మదనపల్లి: అసమర్థుడి పాలనలో రాష్ట్రంలో అన్ని రంగాలు నాశనమయ్యాయని మదనపల్లి మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ విమర్శలు చేశారు. నిమ్మనపల్లి మండలం అగ్రహారం గ్రామంలో ఏర్పాటు చేసిన జగనన్న బాదుడే బాదుడు కార్యక్రమానికి దొమ్మలపాటి రమేష్ హాజరయ్యారు. గ్రామంలో వీధివీధికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజలను మోసం చేస్తూ మోసపూరిత నవరత్న పథకాలు పెట్టాడని విమర్శించారు. రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తోశాడని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు, మండలం క్లస్టర్ ఇంచార్జ్, మాజీ జడ్పీటీసీ మునిరత్నం, టీడీపీ మండల అధ్యక్షులు పుర్రా వెంకటరమణ, యువత అధ్యక్షులు చినబాబు, ఐటీడీపీ అధ్యక్షులు గోపి, గ్రామ అధ్యక్షులు రామచంద్ర, చంద్ర, నరేంద్ర, కేశవ, భూపతి, సూరి, మాబులు, సైదాపేట బాబు, అగ్రహారం గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.