- తెదేపా ఎస్టీ సెల్ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో టీడీ జనార్ధన్ పిలుపు
- ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధారు నాయక్ ఆధ్వర్యంలో గిరిజన సమస్యలపై చర్చ
అమరావతి: గిరిజనులందరూ ఏకతాటి పై నడిచి జగన్‌రెడ్డిని గద్దె దించాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ, టీడీ జనార్ధన్ పిలుపు ఇచ్చారు. జగన్‌రెడ్డి పాలనలో గిరిజనులు ఎదుర్కొం టున్న సమస్యలు, రాబోయే ఎన్నికల్లో గిరి జనుల వ్యూహం ఎలా ఉండాలో చర్చించేం దుకు మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాల యంలో గురువారం తెదేపా ఎస్టీ సెల్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా టీడీ జనార్ధన్ పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన భూములను, సంపదను యథేచ్ఛగా దోచుకున్నారన్నారు. గిరిజనుల కు రాజ్యాంగపరంగా అమలు కావాల్సిన, తెదేపా ప్రభుత్వం గిరిజనులు తమ సొంత కాళ్లపై నిలబడేందుకు తీసుకొచ్చిన 16 గిరిజన సంక్షేమ పథకాలను రద్దు చేసిన గిరిజన వ్యతిరేకి జగన్‌రెడ్డి అని అన్నారు. జగన్‌రెడ్డిని అధికారం నుంచి తప్పించక పోతే గిరిజనుల అస్థిత్వమే ప్రమాదంలో పడుతుంది. జగన్‌రెడ్డి గిరిజన వ్యతిరేక కార్యక్రమాలపై గిరిజనులంతా ఏకమై గిరి జనులను ఏకతాటిపై నడిపిన బిర్సాముం డా స్ఫూర్తితో పనిచేసి జగన్‌రెడ్డిని గద్దెదిం చాలని కోరారు.
తెదేపా ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ధారు నాయక్ మాట్లాడుతూ… జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో రూ.5 వేల కోట్ల ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు నవరత్నాలకు మళ్లించారని దుయ్యబట్టారు. తెదేపా హయాంలో స్వయం ఉపాధి పథకాల అమలుతో కళ కళలాడిన గిరిజన యువత నేడు గంజాయి మత్తులో కొట్టుమిట్టాడుతోంది.ఏజెన్సీ ప్రాం తాల్లో చంద్రబాబునాయుడు గిరిజనులచే కాఫీ పండిస్తే నేడు జగన్‌రెడ్డి వారి చేత గంజాయి పండిరచేలా ఒత్తిడి చేస్తున్నారు. రాష్ట్రంలో అక్కరకు రాని అంబులెన్సులు సమయానికి రాకపోవడంతో గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారు. వైద్యం కోసం డోలీల్లో ఆసుపత్రులకు తీసుకెళ్లినా సౌకర్యా ల లేమితో గిరిజనులు ప్రాణాలు గాలిలో దీపాలైనాయి. రాబోయే నాలుగు నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వం రాబోతోందని… గిరిజనులకు మంచి రోజులు రాబోతున్నా యని, జగన్‌రెడ్డి నిలిపేసిన గిరిజన సం క్షేమ పథకాలను తిరిగి పునరుద్ధరిస్తామని అన్నారు.
తెదేపా రాష్ట్ర ప్రధానకార్యదర్శి మహ్మద్ నజీర్ మాట్లాడుతూ గిరిజనులకు అన్యా యం చేసినావారు నోరు మెదపలేరనే భావ నతో జగన్‌రెడ్డి గిరిజనులకు తీరని అన్యా యం చేస్తున్నారన్నారు.
రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, ముస్లింలపై వైసీపీ రౌడీ మూకలు పేట్రేగి పోయి దాడులకు పాల్పడుతున్నారు. పాద యాత్రలో ఎస్టీలకు 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తానని చెప్పిన జగన్‌రెడ్డి నేడు తండాలు, గూడేలలో ఉంటేనే ఇస్తానంటూ తనపెత్తందారీ విధానాన్ని కొనసాగిస్తు న్నారు. దేశంలోనే అతి పెద్ద పెత్తందారైన జగన్‌రెడ్డిని ఇంటికి పంపాల్సిన బాధ్యత గిరిజనులు తీసుకోవాలని పిలుపు ఇచ్చారు.
కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్య దర్శి మానికల ఏడుకొండలు, కార్యదర్శి మొగిలి కల్లయ్య, ఎస్టీ సెల్ రాష్ట్ర నాయకు లు కత్తి పద్మ, మాజీ జెడ్‌పి చైర్‌పర్సన్ కాంతమ్మ, సోమ్లా నాయక్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, కాళియానాయక్,కళావతి, ఈగా రామ్‌దాస్,జిల్లా ఎస్టీసెల్ అధ్యక్షులు, ప్రధా న కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.