విజయవాడ: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో స్ధానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అవినీతి తారస్థాయికి చేరిందని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేష్ విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ఆర్య వైశ్యల వన సమారాధనను అడ్డుకుని చరిత్ర హీనుడుగా మిగిలాడని దుయ్యబట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ విసిరే స్థాయి వెల్లంపల్లికి లేదన్నారు. వెల్లంపల్లి సవాల్ ని వాణిజ్య విభాగం తరుపున మేము స్వీకరిస్తున్నాం. పోలీసులను మా పై ఉసికొల్పకుండా వేదిక ఖరారు చేసి చర్చకు రావాలి. కల్లబొల్లి మాటలతో పశ్చిమ నియోజకవర్గ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయొద్దు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దుర్గ గుడి వెండి విగ్రహాలు చోరీ నుండి మొత్తం అవినీతి పై చర్చకు మేమందరం సిద్ధంగా ఉన్నాం. నీ అక్రమ ఆస్తుల చిట్టా బయట పెడతాం. వైకాపా చీటీి చిరిగిపోవటంతో మతిపోయి పిచ్చి, పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నావ్. వెల్లంపల్లి నోరు అదుపు లో పెట్టుకోక పోతే దేహశుద్ధి చేయటం ఖాయమని డూండీ రాకేష్ హెచ్చరించారు.