- కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపిక నుంచి.. ఎమ్మెల్సీ ఓట్ల నమోదు దాకా అన్నింటా తానై
- ఆంధ్రా యూనివర్సిటీని వైసిపి బ్రాంచిగా మార్చేసిన ఘనుడు విసి ప్రసాదరెడ్డి
- మహనీయులు ఏలిన వర్సిటీని సర్వభ్రష్టుత్వం పట్టించిన ఘనాపాటీ!
- విసి జగన్నామస్మరణతో విద్యార్థుల అయోమయం
(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – విశాఖపట్నం)
చదువులతల్లి ఆంధ్రా యూనివర్సిటీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థగా మార్చేసిన ఆ గంజాయిమొక్క మానై చారిత్రాత్మక విశ్వవిద్యాలయంలో విషబీజాలు నాటుతూ అపఖ్యాతి మూటగడుతోంది. వర్సిటీని సర్వభ్రష్టుత్వం పట్టించిన ఆ మొక్క పేరే వైస్‌చాన్స్‌లర్ పివిజిడి ప్రసాదరెడ్డి. అధికారపార్టీకి తొత్తుగా మారి విద్యాబుద్దులు నేర్పా ల్సిన యూనివర్సిటీని తప్పుడు రాజకీయాలకు, రాజకీయ కుట్రలకు కేంద్రబిందువుగా మార్చిన ఘనుడాయన.
భారతదేశ స్వాతంత్రోద్యమానికి ఊపిరిలూది ఎందరో మహనీయులకు స్పూర్తిగా నిలచిన తులసీవ నం లాంటి ఆంధ్రా యూనివర్సిటీ వాతావరణాన్ని ఓ గంజాయి మొక్క ఏడాదిన్నర కాలంగా పూర్తి కలు షితం చేస్తోంది. చదువులతల్లి ఆంధ్రా యూనివర్సిటీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థగా మార్చేసిన ఆ గంజాయిమొక్క మానై చారిత్రాత్మక విశ్వవిద్యాలయంలో విషబీజాలు నాటుతూ అపఖ్యాతి మూటగడుతోంది. వర్సిటీని సర్వభ్రష్టుత్వం పట్టించిన ఆ మొక్క పేరే వైస్ చాన్స్‌లర్ పివిజిడి ప్రసాదరెడ్డి. అధికారపార్టీకి తొత్తుగా మారి విద్యాబుద్దులు నేర్పా ల్సిన యూనివర్సిటీని తప్పుడు రాజకీయాలకు, రాజ కీయ కుట్రలకు కేంద్రబిందువుగా మార్చిన ఘనుడా యన. రాజకీయాలకు అతీతంగా భావిభారత పౌరు లను తయారుచేసే పవిత్రయజ్జాన్ని అంతఃకరణ శుద్ధి తో నిర్వర్తించాల్సిన విసి ప్రసాదరెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తూ పదవికి, ఆచార్య అనే పదానికే కళంకం తెస్తున్నారు. ఆంధ్రావర్సిటీ చిహ్నంలో ఉన్న తేజస్వినావధీతమస్తు అనే వాక్యానికి ‘‘నీ దివ్యమైన కాంతితో మా జ్ఞానాన్ని పెంపొందించు’’ అని అర్ధం. ఈ పదానికి ప్రసాదరెడ్డి మార్చివేసి నీ దివ్యమైన కాం తితో మా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బతికించు అనే నినాదంతో విద్యార్థుల్లో విషబీజాలు నాటుతున్నారు. జగన్ చేత నియమితులైన ప్రసాదరెడ్డి జగన్ కోసమే పనిచేస్తూ యూనవర్సిటీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థగా మార్చేసి భ్రష్టుపట్టిస్తున్నారు. జగన్ రెడ్డి తొత్తుగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారి ఆంధ్రా యూనివర్సిటీని అన్ని విధాలా భ్రష్టుపట్టించిన ప్రసాదరెడ్డి నిర్వాకాన్ని మీ ముందుకు తెస్తోంది చైతన్యరథం.
మహనీయులు ఏలిన గడ్డ ఆంధ్రావర్సిటీ
భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, సర్ కట్టమంచి రామలింగారెడ్డి, లంకపల్లి బుల్లయ్య, జస్టి స్ ఆవుల సాంబశివరావు వంటి ఎందరో మహనీ యులు ఉపకులపతులుగా వ్యవహరించిన భారతదేశ ప్రాచీన విశ్వవిద్యాలయాల్లో పేరేన్నెకగన్నది విశాఖ పట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం. నోబెల్ బహు మతి గ్రహీత, ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ సివి రామన్, ఆచార్య బి ఆర్ రావు, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు, భారత మాజీరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, మిజోరాం ప్రస్తుత గవర్నర్ కంభంపాటి రామ్మోహన్‌రావు వంటి ఎందరో మేధావు లను దేశానికి అందించిన చారిత్రక నేపథ్యం గల ప్రఖ్యాత విశ్వవిద్యాలయమే ఆంధ్ర విశ్వవిద్యాలయం. స్వాతంత్య్రానికి పూర్వం 1926లో ఆవిర్భవించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి విడివడి1954లో రాయలసీమ జిల్లాల కళా శాలతో తిరుపతి కేంద్రంగా శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం ఏర్పడిరది. 1967లో ఆంధ్రా యూన వర్సిటీ ఒక పోస్టుగ్రాడ్యుయేటు కేంద్రాన్ని గుంటూరు లో ఏర్పాటు చేయగా, 1976లో నాగార్జున విశ్వ విద్యాలయంగా అవతరించింది. ఆంధ్ర విశ్వవిద్యాల య చిహ్నాన్ని కట్టమంచి రామలింగారెడ్డి(సిఆర్‌రెడ్డి) ఉపకులపతిగా ఉన్న సమయంలో కౌతా రామ మోహ నశాస్త్రి రూపకల్పన చేశాడు.
వర్సిటీ స్వరూపాన్నే మార్చేసిన ఘనుడు
విశ్వవిద్యాలయాల్లో పనిచేసే అధ్యాపకులు భావి భారత దేశానికి పదనిర్దేశకులు. రాజకీయాలకు అతీ తంగా విద్యావేత్తలను తయారుచేయడం వారి వృత్తి ధర్మం. ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన వారు రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తూ విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తయారుచేయాల్సిన గురు తరమైన బాధ్యత వారిపై ఉంటుంది. అందుకే ఒక ప్రత్యేక చట్టం ద్వారా యూనివర్సిటీలకు స్వయం ప్రతి పత్తి హోదా కల్పించారు. విశ్వవిద్యాలయ ఔన్నత్యాన్ని కాపాడవల్సిన గురుతర బాధ్యతను విస్మరించిన ప్రస్తు త విసి ప్రసాదరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేతగా మారి విశ్వవిద్యాలయ స్వరూపాన్నే మార్చేశారు. రెం డేళ్ల క్రితం విసిగా బాధ్యతలు చేపట్టిన పివిజిడి ప్రసాద్‌రెడ్డి తన రాజకీయ స్వార్ధం కోసం విశ్వ విద్యా లయ పేరుప్రతిష్టలను మసకబారేలా వ్యవహరి స్తున్నా రు. అధికారపార్టీలో తమప్రాబల్యం కోసం బరితెగించి వర్సిటీ వేదికగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తు న్నారు. 16 నెలలు చిప్పకూడు తిన్న ఆర్థిక నేరగాడు విజయసాయిరెడ్డి జన్మదిన వేడుకలను సిగ్గూ,లజ్జా వదిలేసి ఎ.యు సెనేట్ హాల్లో అధికారి కంగా నిర్వహించడం ప్రసాదరెడ్డి బరితెగింపునకు నిదర్శనం. అధికారపార్టీ కార్యక్రమాలను విజయ వంతం చేసే బాధ్యతను తానే తలకెత్తుకోవడం, వైసిపి కార్యక్రమా ల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారా యూనివర్సిటీ యంత్రాంగంలో తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారు. కోవిడ్ సమయంలో నాన్ టీచింగ్ ఉద్యోగులతో వైయస్సార్సీపి అధికారిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వర్సిటీ ప్రతిష్టను మసకబార్చారు.
కులరాజకీయాలకు తెరలేపిన ప్రసాదరెడ్డి
ఆంధ్ర విశ్వవిద్యాలయ చరిత్రలో ఏ ఉపకులపతి చేయని విధంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఈసి నిబంధనలు, సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా పనిచేస్తూ సర్వీసు రూల్స్ ను అతిక్రమించి ఏపీ విశ్వవిద్యాలయాల చట్టం – 1991ని యథేచ్చగా ఉల్లంఘిస్తున్నారు. స్థానిక జీవీ ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హోటల్ గ్రీన్ పార్క్ లో ‘రెడ్డి’ కుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలి పించాలని, ప్రతిపక్ష పార్టీలను ఓడిరచాలని ప్రచారం చేశారు.ఈయన ప్రవర్తనపై విచారణ చేయాలని ఏకం గా ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చాయంటే ప్రసాదరెడ్డి ఏస్థాయికి దిగజారాడో అర్థమవుతుంది. ఆంధ్రవిశ్వవిద్యాలయానికి 2008వ సంవత్సరం నుం డి యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా మూడు సంవత్సరాల పాటు పనిచేసి యూనివర్సిటీ చట్టంలోని లొసుగుల ను అవపోసన పట్టారు. సర్వీసులో సీనియర్ ఆచార్యు నికి మాత్రమే అవకాశం ఉన్న యూనివర్సిటీ రెక్టార్ పదవిని ఆనాడు అందరికన్నా జూనియర్ అయినప్ప టికీ చాకచక్యంగా చేజిక్కించుకొని విశ్వవిద్యాలయం లో అడ్డగోలుగా వ్యవహరాలకు తెరలేపారు. వర్సిటీ ముద్రణాలయంలో కోట్లాది రూపాయలు కుంభకోణా లకు పాల్పడ్డా డని అప్పట్లో పత్రికల్లో పతాక శీర్షికల్లో వార్తలువచ్చాయంటే ప్రసాద్‌రెడ్డి నీచచరిత్ర ఎంతఘన మైనదో అర్థంచేసుకోవచ్చు.క్రమశిక్షణకు మారుపేరైన ఆచార్య సింహాద్రి ఉపకులపతిగా ఉన్న సమయంలో విశ్వవిద్యాలయానికి క్లాసులకు సమయానికి హాజరు కాకుండా గోడదూకి వర్సిటీలోకి ప్రవేశించి చర్యలనుంచి తప్పించుకున్న చరిత్ర ఈయనది.
ఆదినుంచి వైసిపి తొత్తుగానే…!
2014 ఎన్నికల సమయంలో యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తూనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలక్షన్ సర్వే లు నిర్వహించారు. కంప్యూటర్ ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ లోనే నాయకులతో రాజకీయ సమావేశాలు నిర్వహించారు. అప్పట్లోనే విజయసాయిరెడ్డి అండదండలతో అభ్యర్థులకు టిక్కెట్లు ఇప్పిస్తానని కోట్లాది రూపాయల నిధులు వసూలు చేశారని ప్రచారం జరిగింది. సోషల్ సర్వేలపై ఏమాత్రం అవగాహన లేని కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆచార్యుడు ఎలక్షన్ సర్వేలు చేయడమేంటని వర్సిటీలోని సీనియర్ అధ్యాపకులు ముక్కున వేలేసుకున్నారు. అప్పట్లో విశాఖ పార్లమెంటుస్థానం నుండి ఎంపీగా పోటీ చేసిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మను గెలిపిస్తానంటూ నగర పార్టీ అధ్యక్షుడు మల్లా విజయప్రసాద్ తో కలిసి ఎన్నికల క్యాంపెయిన్ పేరుతో కోట్లాది రూపాయలు కొట్టేసి ఆమెను నట్టేటముంచారు. ఈ విషయమై వైసిపి అధినేత జగన్ కు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. 2019 ఎన్నికలలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎఫ్.ఎ.సి ఉప కులపతిగా ఆంధ్ర యూనివర్సిటీకి నియమితులయ్యారు. ఎఫ్‌ఎసిగా ఏడాదిన్నర పనిచేసి గత ఏడాది నవంబర్‌లో ఎ2 విజయసాయిరెడ్డి అండ దండలతో మళ్లీ పూర్తిస్థాయి ఉపకులపతిగా నియ మితులయ్యారు. విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహి తుడిగా ప్రచారం కావడంతో చోటా మోటా రాజకీయ నాయకులు ఏయూకి క్యూ కట్టడం పరిపాటిగా మారింది. ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో దాదాపు 25మంది కార్పొరేట్ అభ్యర్థులవద్ద నుంచి 50లక్షల నుంచి కోటి రూపాయల వసూలుచేసి టిక్కెట్లు ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. విద్యాసంబం ధమైన విషయాల్లో ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు, విద్యార్థిసంఘనేతలు, ఉద్యోగులకు అపాయింట్మెంట్ ఇవ్వని ప్రసాదరెడ్డి వర్సిటీ సమస్యలను గాలికొదిలి తన అధికారిక చాంబర్లో ఎప్పుడు రాజకీయ సమావేశాలే నిర్వహిస్తుంటారు. ఈయన జోక్యం భరించలేక విజయసాయిరెడ్డి ఆఫీసులోనే ఒక సీని యర్ వైయస్సార్సీపీ నాయకుడు నీకేంటి సంబంధ మంటూ ప్రసాద్ రెడ్డిని అసభ్య పదజాలంతో బండ బూతులు తిట్టి కొట్టబోయాడన్న వార్తలు హల్ చల్ చేశాయి. కడుపుమండి మాట్లాడిన ఆ నేతపై లేని పోనివి బనాయించి ఏకంగా పార్టీ నుండి బహిష్కరిం ప చేశాడంటే ప్రసాదరెడ్డి ఎంతటి చాణుక్యుడో అర్థంచేసుకోవచ్చు.