• నెల్లూరు రూరల్ నియోజకవర్గం, వావిలేటిపాడు 12వ డివిజన్ గ్రామస్తులు నారా లోకేష్ ను కలిసి వినతిపత్రం అందించారు.
• నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా మా గ్రామంలో 2,723 ప్లాట్లు మంజూరు చేశారు.
• నివర్ తుఫాన్ సమయంలో మా గ్రామంలోని లే అవుట్ జలమయమైంది. నివాసయోగ్యానికి పనికిరాని స్థలాలు ఇచ్చారు.
• కనీసం ఇప్పటి వరకూ మౌలిక వసతులు కూడా కల్పించలేదు. వర్షాకాలం వస్తే ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
• స్కూల్స్, హాస్పిటల్స్, పార్కులు లాంటి ప్రయోజనాలకు సరిపడ స్థలాలు కేటాయిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• పేదవాడికి ఇచ్చే సెంటు పట్టాలను సైతం వైసిపి దొంగలు ఆదాయవనరుగా మార్చుకున్నారు.
• రాష్ట్రవ్యాప్తంగా కొండలు, గుట్టలు, వాగులు, వంకల్లో పనికిరాని స్థలాలు అంటగట్టి రూ.7వేల కోట్లు దోచుకున్నారు.
• పనికి రాని స్థలాలు ఇచ్చి, ఇల్లు కట్టుకోకుంటే స్థలం రద్దు చేస్తామని బెదిరిస్తున్నారు.
• ఇల్లు కట్టుకోలేదన్న సాకుతో రాష్ట్రవ్యాప్తంగా 3లక్షలమందికి కేటాయించిన స్థలాలను రద్దుచేశారు.
• జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలకోసం రూ.33వేల కోట్లు ఖర్చవుతుందని కేంద్రానికి లేఖరాసిన ముఖ్యమంత్రి, ఇప్పటివరకు మౌలిక సదుపాయాలపై ఒక్క రూపాయి ఖర్చుచేయలేదు.
• టిడిపి అధికారంలోకి రాగానే ఇల్లు లేని పేదలందరికీ పక్కాగృహాలు నిర్మించి ఇస్తాం.
• పేదలు నివసించే గృహసముదాయాల్లో పూర్తి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.