• కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మెయిన్ రోడ్డులో వవ్వేరు కో ఆపరేటివ్ సొసైటీకి చెందిన రైతులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• అధ్యక్షుడు సూరా శ్రీనివాసరెడ్డి సొసైటీని జేబు సంస్థగా మార్చుకుని దోపిడీకి శ్రీకారం చుట్టారు.
• 2019లో సొసైటీ బ్యాంకులో సుమారు రూ.4కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు.
• దీనిపై రైతులు, ప్రతిపక్షాలు పోరాటం చేస్తే 51ఎ ఎంక్వయిరీ వేశారు.
• చైర్మన్ పదవీకాలం ముగిశాక ఎన్నికలు జరపకుండా సూరా శ్రీనివాసరెడ్డి నేతత్వాన త్రీమెన్ కమిటీని నియమించారు.
• 2021లో బంగారం లేకుండా లోన్లు ఇవ్వడం, ఇతరత్రా బినామీ పేర్లతో రూ.2.60 కోట్లు దోచుకున్నారు.
• దీనిపై మళ్లీ పోరాటం చేయడం 52 ఎంక్వయిరీ వేశారు.
• అవకతవకలు బయటపడుతుండటంతో విచారణాధికారి నివేదిక ఇవ్వకముందే సూరా శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు.
• ఈ కుంభకోణాల్లో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి పాత్ర ఉంది.
• గతంలో చైర్మన్ చేసిన అక్రమాల మూలంగా రైతులు అప్పులు పుట్టక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
• మీరు అధికారంలోకి వచ్చాక వవ్వేరు సొసైటీలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి, దోచుకున్న సొమ్మును రికవరీచేయించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో అన్నింటి మాదిరిగానే కోఆపరేటివ్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారు.
• రైతులకోసం ప్రవేశపెట్టిన కోఆపరేటివ్ సొసైటీలను అధికారపార్టీ నాయకులు అక్రమాలకు అడ్డాగా మార్చుకోవడం దారుణం.
• తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే సొసైటీలను దోచుకున్న వైసిపి దొంగలపై విచారణ జరిపిస్తాం.
• సొసైటీల్లో దోచుకున్న సొమ్మును రికవరీ చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
• సొసైటీలను బలోపేతం చేసి రైతులకు ఉపయోగకరంగా తీర్చిదిద్దుతాం.