• గూడూరు నియోజకవర్గం వరగలి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామంలో 15ఏళ్లుగా సింహపురి, మధు కాన్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి.
• పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే అందులో మాకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదు.
• ఉన్నవాళ్లను కూడా కాంట్రాక్టు ప్రాతిపదికన తీసుకుని, కాంట్రాక్టు కాలం ముగిసిన వెంటనే బయటకు పంపేస్తున్నారు.
• ప్రమాదాలు జరిగినపుడు మా గ్రామానికి అంబులెన్సులు సకాలంలో రావడం లేదు.
• బీటెక్, డిగ్రీ చదువుకున్న వాళ్లను కూడా రోజువారీ కూలీలుగా తీసుకుని నెలకు రూ.6వేలు వేతనం మాత్రమే ఇస్తున్నారు.
• మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలను పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• జగన్మోహన్ రెడ్డి పాలనలో యువత భవిష్యత్తు సర్వనాశనమైంది.
• జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీపై జగన్ మాట తప్పి, మడమ తిప్పాడు.
• టిడిపి అధికారంలోకి వచ్చాక పెద్దఎత్తున పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించి, 20లక్షల ఉద్యోగాలిస్తాం.
• అర్హతలను బట్టి యువతకు మెరుగైన ఉద్యోగాలు లభించేలా కృషిచేస్తాం.
• వరగలి గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తాం.