- ప్రతి ఏటా జాబ్ కాలెండర్ అంటూ కల్లబొల్లి కబుర్లు
- ఖాళీగానే ప్రభుత్వ శాఖల్లో రెండున్నర లక్షల ఉద్యోగాలు
- పరిశ్రమలను తరిమేయడంతో ఉన్న ఉపాధికీ గండి
- స్వయం ఉపాధి పథకాలకూ మంగళం
- టీడీపీ ప్రభుత్వమిచ్చిన నిరుద్యోగభృతి రద్దు
- చంద్రబాబు వస్తేనే యువతకు భవిత
అమరావతి, చైతన్యరథం: తాను అధికారంలోకి వస్తే యువతకు వెల్లువలా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాన ని మాయమాటలు చెప్పి వారిఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి తన అసమర్థ,అవినీతిపాలనతో యువకుల ఉసురు తీసుకుంటున్నారు. ప్రతిఏటా జనవరి మాసంలో జాబ్ క్యాలె ండర్ ప్రకటిస్తానని, ప్రతిఏటా డీఎస్సీ నిర్వహిస్తానని, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగాల విప్లవం సృష్టిస్తా నని ఎన్నో కల్లబొల్లి మాటలు చెప్పిన జగన్‌రెడ్డి ఈ నాలున్నరేళ్లలో యువతను నిలువునా ముంచారు. రాష్ట్రంలో ఉపాధి దొరకక, ఉద్యోగం లేక దాదాపు 471మంది యువ కులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తాజాగా అనంతపురం జిల్లా కుందుర్పికి చెందిన శ్రీకాంత్ అనే నిరుద్యోగి ఉద్యోగం దొరకలేదనే మనస్థాపంలో ప్రాణం తీసుకున్నాడు. టీటీిసీ చదివి పోటీ పరీక్షలకు సిద్దమౌతున్న శ్రీకాంత్ ఉద్యోగ నియా మకాలకు నోటిఫికేషన్ రాకపోవడంతో మదనపడుతూ ఉండే వాడు. ఈ బాధతోనే శుక్రవారం ఉరేసుకొని చనిపోయాడు. కేంద్ర ప్రభుత్వ గణంకాల ప్రకారం రాష్ట్రంలో 2022 నాటికి 9.1శాతం నిరుద్యోగిత ఉంది.గత టీడీపీ ప్రభుత్వహయంలో అటు ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ కొనసాగుతూనే ఇటు ప్రయివేట్ రంగంలోనూ పెద్దఎత్తున ఉద్యోగ అవకాశా లు కల్పించారు. ఉద్యోగ కల్పన, నైపు ణ్యాధివృద్ధిలో ఏపీ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది. అలాంటి రాష్ట్రాన్ని జగన్‌రెడ్డి తన అసమర్ధ, అవినీతి పాలనతో యువకులు ఆత్మ హత్యలు చేసుకునే స్థితికి తీసుకువచ్చారు.
జాబ్ క్యాలెండర్ ఎక్కడ..?
ప్రతి ఏడాది జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా నని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న రెండున్నర లక్షల పోస్టులను భర్తీచేస్తానని ఊరురూ తిరుగుతూ కనబడిన ప్రతి యువకుడి కి హామీనిచ్చారు జగన్‌రెడ్డి. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ అనే విషయాన్నే మర్చిపోయారు.ఈ నాలుగేళ్లకాలంలో ఒక్క ఏడాదిలో మాత్రం పదివేల పోస్టుల కు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. కానీ ఒక్కపోస్టు కూడా భర్తీ చేయలేదు. ఇప్పటికీ రెండున్నర లక్షల పోస్టులు ఖాళీ గానే ఉన్నాయి. లక్షకు పైగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేస్తానని ఇచ్చిన హామీని కూడా తుంగలో తొక్కారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఖాళీలను వెంటనే గుర్తించి భర్తీ చేశారు. ఎపిపిఎస్‌సి ద్వారా నాలుగు వేలకుపైగా పోస్టు లను భర్తీచేశారు. పోలీస్ శాఖలో ఆరువేల మందిని నియ మించారు. కానీ ప్రస్తుతం పోలీస్‌శాఖలో 20వేల పోస్టులు ఖాళీగా ఉన్నా జగన్‌రెడ్డి ప్రభుత్వం ఒక్క పొస్టు కూడా భర్తీ చేయలేదు.
ప్రతి ఏటా డీఎస్సీ ఏది?
ప్రతిపక్ష నేతగా జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతిఏటా డీఎస్సీ నిర్వహిస్తామని హమీనిచ్చా రు. కానీ ఈ నాలుగేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా తీయ లేదు.ఒక్క టీచర్ పోస్ట్‌నూ భర్తీ చేయలేదు. కేంద్ర ప్రభు త్వం రాష్ట్రంలో 50వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా యని చెబుతుంటే జగన్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం 8 వేల పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని అంటోంది.వాటి భర్తీకి కూడా ఇంత వరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. మరోవైపు టీడీపీ ప్రభుత్వ హాయాంలో ఐదేళ్ల కాలంలో రెండు డీఎస్సీలు నిర్వహించి 17,591 పోస్టులను భర్తీ చేసింది.
ఉన్న ఉపాధీ పోయింది… కొత్త ఉపాధి లేదు
గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పరిశ్రమల ను ఆకర్షించి ఆరున్నర లక్షల మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలను కల్పించారు.అలాగే ఐటి రంగంలో నెల కొల్పిన పరిశ్రమల కారణంగా కొత్తగా 34వేల మందికి ఐటి ఉద్యోగాలు వచ్చాయి. నైపుణ్యాభివృద్ది ద్వారా 64 వేల మందికి ఉపాధి కల్గింది. కానీ జగన్‌రెడ్డి ప్రభుత్వం తన కమీషన్ల కక్కుర్తి కోసం ఉన్న కంపెనీలనే రాష్ట్రం నుంచి సాగనంపింది. లూలూ గ్రూపు, ఫ్రాంక్లిన్ టెంపు ల్టన్, అమర్‌రాజా బ్యాటరీస్ ఇంకా ఎన్నో కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ పరిశ్రమలు వేరే రాష్ట్రాల కు తరలివెళ్లిపోయాయి.దీంతో స్థానిక యువతకు ఉన్న ఉపాధి పోయింది. ఈ నాలుగున్నరేళ్లలో ఒక్క కొత్త పరి శ్రమ కూడా రాలేదు. దీంతో కొత్త ఉపాధి కూడా రాలేదు. బిటెక్‌లు, డిగ్రీలు చేసిన విద్యార్ధులుకు ఉపాధి దొరక్క హమాలీ, వ్యవసాయ పనులు చేసుకునే స్థితికి వెళ్లిపోయారు.తాను అధికారంలోకి వస్తే కేంద్రం మెడ లు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని, తద్వారా ఉద్యో గ విప్లవం సృష్టిస్తామని కల్లబొల్లి హామీలు నిచ్చారు. కానీ నాలుగున్నరేళ్లలో కేంద్ర పెద్దల పాదాలకు మొక్క డం తప్ప ఒక్కసారి కూడా అధికార పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదాపై నిలదీయలేదు.
స్వయం ఉపాధి పథకాలకు గండి ` నిరుద్యోగ భృతి రద్దు
టీడీపీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులుగా ఉన్న యువ కులకు నెలకు రెండు వేల రూపాయలు భృతి కింద దాదాపు ఆరు లక్షల మందికి ఇచ్చారు. కానీ జగన్‌రెడ్డి ప్రభుత్వం దాన్ని రద్దు చేసి నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టింది. టీడీపీ ప్రభుత్వ కాలంలో బీసీ,ఎస్‌సీ,ఎస్‌సీ,మైనార్టీ, బ్రహ్మణలకు స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆదాయాలను కల్పించింది. దాదాపు రెండు లక్షల 28వేల మందికి ఉపాధిని కల్పిం చింది. ఈ పథకాలకు కూడా జగన్‌రెడ్డి గండికొట్టాడు.
టీడీపీ`జనసేన ప్రభుత్వంతోనే యువతకు భవిత
చంద్రబాబు హయాంలో యువతకు ఎన్నో ఉపాధి మార్గాలను చూపించిన టీడీపీ రానున్న ఎన్నికల్లో జన సేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి యువతకు భవితను అందిస్తామని భరోసానిస్తోంది. 20లక్షల మం ది యువతకు ఉపాధి కల్పించడాన్ని లక్ష్యంగా పెట్టు కుంది.యువగళం పేరుతో నిరుద్యోగ యువతకు ఏడా దికి మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతిని అం దించనుంది. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించి ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది.