ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన శుక్రవారం ముగిసింది. మూడు రోజుల పాటు అనంతపురం, కళ్యాణదుర్గం, రాయదుర్గం, గుంతకల్లు, పత్తికొండ, ఆలూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటించారు. అనంతపురంలో 1, కళ్యాణదుర్గంలో 3, రాయదుర్గంలో 1, గుంతకల్లులో 2, పత్తికొండలో 3, ఆలూరులో 1, కోడుమూరులో 4 కుటుంబాలను పరామర్శించారు. మూడు రోజుల్లో 15 కుటుంబాలను పరామర్శించి, ఆర్థికసాయం అందించారు. కష్టాల్లో ఉన్న కార్యకర్తల కుటుంబాలకు బాసటగా నిలబడ్డారు.
పత్తికొండలో మొదటిసారి ఓటు వేయబోతున్న యువతతో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించి, యువతకు ఓటు విలువపై అవగాహన కల్పించారు. మహిళా దినోత్సవం సందర్భంగా కలలకు రెక్కలు అనే పథకానికి సంబంధించిన వెబ్ సైట్, బ్రోచర్ విడుదల చేశారు. యువతులు ఆర్థిక సమస్యలతో ప్రొఫెషనల్ కోర్సులు చదవలేక ఇంటికే పరిమితం కాకుండా ప్రభుత్వమే షూరిటీతో లోన్లు ఇప్పించేందుకు కలలకు రెక్కలు పథకం ద్వారా టీడీపీ-జనసేన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కలలకు రెక్కలు పథకం పట్ల సంతోషం వ్యక్తం చేసిన యువత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.