనేశ్వరి బుధవారం ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భం గా గిరిజనులను ఉద్దేశించి భువనేశ్వరి మాట్లాడుతూ గిరిజనుల కోసం గతంలో చంద్రబాబు అనేక పథకాలు తెస్తే జగన్ వచ్చాకవాటిని రద్దుచేశాడని విమర్శించారు. గిరిజనులు అన్నిరంగాల్లో ముందుకు వెళ్లాలనే దూర దృష్టితో చంద్రబాబు అనేకపథకాలను ప్రవేశపెట్టి అమ లు చేశారు.
గిరిజనులు విదేశాల్లో చదువు కోవాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాన్ని అమలు చేశా రు. గిరిజన గర్భిణులు, బాలింతలకు గిరి గోరుముద్ద, చిన్నారులకు బాలామృతం పథకాలు అమలు చేశారు. పుట్టిన బిడ్డల కోసం ఎన్టీఆర్ బేబీకిట్ పథకాన్ని అమలు చేశారు. ప్రసవించిన అనంతరం తల్లిబిడ్డలను ఇంటికి సురక్షితంగా చేర్చేందుకు తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ పథకాన్ని అమలు చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఫీడర్ అంబులె న్సులుపెట్టి వైద్యసదుపాయాలు అందుబాటులోకి తెచ్చా రు. గిరిజన బిడ్డల కోసం బెస్ట్ అవెయిలబుల్ స్కూల్స్ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేశారు. ఇలాంటి మంచి మంచి పథకాలను జగన్మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక రద్దుచేసి గిరిజనులకు సంక్షేమాన్ని దూరం చేశాడు. వైసీపీ ప్రభుత్వం పని రద్దుచేయడం, కూలదోయడమే నని భువనమ్మ మండిపడ్డారు.
అరకును ప్రమోట్ చేసిన చంద్రబాబు
అరకు ప్రాంతం విశిష్టతను ఈ దేశానికి, ప్రపంచా నికి చాటి చెప్పేందుకు చంద్రబాబు ఎంత కష్టపడ్డారో అరకు ప్రాంతం ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు గిరిజన ప్రాంతాలకు చేసిన అభివృద్ధిపై నాకు దాదాపు పావుగంట పాటు వివరించారు. తెలుగుదేశం పాలన లో అభివృద్ధిలో దూసుకుపోయిన గిరిజన ప్రాంతాలు నేడు సరైన రోడ్లు కూడా లేని దుస్థితికి వచ్చాయంటే దానికి కారణం జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం. అరకు అంటే ఎవరికైనా గుర్తుకొచ్చేది అరకు కాఫీ… అరకు కాఫీ అభివృద్ధికి చంద్రబాబు ఇచ్చిన ప్రోత్సాహం గతం లో ఎవరూ ఇవ్వలేదు. అరకు కాఫీని వైసీపీ ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు.
అరకు ప్రాంతంలో పండే పంటలకు అంతర్జాతీయ, జాతీయ మార్కెట్లో గుర్తింపు తెచ్చిన ఘనత చంద్రబాబుది. అరకు కాఫీని ఇంగ్లాండ్, ప్యారిస్, ఇతర దేశాల్లో ప్రమోట్ చేసి అంత ర్జాతీయంగా అరకు కాఫీకి ఖ్యాతిని సంపాదించిన వ్యక్తి చంద్రబాబు. కుటుంబాన్ని, సన్నిహి తులను పక్కనపెట్టి రాష్ట్రం కోసం, గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం చంద్రబాబు కష్టపడి పనిచేశారు. గిరిజనులు కూడా చంద్రబాబుపై ఎనలేని ప్రేమాభిమానాలు చాటుకున్నా రు.చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన సమయం లో గిరిజన ప్రాంతాలన్నీ తల్లడిల్లాయి. శాంతియుత ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేసిమాకు అండగా నిలిచారు.వైసీపీ ప్రభుత్వం శాంతియుత నిరసనలు చేసి న వారిపై అక్రమకేసులు పెట్టి జైళ్లకు పంపింది. మహి ళలను కూడా స్టేషన్లకు తీసుకెళ్లి అర్ధరాత్రివరకు స్టేషన్ల లోనే నిర్బంధించి కర్కశంగా వ్యవహరించారని భువనమ్మ అన్నారు.
జగన్ పాలనలో గంజాయి, లిక్కర్, శాండ్ మాఫియాలో ఏపీ నంబర్ వన్
చంద్రబాబు పాలనలో అభివృద్ధి, సంక్షేమం, పాం దర్శక పాలన, యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు తీసుకురావడంలో ఏపీ నంబర్ వన్‌గా ఉండేది. జగ న్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏపీని గంజాయి, డ్రగ్స్, కల్తీ లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, మహి ళలపై అఘాయిత్యాలు, రైతుల ఆత్మ హత్యల్లో నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లారు.
రాష్ట్ర ప్రజలకు తాత్కాలిక పథకాలను ఇచ్చి, దీర్ఘ కాలిక ప్రయోజనాలను దూరంచేస్తున్న మోసకారి ప్రభు త్వం వైసీపీ ప్రభుత్వమని భువనమ్మ విమర్శించారు.
ప్రశ్నిస్తున్నారనే చంద్రబాబు అరెస్టు
వైసీపీ ప్రభుత్వ దుర్మార్గాలను ప్రశ్నిస్తున్నారనే కోపం తోనే చంద్రబాబుపై ఆధారాలు లేని కేసులు పెట్టి అక్ర మంగా 53రోజులు జైల్లో నిర్బంధించారు. చంద్రబాబు ను అరెస్టు చేసి మా కుటుంబాన్ని, చంద్రబాబును రోడ్డు మీదకు రాకుండా చేయాలని జగన్ ప్రభుత్వం కుట్ర చేసింది. అయినా చంద్రబాబు, మేము ఎక్కడా అధైర్య పడలేదు. చంద్రబాబు జైల్లో ఉండి కూడా తన అక్రమ అరెస్టుతో తల్లడిల్లి మనస్తాపంతో మరణించిన కార్య కర్తల గురించి ఆలోచించారు తప్ప, అప్పుడు కూడా మా కుటుంబం గురించి ఆలోచించలేదు. చని పోయిన కార్యకర్తల ఇళ్లకు వెళ్లి,పరామర్శించి వారికి పార్టీ అండ గా నిలబడు…గిరిజన సంక్షేమమే చంద్రబాబు ధ్యేయం
ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ వాలిపోతుంటారు. రాష్ట్ర ప్రజలు.. నేడు మన చేతిలోకి పథకాల ద్వారా ఎన్ని డబ్బులు వచ్చాయి అనేది కాకుం డా… దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పనిచేసే నిజమైన నాయకుడు ఎవరో ఆలోచించాల్సిన సమయం వచ్చింది. లీడర్ ఎవరో, దోపిడీ దారు డు ఎవరో ప్రజలే తేల్చుకోవాలని భువనమ్మ హితవు పలికారు.
నాలుగున్నరేళ్లుగా టీడీపీ కార్యకర్తలపై హింసాకాండ
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి టీడీపీ కార్యకర్తలపై దాడులు, హింసాత్మక చర్యల కు పాల్పడుతున్నారు. ప్రభుత్వ అవినీతిని, దోపిడీ విధానాలను ప్రశ్నించినవారిని వైసీపీ నేతలు దారుణంగా చంపేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలను, కల్తీ మద్యాన్ని ప్రశ్నించిన కార్యకర్తలను వైసీపీ నేతలు అత్యంత క్రూరంగా రోడ్డుపైనే చంపేశారు. నాలు గున్నరేళ్లలో టీడీపీ కార్యకర్తలపై దాడి జరగని రోజు లేదు. అక్రమ కేసులుపెట్టి జైళ్లలో మగ్గబెడు తున్నారు. టీడీపీ కార్యకర్తలంతా ఒక్కటవ్వా ల్సిన సమయం వచ్చింది. రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తును నిలబెట్టుకునే అవకాశంత్వరలో మన చేతికి రాబోతోంది. రానున్న ఎన్నికలు ప్రశాంతం గా, నిజా యితీగా జరిగేలా ప్రతి కార్యకర్త చొరవ తీసుకోవాలని భువనమ్మ పిలుపు ఇచ్చారు.
రాష్ట్రం బాగుండాలనే భార్యాబిడ్డలను వదిలి లోకేష్ పాదయాత్ర
వైసీపీ చేతిలో నలిగిపోతున్న రాష్ట్ర భవిష్యత్తు ను కాపాడేందుకు లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేయాలని నిర్ణయించుకుని మాతో చెప్పాడు. పదవుల కోసం కుటుంబ సభ్యులనే చంపుకుంటున్న ఈ వైసీపీ నేతలు..పాదయాత్ర చేస్తే లోకేష్‌ను ఏమైనా చేస్తారేమో అని భయపడ్డాను. అయినా రాష్ట్ర యువత, భావితరా ల భవిష్యత్తు బాగుండాలంటే అన్ని వర్గాలను చైతన్య వంతం చేయాలనే ఉద్దేశంతో లోకేష్‌ను ఆశీర్వదించి ముందుకు పంపించాను. 226 రోజులు, 3132 కిలో మీటర్లు లోకేష్ పాదయాత్ర చేశాడు. ఇది సామాన్య మైన విషయం కాదు. భార్య, చిన్న బిడ్డను వదిలేసి 8నెలలు రోడ్డుపైనే లోకేష్ మీలో ఒకడిగా తిరిగాడు. అన్నివర్గాల ప్రజలతో మమేకమైవారి కష్టాలను తెలుసు కున్నాడు. వారికి బంగారు బాటలు వేయడానికి ప్రణా ళిక సిద్ధం చేసుకున్నాడని భువనమ్మ తెలిపారు.
ఎన్నికల్లో అడ్డు తగిలితే తొక్కుకుంటూ ముందుకెళ్లడమే
రానున్న ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేవి. దోపిడీదారులు మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని కుట్రలు చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలంతా ఏకతాటిపైకి రావాలి. పార్టీని గెలిపించుకునేందుకు ముందుకు కదలాలి. ఎన్నికల్లో అధికారపార్టీ ఏదైనా అవకతవకలకు పాల్పడితే సైకిల్ తొక్కుకుంటూ ముందుకెళ్లినట్లు అవినీతిపరుల ఆగడా లను తొక్కుకుంటూ ముందుకెళ్లిపోవాలి. ఎక్కడా వెనక డుగు వేయొద్దు. రాష్ట్రంలోని ప్రతి కార్యకర్త చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధాన్ని బలంగా వాడాలి. ప్రజా వ్యతిరేకులను ఓటు అనే ఆయుధంతో ఓడిరచాలి. రాష్ట్రం బాగుపడాలంటే… యువత,మహిళల భవిష్యత్తు బాగుండాలంటే పసుపుజెండా ఎగరాలి. చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావాలి. గిరిజనుల భవితవ్యం చంద్రబాబు గెలుపుతోనే సాధ్యం అని ప్రతి గిరిజన బిడ్డ గుర్తు పెట్టుకోవాలని భువనమ్మ ఉద్ఘాటించారు.