- ప్రజా వినతుల కార్యక్రమానికి స్పందన
- ప్రజల రక్తం తాగిన దుర్మార్గులు వైసీపీ నేతలు
- దళితులు, పేదల భూములనూ కబ్జా చేశారు
- బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తాం
- మంత్రి టి.జి.భరత్, ఎమ్మెల్సీ అశోక్‌బాబు
మంగళగిరి(చైతన్యరథం): కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం, తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్న భావనతోనే ప్రజా వినతుల కార్యక్రమానికి ప్రజలు బారులు తీరుతున్నారని మంత్రి టి.జి.భరత్, ఎమ్మెల్సీ అశోక్‌బాబు తెలిపారు. మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ప్రజా వినతుల కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వారితో పాటు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్, టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముస్తాక్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్జీలపై అధికారులకు ఫోన్లు చేసి సమస్యలను వివరించి పరిష్కరించేందుకు కృషి చేస్తు న్నామని, పరిష్కరించాల్సిన అర్జీలను ఆయా శాఖలకు పంపుతున్నట్టు చెప్పారు. గత ప్రభు త్వం ప్రజల సమస్యలను ఏనాడు పట్టించుకోలేదని మండిపడ్డారు. నాటి పాలకులు ప్రజలపై దెయ్యాల్లా పడి పీడిరచారని, ప్రజల రక్తం తాగి ప్రశ్నిస్తే వారి ప్రాణాలు తీసిన దుర్మార్గులు వైసీపీ నేతలని ధ్వజమెత్తారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏ చిన్న సమస్య ఉన్నా తమ సమస్యకు పరిష్కారం దొరకుతుందన్న నమ్మకంతో వస్తున్నారని, వారి సమస్యలు పరిష్కరించి చిరునవ్వులు చూడటమే తమ ధ్యేయమన్నారు. అనంతరం టీడీపీ ఆధ్వర్యంలో పలువురికి ఆర్థికసాయం చెక్కులు అందజేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల భూములు కబ్జా
` 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 1986లో ప్రభుత్వం ఇచ్చిన భూములు దాదాపు 430 ఎకరాలను ఆ పార్టీ నేతలు కబ్జా చేశారని శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోమందేవపల్లి మండలం పోలే పల్లి గ్రామానికి చెందిన బాధితులు అంజినప్ప, మారెప్ప, సాదరి గోవిందప్ప, యలవ నారా యణప్ప ఆదేమ్మ, బుడ్డయ్యలు ఫిర్యాదు చేశారు. కబ్జాదారుల నుంచి తమ భూములను విడిపించాలని వేడుకున్నారు.
` హిందూపురం మండలం జంగాలపల్లికి చెందిన అలివేలమ్మ, చిన్నతిమ్మ రాయప్ప, అశ్వర్థప్పలు సమస్యను వివరిస్తూ వైసీపీ నేత నరసింహులు తమ భూములను కాజేయాలని తమకు మంజూరైన 1బీలను రద్దు చేయించి పొలంలోకి వెళితే కొట్టిస్తున్నాడని, ఆయనకు పోలీసులు సహకరిస్తున్నారని న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు.
పరిహారం ఇచ్చేందుకు డబ్బు అడిగారు
` తమ ఇళ్లు నేషనల్ హైవే రోడ్డు నిర్మాణంలో పోయాయి. పరిహారం ఇవ్వడానికి వైసీపీ నేతలతో రేణిగుంట రెవెన్యూ అధికారి కోటేశ్వరరావు కుమ్మక్కై లంచం డిమాండ్ చేశారు. తాము ఇవ్వలేమని చెప్పడంతో రావాల్సిన పరిహారాన్ని తగ్గించేశారు. తమ పక్కన ఉన్న వైసీపీ నేతలకు చెందిన రేకుల షెడ్‌కు మాత్రం రూ.18 లక్షలు, కొంతమందికి రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఇంటికి మంజూరు చేయించారు. తమకు న్యాయం చేయాలని తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీకి చెందిన బి.గీత, పి.జయమ్మ, చెంచులక్ష్మి, జయలక్ష్మి వేడుకున్నారు.
` తమ గ్రామం గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. కనీస మౌలిక సదుపా యాలు కూడా లేవు. గ్రామానికి ఇంతవరకు రోడ్డు లేదు. దయచేసి తమ గ్రామానికి రోడ్డు వేయాలని అనంతపురం జిల్లా పుట్లూరు మండలం నారాయణపల్లె గ్రామానికి చెందిన పొత్తూరి రవికుమార్ వినతిపత్రం ఇచ్చారు.
టీడీపీలో చేరామని టాంజానియాలో అక్రమ కేసులు
` తాను, తన మద్దతుదారులు టీడీపీలో చేరడంతో టాంజానియాకు వెళ్లిన తన కొడుకుపై అక్కడకు పంపిన ఏజెంట్ వైసీపీ సానుకూలపరుడు కావడంతో అక్రమ కేసులు పెట్టించా డని.. తన కుమారుడిని తిరిగి ఇండియాకు రప్పించాలని సత్యసాయి జిల్లా ఓబులదేవర చెరువు మండలం తంగేడుకుంట గ్రామానికి చెందిన సోమశేఖర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
` తాను పేదరాలినని ప్రమాదంలో కాలు చేయి విరిగి ఎటువంటి పనులు చేసుకోలేని స్థితిలో ఉన్నానని, తనకు పింఛన్ మంజూరు చేయించాలని గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన జూటూరు మంగమ్మ అర్థించారు.
` కడప జిల్లా పోరుమామిళ్ల మండలం సిద్దనకిచామపల్లె ఎంపీపీ స్కూల్లో పనిచేస్తున్న హెడ్ మాస్టర్ వైసీపీ నేతలకు అనుకూలంగా పనిచేస్తూ బడిపిల్లలను ఇబ్బంది పెడుతుండగా ఎంఈవో దృష్టికి తీసుకెళ్లామని, అతనిపై చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన నారా యణ, రోశయ్యలు ఫిర్యాదు చేశారు.