- లాభాల్లో ఉన్న గంగవరం పోర్టును కమీషన్ల కోసం తెగనమ్మిన ఘనుడు జగన్ రెడ్డి
- నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ ను అంపశయ్యపైకి నెట్టి… విద్యుత్ బిల్లుల కోసం వేధిస్తున్న వంచకుడు
- రుషి కొండకు గుండు కొట్టి విశాఖను గంజాయి, డ్రగ్స్ కు అడ్డాగా మార్చాడు
- సిద్ధం పేరుతో ఏ ముఖం పెట్టుకుని విశాఖలో అడుగుపెడతారు
- సైకో మోసాలను తిప్పికొట్టి ఉత్తరాంధ్ర ప్రజలు జగన్ రెడ్డికి బుద్ధి చెప్పాలి
- టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్
అమరావతి, చైతన్యరథం: ఉత్తరాంధ్ర వినాశకారి జగన్ రెడ్డికి విశాఖలో అడుగుపెట్టే అర్హత లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. లాభాల్లో ఉన్న గంగవరం పోర్టును కమీషన్ల కోసం తెగనమ్మిన ఘనుడు, నేడు విశాఖ పోర్టును అంపశయ్యపైకి నెట్టి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను విద్యుత్ బిల్లుల కోసం వేధిస్తున్న వంచకుడు జగన్ రెడ్డి అని తెలిపారు. గంజాయి, డ్రగ్స్ కు విశాఖ ను అడ్డాగా మార్చి, రాజధాని పేరుతో రుషి కొండకు గుండు కొట్టి ప్యాలెస్ ను కట్టుకుని ప్రజలను మోసగించిన జగన్ను ఉత్తరాంధ్ర ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ లో 90 శాతం పడిపోయిన ఉత్పత్తి
జగన్ రెడ్డి గంగవరం పోర్టును తెగనమ్మాక పోర్టులో విశాఖ స్టీల్ కు కోకింగ్ కోల్ దిగుమతికి కోసం ఉన్న ప్రత్యేక బెర్త్ మాయం అయ్యింది. 100 ఎకరాల స్టాక్ యార్డ్ మాయం అయ్యింది. గంగవరం పోర్టును డీవీఎస్ రాజు నడుపుతున్న సమయంలో విశాఖ స్టీల్ కు హ్యండిలింగ్ ఛార్జ్ టన్నుకు రూ. 270 ఉంటే.. జగన్ రెడ్డి పోర్టును అమ్మాక అధికా కాస్త రూ.350 కి పెరిగింది. గంగవరం పోర్టు కార్మికుల సమస్యలను జగన్ రెడ్డి సర్కార్ పట్టించుకోక పోవడంతో పోర్టు స్తంభించింది. గంగవరం పోర్టు స్తంభించడంతో విశాఖ స్టీల్ ప్లాంట్ కు బొగ్గు సరఫరా నిలిచిపోయింది. దీంతో 90 శాతానికి పైగా స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి పడిపోయింది. నేడు గంగవరం పోర్టు మూసి వేతకు, విశాఖ స్టీల్ ప్లాంట్ ఐసీయూలో చేరడానికి కారకుడు జగన్ రెడ్డే. కోడి గుడ్డు మంత్రి గుడివాడ అమర్నాథ్ కు బాధ్యత లేదా ?.. పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం దేనికి చేయడం లేదు. జగన్ రెడ్డి తుగ్లక్ చర్యలతో విశాఖ ఉక్కు పరిశ్రమలో ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. గతంలో ప్రతి రోజు 14 వేల నుండి 15 వేల టన్నుల స్టీల్ ఉత్పాదన జరుగుతూ ఉండేది. ఇవాళ అది కాస్త 4 వేల టన్నులకు పడిపోయింది. అది కూడా 50% కెపాసిటీతోనే నడుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌లు నడవాలి. కాని నేడు ఒక్కటికి పడిపోయింది. నేడు గంగవరం పోర్టు స్తంభించడంతో విదేశాల నుండి దిగుమతి కావాల్సిన కోకింగ్ కోల్ ఆగిపోయింది. కనీసం విశాఖ ఉక్కు పరిశ్రమలో ఎప్పుడూ లక్ష టన్నుల కోకింక్ కోల్ నిల్వ ఉండేది. ఇవాళ కేవలం 4 టన్నుల కోకింగ్ కోల్ మాత్రమే ఉంది. జగన్ రెడ్డి తుగ్లక్ చర్యల వలన విశాఖ స్టీల్ ప్లాంట్ ఎప్పుడైనా ఆగిపోయే పరిస్థితికి వచ్చిందని పట్టాభి మండిపడ్డారు.
కమీషన్ల కోసం ఆదానికి పోర్టును కట్టబెట్టిన జగన్ రెడ్డి
రాష్ట్రానికి ఏం చేశాడని జగన్ కు ప్రజలు జేజేలు కొడతారు. జగన్ రెడ్డి ఉత్తరాంధ్రకు చేసిన వినాశనానికి ప్రత్యక్ష రూపం గంగవరం పోర్టు. అవసరం లేకున్నా లాభాలల్లో ఉన్న పోర్టును తెగనమ్మాడు. గంగవరం పోర్టు అమ్మకంపై ప్రతిపక్షాలు, ప్రజలు నిలదీసినా అదానికి కట్టబెట్టి జగన్ రెడ్డి కమీషన్లు దండుకున్నాడు. గంగవరం పోర్టు ఏర్పాటు చేసేందుకు ఏ గ్రామాల్లో అయితే భూములు తీసుకున్నారో గంగవరం పోర్టులో అక్కడి ప్రజలకు ఉద్యోగాలు కల్పించారు. వారు వేతనాల పెంపుపై ఆందోళన చేస్తున్నారు. వాళ్లు గొంతెమ్మ కోర్కెలు ఏమి కోరడంలేదు. ఇవాళ పెరిగిన కనీస వేతనాలను అడుగుతున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ లను అడుగుతున్నారు. న్యాయబద్దమైన కోర్కెలు కోరుతున్నారు. నిరసనలు చేస్తున్నా యజమాన్యం జరుపుతున్న చర్చలు సఫలీకృతం కావడంలేదు. జిల్లా కలెక్టర్ మాట్లాడినా అది కూడా అమలు కావడంలేదు. జగన్ రెడ్డి కమీషన్ల కక్కుర్తికి గంగవరం పోర్టు నేడు పూర్తిగా స్తంభించి పోయింది.
ఆదుకోకుండా కరెంట్ బిల్లులు కట్టాలని వేధింపులు
కార్మికుల న్యాయబద్దమైన కోర్కెలు పట్టించుకోకుండా.. పోర్టును తెగనమ్మి దాని ప్రభావం విశాఖ స్టీల్ ప్లాంట్ పై పడుతుంటే నేడు సిద్ధం అని జగన్ రెడ్డి వస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ రకంగా దిగజారడానికి కారణం మీరు కాదా ? కరెంట్ బిల్లు కట్టలేదని వైజాగ్ స్టీల్ పీకల మీద కూర్చున్నారు. ఫీజులు పీకేస్తామని బెదిరిస్తున్నారు.. స్టీల్ ప్లాంట్ ను ఆదుకోవాల్సింది పోయి బిల్లులు కట్టలేదని జగన్ రెడ్డి సర్కార్ విద్యుత్ అధికారులను పంపి ఫీజులు పీకమని చెప్పడం సిగ్గుచేటు.
నాశనం చేయడానికే జగన్ సిద్ధం
కమిషన్ల కక్కుర్తికి జగన్ రెడ్డి ఏది చూసినా అమ్మేయడమే. గతంలో స్టీల్ ప్లాంట్ వద్ద ఉన్నవేల ఎకరాలను అమ్మేయమన్నాడు. ఇవాళ దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పిన తరువాతే విశాఖలో అడుగుపెట్టాలి. గంగవరం పోర్టును దేనికి తెగనమ్మారు.? గంగవరం పోర్టులో పరస్థితులు ఈ రకంగా దిగజారిపోవడానికి కారకులు మీరు కాదా? గంగవరం పోర్టు మీరు అమ్మకుండా ఉండి ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఇన్ని కష్టాలు వచ్చి ఉండేవా? ఇవాళ వీటి అన్నింటికి కారకులు మీరు కాదా జగన్ రెడ్డి. విశాఖ ఉక్కు విలవిలలాడుతోంది దీనికి ఏమి సమాధానం చెబుతారు? ప్రొడక్షన్ పడిపోవడంతో 20వ తేదీ వచ్చినా సిబ్బందికి జీతాలు ఇవ్వలేదు. 50 శాతం మాత్రమే జీతాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి గా మీరు చొరవ తీసుకుని గంగవరం పోర్టులో సమస్యను పరిష్కరిస్తే ఇవాళ స్టీల్ ప్లాంట్ కు ఇటువంటి సమస్య ఉత్పన్నం అవుతుందా ? ఆ పని ఎందుకు చేయలేకపోయారు? ఇటువంటి పనులు చేసి మళ్లీ సిద్ధం అంటున్నారు. నాశనం చేయడానికే మీరు సిద్ధంగా ఉంటారు. పరిశ్రమలను మూతవేయడానికే సిద్ధంగా ఉంటారు. కార్మికుల పొట్ట గొట్టడానికి మీరు సిద్ధంగా ఉంటారు. ఎప్పుడైనా మంచి చేశారా మీరు.
హుధుద్ తుపాన్ లో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఆదుకున్న చంద్రబాబు
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించిన రాష్ట్రం ఇది. హుధూద్ తుఫాన్ తో విశాఖ స్టీల్ ప్లాంట్ కు తీవ్ర నష్టం జరిగి పవర్ ఆగిపోతే వారంలో విద్యుత్ ను పునరుద్ధరించి స్టీల్ ప్లాంట్ కు అందించిన ఘనత చంద్రబాబుది. చంద్రబాబు కృషి తోనే గంగవరం పోర్టు నుండి విశాఖ స్టీల్ ప్లాంట్ కు అవసరమైన కోకింగ్ కోల్ దిగుమతి నేరుగా చేరుతుంది. గతంలో విశాఖ పోర్టునుండి కోకింగ్ కోల్ విశాఖ స్టీల్ ప్లాంట్ కు చేరాలంటే అధిక రవాణా ఛార్జీల భారం ఉండేది. చంద్రబాబు విజన్ తో విశాఖ స్టీల్ ప్లాంట్ కు కన్వేయర్ బెల్డ్ ఏర్పాటు చేసి నేరుగా బొగ్గు తరలింపుకు పూనుకున్నారు. దీంతో అధిక ఛార్జీల భారం పూర్తిగా తగ్గింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు మేలు జరిగింది’’ అని పట్టాభి గుర్తు చేశారు.