- గురుకులాలు, వసతిగృహాల్లో పరిశుభ్రతకు చర్యలు తీసుకోవాలి
- శాఖ ఉద్యోగులు మెరుగైన ఫలితాలు సాధించేలా కృషిచేయాలి
- ఎస్సీల ఆదాయం పెంపునకు ప్రణాళికలు రూపొందించాలి
- త్వరలో ఎస్సీ విద్యార్థులకు ఉచితంగా డీఎస్సీ శిక్షణ ఇస్తాం
- గురుకులాల్లో సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తాం
- జగన్ రద్దు చేసిన ఎస్సీ సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తాం
- సెప్టెంబరు మొదటివారం నుంచి జిల్లాల్లో పర్యటిస్తాం
- సాంఘిక సంక్షేమ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
గుంటూరు(చైతన్యరథం): వెనుకబడిన వర్గాలకు విద్య, వైద్యం, ఆరోగ్యం అందించ డంలో సాంఘిక సంక్షేమ శాఖ పనితీరు కీలకమని, ఉద్యోగులు మెరుగైన ఫలితాలు సాధించేలా బాధ్యతతో పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సూచించారు. సోమవారం గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గురుకుల పాఠశాలలు, సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నాయుడుపేట గురుకుల పాఠశాలలో పరిశుభ్రత లేమి కారణంగా బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారని, ఇటువంటి ఘటనలు పునరావృతం కావడానికి వీలు లేదని స్పష్టం చేశారు.
గురుకుల పాఠశాలలు, వసతిగృహాల్లో ప్రతినెలా హెల్త్ చెకప్‌లు నిర్వహించాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకోవాలని, వారిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. చదువులో వెనుక బడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. అధికారులు తరచుగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. రిమోట్ ఏరియాల్లోని గురుకుల పాఠశాలల్లో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. జిల్లా కేంద్రాల్లో ఎస్సీ విద్యార్థులకు మూడునెలల పాటు ఉచితంగా డీఎస్సీ శిక్ష ణ అందిస్తామని తెలిపారు. అంబేద్కర్ ఓవర్సీస్ విదేశీ విద్యతో పాటు గత టీడీపీ ప్రభు త్వ హయాంలో అమలైన ఎస్సీ సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తామని తెలిపారు.
ఎస్సీల తలసరి ఆదాయం పెంచేలా ప్రణాళికలు
ఏ సౌకర్యాలు లేని రోజుల్లోనే అంబేద్కర్, జగజ్జీవన్‌రామ్‌లు ఉన్నత స్థానానికి ఎదిగా రని, ప్రతి హాస్టల్లో అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ ఫొటోలు ఉండాలని సూచించారు. ఉద్యోగు లు కష్టపడి పనిచేసి మెరుగైన ఫలితాలు తీసుకురావాలని, ఇందుకు అవసరమైన చోట సచివాలయ ఉద్యోగుల సహకారం తీసుకోవాలని సూచించారు. ఉద్యోగులకు ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు. ఎస్సీల్లో తలసరి ఆదాయం పెం చేలా అధికారులు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. వచ్చే నెల మొదటి వారం నుంచి అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని గురుకుల పాఠశాలలు, సంక్షేమ వసతిగృహా లు, మోడల్ విలేజెస్ పరిశీలించనున్నట్టు తెలిపారు.
వంద రోజుల యాక్షన్ ప్లాన్
అనంతరం వంద రోజుల యాక్షన్ ప్లాన్‌ను మంత్రికి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలోని 1051 హాస్టళ్లలో 86 వేల సీట్లలో 32 వేల సీట్లు ఖాళీలు ఉన్నాయని వాటిని సెప్టెంబరు లోగా భర్తీ చేస్తామని తెలిపారు. గురు కుల పాఠశాలలు, వసతిగృహాల్లో రూ.143 కోట్లతో మైనర్, మేజర్ రిపేర్లు చేయాల్సి ఉందన్నారు. ప్రతి వసతిగృహంలో ఆరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, ఎన్టీఆర్ విద్యోన్నతి, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజెస్ స్కీం, బుక్ బ్యాంకు టీం వంటి పథకాలన్నీ పునరుద్ధరిస్తామని వివ రించారు. గత ఐదేళ్లలో హాస్టల్ విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు కూడా అందించలేదని వాటిని తిరిగి అందిస్తామన్నారు. రూ.190 కోట్లతో గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో డార్మెటరీలు, కిచెన్లు పునర్నిర్మాణం చేయాల్సి ఉందని తెలిపారు. కొన్ని చోట్ల నాన్ టీచింగ్ స్టాఫ్‌ను భర్తీ చేయాల్సి ఉందని చెప్పారు. నరేగా నిధులతో గురుకులాల్లో కాంపౌండ్ వాల్స్, మరుగుదొడ్లు నిర్మించేందుకు చర్యలు చేపడతామని వివరించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టి.కన్నబాబు, సాంఘిక సంక్షే మ గురుకుల విద్యా సంస్థ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రసన్న వెంకటేష్, అన్ని జిల్లాల సాంఘిక సంక్షేమ అధికారులు, ఎస్సీ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.