- సీబీఐ విచారణ కోరి తర్వాత వద్దన్న జగన్
- విచారణకు అడుగడుగునా అడ్డంకులు
- అవినాష్ రెడ్డిని కాపాడేందుకు సకల ప్రయత్నాలు
- వివేకా హంతకులను ప్రజలే శిక్షించాలన్న సునీత
- నాడు చంద్రబాబే హంతకుడన్న జగన్
- నేడు ‘జగన్! బాబాయ్‌ని నువ్వే చంపావు’ అంటున్న ప్రజలు
వైఎస్ కుటుంబంలో ప్రముఖ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ వైఎస్ వివేకానందరెడ్డి దారుణ గొడ్డలి వేటుకు బలై నేటికి ఐదేళ్లు. ఆయన మాజీ ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి స్వయాన తమ్ముడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి సొంత బాబాయి. వైఎస్‌ఆర్‌కు అత్యంత ఆప్తుడు మరియు అత్యంత విశ్వసనీయుడు. పలుసార్లు శాసన సభ్యునిగా, లోక్ సభ సభ్యునిగా, మంత్రిగా పనిచేసిన వివేకానందరెడ్డి సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రముఖుడైన అటువంటి వ్యక్తి 2019, మార్చి 14 అర్ధ రాత్రి తరువాత (తెల్లవారితే మార్చి 15) పులివెందుల లోని స్వగృహంలో దారుణంగా హత్య చేయబడ్డారు.
హూ కిల్డ్ బాబాయ్?
గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజలను వెంటాడిన ప్రశ్న.. బాబాయ్ ని ఎవరు చంపారు? హూ కిల్డ్ బాబాయ్? వివేకా హత్య జరిగిన రోజున వెలువడిన జగన్మోహన్ రెడ్డి అవినీతి మానసపుత్రిక ‘సాక్షి’లో ‘నారాసుర రక్తచరిత్ర’ అంటూ చంద్రబాబు చేతిలో గొడ్డలి పెట్టి హంతకుడు అన్నట్లుగా గత ఎన్నికలకు ముందు జగన్ బృందం దుష్ప్రచారం చేసి హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో భారీగా లబ్ధిపొందింది. అయితే.. ఈ గొడ్డలి వేటుకు సంబంధించిన కుట్ర, సూత్రధారులు, పాత్ర ధారులకు సంబంధించిన వాస్తవాలు సీబీఐ విచారణ చేపట్టినప్పటినుండి వెల్లడై రాష్ట్ర
ప్రజలను విస్మయానికి గురిచేశాయి.
ప్రతి నేరానికి ఒక లక్ష్యముంటుంది. అదేంటో తెలుసుకోవటంపై నేర పరిశోధనలో మొదట దృష్టి కేంద్రీకరిస్తారు. వివేకా హత్య కేసు విచారణను చేపట్టి న సీబీఐ అదే పని చేసింది. వారి విచారణలో.. వైఎస్ కుటుంబ రాజకీయాలే వివేకా హత్యకు కారణభూత మని అభిప్రాయపడి, ఆ దిశగా సీబీఐ విచారణ వేగాన్ని పెంచింది. దాంతో తీగ లాగితే డొంకంతా కదిలినట్లు కుట్రకు సంబంధించిన భయంకరమైన వాస్తవాలు కుప్పలు తెప్పలుగా వెల్లడయ్యాయి. వివేకా హత్య కుట్ర లో సూత్రధారులు, పాత్రధారుల పట్ల రాష్ట్ర ప్రజల్లో ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడిరది.
సీటు కోసమే వేటు
సీబీఐ విచారణలో పుంఖాను పుంఖాలుగా వెల్లడైన సమాచారం రాష్ట్ర ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. జగన్మోహన్‌రెడ్డికి వరుసకు సోదరుడైన అవినాష్‌రెడ్డి రాజకీయ ఎదుగుదలకు వివేకానందరెడ్డి ప్రధాన అడ్డంకిగా మారుతున్నందున ఆయనను అడ్డు తప్పించాలన్న లక్ష్యంతో వివేకాపై గొడ్డలి వేటుకు పథక రచనకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడైంది. వైఎస్‌ఆర్ బతి కున్నంతకాలం ఆయన తరపున స్థానిక, జిల్లా రాజకీ యాన్ని వివేకా పర్యవేక్షించేవారు. వైఎస్‌ఆర్ మరణానం తరం వివేకానే పెద్దదిక్కయ్యారు. ఈ రాజకీయ పెత్త నాన్ని తమ చేతుల్లోకి తీసుకొని తమ రాజకీయ ఆధి పత్యానికి అడ్డు తొలగించుకోవాలని అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి
భాస్కర్‌రెడ్డితోపాటు ఇతరులు ప్రణాళిక వేసుకున్నారు.
2019 లోక్ సభ ఎన్నికల్లో అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వటాన్ని వివేకా తీవ్రంగా వ్యతిరేకించారు. తనను రాజకీయంగా దెబ్బతీయటానికి 2017లో జరిగిన శాస నమండలి ఎన్నికల్లో అవినాష్‌రెడ్డి ఇతరులతో కలిసి తనను ఓడిరచారని వివేకా గట్టిగా విశ్వసించటంతో.. అవినాష్ అభ్యర్థిత్వాన్ని ఆయన తీవ్రంగా ప్రతిఘటిం చారు. అవినాష్‌రెడ్డి జగన్ కుటుంబానికి అత్యంత ఆత్మీ యుడు.. అలా మొదలైంది.. జగనాసుర రక్త చరిత్ర!
సీబీఐ విచారణ వేగం పుంజుకోవడంతో డొంకంతా కదిలి వివేకా హత్యలో అవినాష్‌రెడ్డి ప్రధాన నింది తుడయ్యారు. ఆ క్షణం నుంచి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాత్ర పలు తీవ్ర అనుమానాలకు తెరతీసింది. అవినాష్ అరెస్టు కాకుండా చూసేందుకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేయని ప్రయత్నం లేదు. సీబీఐకి రాష్ట్ర పోలీసులు సహకరించకపోటం, విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులపైనే కేసులు నమోదుచేయటం, కర్నూలులో అవినాష్ ను అరెస్టు చేయటానికి సీబీఐ బృందం వెళ్లినప్పుడు వైసీపీ మూకలు అడ్డుకున్న వైనం, పలు సాకులతో సీబీఐ విచారణలో జాప్యం, ఇత్యాధికాలు వివేకా హత్య సూత్రధారులు, పాత్రధారుల రూపురేఖల ను స్పష్టం చేశాయి.
హంతకులను ప్రజలే శిక్షించాలి : సునీత
ముఖ్యమంత్రి జగన్ సొంత చెల్లెలు షర్మిల, బాబాయి వివేకా కూతురు డాక్టర్ సునీత హత్యకు సంబంధించిన పలు విషయాలు, అనుమానితులు, పాత్రధారులపై పలు సంచలనాత్మక విషయాలను సీబీఐకు తెలియజేసి,విచారణలో జరుగుతన్న జాప్యాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. ఫలితంగా.. జగన్‌రెడ్డి ఇద్దరు చెల్లెళ్లపై ఆయన బృందగణం నీచంగా వ్యక్తిగత దాడుల కు దిగజారారు. గత ఐదేళ్లుగా తన తండ్రి హత్యకు సంబంధించిన వాస్తవాలు వెల్లడై, నేరస్థులకు తగు శిక్షలుపడేలా చేసేందుకు వివేకాకూతురు సునీత చాలా పట్టుదలగా న్యాయపోరాటం చేస్తూ వచ్చారు.
ఒక అడు గు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతున్న విచారణతో విసిగి వేసారి.. వివేకా హత్యపై చివరకు ప్రజల తీర్పును కోరారు. ఈ నెల ఒకటిన ఢల్లీిలో పత్రికా సమావేశం నిర్వహించి వివేకా హత్యకు దారితీసిన పరిస్థితులు, కుట్రకు సూత్రధారులు, పాత్ర ధారుల గురించి తన అభిప్రాయాలను వెల్లడిరచి.. ఇటువంటి ఘోరమైన నేరాలు రాష్ట్రంలో పునరావృతం కాకుండా ఉండాలంటే త్వరలో జరగనున్న ఎన్నికల్లో వారిని ఓడిరచాలని చాలా స్పష్టంగా ప్రజలకు సునీత విజ్ఞప్తి చేశారు. ఇది రాష్ట్రంలో రాజకీయ సంచలనాన్ని సృష్టించింది. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిని ఇప్పటిదాకా సీబీఐ ఎందుకు విచారించలేదు అన్నట్లుగా ఆవిడ వ్యాఖ్యానించారు. అవినాష్ అరెస్టుఎందుకు జరగలేదని సునీత నిలదీశారు.దీంతో..వివేకా హత్యలో సూత్రధారు లెవరో, పాత్రధారులెవరో డాక్టర్ సునీత సూచించారు.
‘యూ కిల్డ్ బాబాయ్’
ఈ విధంగా పలు ఇబ్బందులు, సవాళ్ల మధ్య ఇప్పటివరకు సాగిన సీబీఐ విచారణతో వెల్లడైన సమా చారం, వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి పలు సంద ర్భాల్లో వ్యక్తం చేసిన అభిప్రాయాలు, తాజాగా ఢల్లీిలో పత్రికా సమావేశంలో ఆమెచేసిన వ్యాఖ్యలతో, అవినాష్ రెడ్డితో పాటు ఇతర నిందితులను రక్షించటానికి ముఖ్య మంత్రి జగన్‌రెడ్డి చేసిన సకల ప్రయత్నాలు ‘హూ కిల్డ్ బాబాయ్?’ అన్న ప్రశ్నకు సమాధానంగా ‘యూ కిల్డ్ బాబాయ్!’ అంటూ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి జగ న్మోహన్‌రెడ్డి వైపు వేలు చూపుతున్నారు. వివేకానంద రెడ్డి హత్య స్పష్టంగా ‘జగనాసుర రక్తచరిత్ర’ అని ప్రజాభిప్రాయం.
జగన్‌రెడ్డి సమాధానం చెప్పాలి
తన బాబాయ్ వివేకానందరెడ్డి హత్యకు గురైన 2019, మార్చి 15 వేకువజామున ముఖ్యమంత్రి తన స్వగృహంలో మేనిఫెస్టో సమావేశంలో ఉన్నారు. ఒక ఫోను రావడంతో ఆయన ఆ సమావేశాన్ని వీడి మేడ పైకి వెళ్లి 10 నిమిషాల్లో తిరిగి వచ్చి సమావేశంలో ఉన్న మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం, ఇతరులతో.. బాబాయ్ నో మోర్ (బాబాయ్ ఇకలేరు).. అని చాలా యథాలాపంగా చెప్పి తన రాజకీయ మేనిఫెస్టో సమావేశాన్ని కొనసాగించారు.
ఈ సమావేశం ముగిసిన కొంతసేపటికి జగన్‌రెడ్డి సొంత టీవీ ‘సాక్షి’ లో.. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారన్న వార్త బ్రేకింగ్ న్యూస్‌గా వేశారు. కొన్ని గంటల తరువాత ప్లేటు ఫిరాయించి వివేకా హత్యకు గురయ్యారని ప్రసారం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్య మంత్రి జగన్‌రెడ్డి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి
1. వివేకా మరణం గురించి జగన్‌కు వేకువ జామున సమాచారం ఇచ్చినవారు దానికి కారణం ఏంచెప్పారు? గుండెపోటనా? గొడ్డలివేటనా?
2. కొన్ని గంటలపాటు వివేకా గుండెపోటుతో చనిపోయారని టీవీల్లో ప్రసారమైతే.. తనకు తెలియజేయబడిన కారణం గొడ్డలివేటైతే, టీవీ వార్తలను జగన్ ఎందుకు అడ్డుకోలేదు?
3. తనకు సమాచారం ఇచ్చినవారు గుండెపోటు వల్లనే వివేకా మరణించారని చెబితే.. దారుణ గొడ్డలివేటు వాస్తవం వెల్లడైన తరువాత.. తనను తప్పుదోవ పట్టించిన వారిపై జగన్‌రెడ్డి ఎటువంటి చర్యలు తీసుకున్నారు?
4. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి వివేకా హత్యలో అవి నాష్‌రెడ్డి పాత్రలేదన్న విశ్వాసం ఉంటే.. అది సీబీఐ విచారణలో వెల్లడైయ్యేటట్లు వ్యవహరించకుండా.. అందుకు బిన్నంగా అవినాష్‌రెడ్డి అరెస్టును అడ్డు కునేందుకు ఎందుకు విశ్వప్రయత్నం చేశారు?
5. ప్రతిపక్ష నాయకునిగా వివేకా హత్య కేసులో సీబీఐ విచారణను డిమాండ్ చేసి తరువాత ముఖ్యమంత్రి అయ్యాక కోర్టులో ఈ మేరకు వేసిన పిటిషన్ ను ఎందుకు ఉపసంహరించుకున్నారు?
6. వివేకానందరెడ్డి వంటి ప్రముఖ వ్యక్తిని అడ్డు తొలగించే కుట్ర, దాని అమలు వైఎస్సార్ కుమారుడు, ప్రతిపక్ష నాయకుడు అయిన జగన్ రెడ్డికి తెలియకుండా జరుగుతుందా?
ఈ ప్రశ్నలు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సమాధానం చెప్పలేనివి. అస్మదీయుల గొడ్డలి వేటుకు సొంత బాబాయి బలై ఐదేళ్లు నిండినా ఏనాడు లేశమంత బాధనైనా వ్యక్తం చేయని జగన్ రెడ్డి నిందితుల రక్షణ కోసం చేసిన పలు నిర్వాకాలు ఆయనను ప్రధాన దోషిగా నిలబెట్టాయి. అందుకనే రాష్ట్ర ప్రజలు.. ‘జగన్ రెడ్డి! యూ కిల్డ్ బాబాయ్! అని ముక్త కంఠంతో అంటున్నారు.