- అభ్యర్థులను మార్చినా ఆగని వలసలు
- లోకేష్ సమక్షంలో 150 కుటుంబాలు టీడీపీలో చేరిక
అమరావతి(చైతన్యరథం): రెండునెలల్లో ముగ్గురు అభ్యర్థులను మార్చినప్పటికీ మంగళగిరి నియోజక వర్గంలో వైసీపీ నాయకుల వలసలు ఆగడం లేదు. మంగళగిరిని నెం.1 చేయడమే లక్ష్యమంటున్న యువ నేత లోకేష్ పిలుపునకు నియోజకవర్గంలో భారీ స్పందన లభిస్తోంది. వైసీపీకి చెందిన నాయకులతో పాటు తటస్థులు కూడా పెద్దఎత్తున టీడీపీలో చేరుతు న్నారు. జగన్మోహన్రెడ్డి నాయకత్వంపై నమ్మకం కోల్పో యిన వైసీపీ నాయకులు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడు తున్నారు. తాడేపల్లి, దుగ్గిరాల మండలాలకు చెందిన 150 వైసీపీ కుటుంబాలు యువనేత లోకేష్ సమక్షంలో సోమవారం టీడీపీలో చేరారు. ఉండవల్లిలోని నివాసం లో పార్టీలో కొత్తగా చేరిన వారిని లోకేష్ పసుపు కండు వా కప్పి సాదరంగా ఆహ్వానించారు. తాడేపల్లి పట్టణా నికి చెందిన నాయకులు ఎస్.రామశంకర్, బి.రవి కుమార్తో సహా 20మంది, ఉండవల్లి గ్రామానికి చెందిన శింగంశెట్టి తేజోధర్, ఉప్పు సుబ్బారావు (నాని)తో సహా 20మంది టీడీపీలో చేరారు. అదే విధంగా దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామానికి చెందిన సుమారు 100 కుటుంబాలు నారా లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి.
దుగ్గి రాల మండలం చిలువూరు గ్రామం నుంచి అనంత్ నెమలికంటితో సహా నలుగురు నాయకులు, శ్రీకృష్ణ లెనిన్, గుమ్మడి గోపి, వలపర్ల రామారావు, కనపర్తి హరి , మల్లవరపు మాణిక్యాలరావు, ఆరుమల్ల సుబ్బారావు తో పాటు 15 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. కుంచనపల్లి గ్రామానికి చెందిన బోయిన బన్ను, గంగోలు పనుష్ బాబు, బిరుడుగడ్డ లక్కీ, కాలే కనకరాజుతో పాటు 10 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికి యువనేత నారా లోకేష్ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.