- పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలి
- అధికారులకు సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ ఆదేశం
అమరావతి(చైతన్యరథం): విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు సంబంధించి రహదారుల విస్తరణ, పరిశ్రమలకు అవసరమైన భూమి, విద్యుత్, రహదారులు, నీటి వసతి వంటి కనీస మౌలిక సదుపాయాల కల్పనకు వేగవంతంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో విశాఖపట్నం-చెన్నె ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి ప్రోగ్రామ్‌కు సంబంధించిన 5వ స్టీరింగ్ కమిటీ సమావేశం సీఎస్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి అత్యంత ప్రతిష్టాత్మకమైన విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రి యల్ కారిడార్‌లో ఏర్పాటు అవుతున్న వివిధ పరిశ్రమలు, కంపెనీలకు అవసరమైన భూమి, మెరుగైన రహదారులు, విద్యుత్, నీరు వంటి మౌలిక సదుపాయాలను సకాలంలో కల్పిం చడం ద్వారా పెద్దఎత్తున పరిశ్రమలు ఏర్పాటు అయ్యేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు.
పనులు వేగవంతం చేసేందుకు వీలుగా నెలవారీ, పనివారీగా భౌతిక, ఆర్థిక లక్ష్యాల ప్రగతి నివేదికలను సిద్ధం చేసి ఇస్తే ఆసియా అభివృద్ధి బ్యాంకుకు పంపి సకాలంలో మిగతా నిధులు మంజూరయ్యేలా చూస్తామని చెప్పారు. విశాఖపట్నం-చెన్నె పారిశ్రామిక నడవాకు సంబంధించి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) నిధులకు రాష్ట్ర ప్రభుత్వ వాటాలుగా ఇప్పటివరకూ ఏపీఐఐసీ, ఆర్టీసీ, ట్రాన్స్‌కో, జీవీఎంసీలకు మంజూరు చేసిన నిధులు, ఇప్పటివరకూ జరిగిన పనుల ప్రగతిపై సీఎస్ సమీక్షించారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు విశాఖపట్నం-చెన్నె ఇండస్ట్రియల్ కారిడార్ ఎంతో కీలకమైనదని తెలిపారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ దేశంలో 11 ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు కాగా వాటిలో మూడు విశాఖపట్నం-చెన్నై, చెన్నై-బెంగుళూరు, బెంగు ళూరు-హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్లు ఆంధ్రప్రదేశ్‌తో అనుసంధానమై ఉన్నాయని తెలిపారు. విశాఖపట్నం-చెన్నె పారిశ్రామిక కారిడార్ అభివృధ్ధికి సంబంధించిన పనుల భౌతిక, ఆర్థిక లక్ష్యాల ప్రగతిని, ఇతర అం శాలను వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ సిహెచ్.శ్రీధర్, ఏపీ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్, ట్రాన్స్‌కో, ఆర్థిక, పరిశ్రమల శాఖల అధికారులు, వర్చువల్‌గా రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, ఏపీఐఐసీ ఎండీ అభిషిత్ పాల్గొన్నారు.